Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
శ్రీ కృష్ణదేవ రాయలు - వికిపీడియా

శ్రీ కృష్ణదేవ రాయలు

వికీపీడియా నుండి

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు
మొదటి బుక్క రాయలు
రెండవ హరిహర రాయలు
విరూపాక్ష రాయలు
రెండవ బుక్క రాయలు
మొదటి దేవరాయలు
రామచంద్ర రాయలు
వీర విజయ బుక్క రాయలు
రెండవ దేవ రాయలు
మల్లికార్జున రాయలు
రెండవ విరూపాక్ష రాయలు
ప్రౌఢరాయలు
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు
తిమ్మ భూపాలుడు
రెండవ నరసింహ రాయలు
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు
వీరనరసింహ రాయలు
శ్రీ కృష్ణదేవ రాయలు
అచ్యుత దేవ రాయలు
సదాశివ రాయలు
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు
తిరుమల దేవ రాయలు
శ్రీరంగ దేవ రాయలు
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు
శ్రీరంగ రాయలు
వేంకటపతి రాయలు
శ్రీ రంగ రాయలు 2
వేంకట పతి రాయలు
హైదరాబాదులోని టాంక్‌బండ్ పై శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహము
హైదరాబాదులోని టాంక్‌బండ్ పై శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహము

విషయ సూచిక

[మార్చు] పట్టాభిషేకము

శ్రీ కృష్ణ దేవ రాయలు తుళువ నరస నాయకుడు, నాగలాంబ ల కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509లో సరిగ్గా ఫిబ్రవరి 4 న విజయనగర రత్న సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతను సింహాసనం అధిష్ఠించడానికి మహామంత్రి తిమ్మరుసు చాలా సహాయం చేసినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలునూ, వీర నరసింహ రాయలు అనుచరులను తిమ్మరసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు.

[మార్చు] రాజ్య పరిస్థితులు

ఇతను రాజ్యం అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా గందరగోళంగా ఉన్నది. దక్షిణాన సామంతులు స్వతంత్రులు అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొని తమ రాజ్యంలో కలుపుకొని, కొండవీడు, ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. బహుమనీ సుల్తానులు రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చాడు.

[మార్చు] యుద్ధములు

[మార్చు] దక్షిణ దేశ దండయాత్ర

ఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి, 1512 వరకూ మూడు సంవత్సరములు సైనిక సంపత్తిని పెంపొందించుకొని తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు.

కావేరీ నదీ తీరంలోని శివపట్టణ పాలకుడు గంగరాజు. ఇతను విజయనగర సామంతుడయినప్పటికీ విజయనగర రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని కప్పం చెల్లించక స్వతంత్రముగా ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి గంగరాజుపై యుద్ధం చేసి గెలిచచాడు. గంగరాజు కావేరి నదిలో పడి ప్రాణాలు వదిలినాడు.

తరువాత ఉమ్మత్తూరు, కర్నాటక, మైసూరు ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క రాయలును వాటికి సామంతుగా చేసినాడు. తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను జయించి ఆ ప్రాంతములను కెంపెగౌడ, వీర గౌడలను పాలకులుగా నియమించినాడు. (ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు నిర్మాతలు). తరువాత మలయాళ ప్రాంతములను జయించి, వారినుండి కప్పములను వసూలు చేసినాడు.

విజయప్ప, వేంకటప్ప నాయకులను పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ సామంతులుగా నియమించాడు. విజయప్పనాయుడు, వెంకటప్ప నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై చిత్తూరు, జింజి, తొండమండలము, మధుర, తిరునగరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతములను జయించాడు. వీరందరి నుండి ఎంతో కప్పమును వసూలు చేసాడు. ఒక్క జింజి నగరమునుండే సంవత్సరమునకు మూడు కోట్ల రూపయల విలువైన కప్పం వచ్చేది. దీనితో దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది, పరిపాలనా సౌలభ్యం కోసం దీని మూడు భాగములుగా విభజించి నాడు.

జింజి
జింజి కేంద్రముగా కృష్ణప్ప నాయకుడు అధిపతిగా నెల్లూరు మొదలగు ప్రాంతములు ఉండెను.
తంజావూరు
తంజావూరు కేంద్రముగా విజయ రాఘవ నాయకుడు అధిపతిగా కావేరీ నదీ తీరప్రాంతములను రెండవ కేంద్రము.
కొడగు
కొడగు కేంద్రముగా వెంకటప్ప నాయకుడు అధిపతిగా మళయాళ ప్రాంతము మూడవ భావము.

ఈ దక్షిణదేశ దండయాత్ర తరువాత రాయలు రాజధానికి తిరిగి వచ్చాడు.

[మార్చు] తూర్పు దిగ్విజయ యాత్ర

మహామంత్రి తిమ్మరుసు నాయకత్వంలో చక్కని సైన్యమును తూర్పు దిగ్విజయ యాత్రకు పంపించినాడు.

[మార్చు] సైనిక విశేషములు

తిమ్మరుసు సైన్యమును చక్కగా వ్యూహాత్మకంగా విభజించినాడు. మొత్తం సైన్యాన్ని ఏడు భాగములుగా విభజించినాడు. ఒక్కొక్క విభాగములోను కింది దళాలు ఉన్నాయి:

  • 30,000 కాల్బలము
  • నాలుగు వేల అశ్విక దళము
  • రెండువందల ఏనుగులు

ఈ విభాగాలకు అధ్యక్షులుగా కింది వారిని నియమించాడు.

  1. రాయసము కొండమరుసు
  2. పెమ్మసాని రామలింగన్న నాయుడు
  3. గండికోట రేచర్ల కుమార తిమ్మనాయుడు
  4. వెలుగోడు గంగాధరరెడ్డి
  5. అకినీడు ఇమ్మరాజు
  6. ఆరవీటి నారపరాజు
  7. ఆరవీటి శ్రీరంగరాజు

[మార్చు] ఉదయగిరి విజయం

ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా 1513లో ఉదయగిరిని ముట్టడించినాడు. రాయసము కొండమరుసు విజయనగర సేనలకు ఆధిపత్యము వహించి సంవత్సరన్నర పాటు తీవ్రమైన పోరాటము చేసి దుర్గమును స్వాధీనము చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి ప్రాంత రాజప్రతినిధిగా అతడే నియమితుడయ్యాడు.

[మార్చు] కొండవీడు విజయం

1515లో రాయలు కొండవీడును ముట్టడించినాడు. కొండవీడు 1454నుండి గజపతులు ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు.

తిమ్మరసు మేనల్లుడు నాదెండ్ల గోపన దుర్గాధిపతిగా నియమితులయినాడు.

[మార్చు] కొండవీడు నుండి కటకం వరకు

కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.

ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516లో రాజధానికి తిరిగి వచ్చాడు.

[మార్చు] బీజాపూరు దండయాత్ర

1520లో బీజాపూరు పైకి దండయాత్రకు సిద్ధమయినాడు. దీనికి రెండు కారణములు చూపుతారు. మద్గల్లు, రాయచూరు దుర్గములను సుల్తాను ఆక్రమించుట సయ్యద్ మరార్ అను వ్యాపారి రాయల వద్ద డబ్బులు తీసుకుని ఇస్తానన్న అరేబియా జాతి గుర్రాలను ఇవ్వకుండా బీజాపూరు సుల్తాను దగ్గర ఆశ్రయం పొదినాడు, తాకీదు పంపించినా ఈ వ్యాపారిని సుల్తాను రాయలకు అప్పజెప్పలేదు, రాయలు సొమ్ము ఇప్పించనూ లేదు.

[మార్చు] సైనిక వివరములు

న్యూనిజ్ అను పోర్చుగీసు యాత్రికుని prakaaraM సైన్యం ఇలా ఉన్నది:

  1. కామా నాయకుడు : 30,000 కాల్బలము, వేయి అశ్వములు, పదహారు గజములు
  2. త్రయంబకరావు: 50,000 కాల్బలము, రెండు వేల అశ్వములు, ఇరవై ఏనుగులు
  3. తిమ్మప్ప నాయకుడు : 60,000కాల్బలము, 3,500 అశ్విక దళము, 30 ఏనుగులు
  4. ఆదెప్ప నాయకుడు : లక్ష కాల్బలము, ఐదువేల అశ్విక దళము, 50 ఏనుగులు
  5. కొండమ రెడ్డి 1 1,20,000 కాల్బలము, 6000 గుర్రాలు, 60 ఏనుగులు
  6. కొండమ రెడ్డి 2 80, 000 కాల్బలము, 2050 గుర్రాలు, 40 ఏనుగులు
  7. సాళువ గోవింద రాజు 30,000 కాల్బలము, 1000 గుర్రాలు, 10 ఏనుగులు
  8. మధుర నాయకుడు 15,000 కాల్బలము 200 గుర్రములు
  9. కుమార వీరయ్య 8,000 కాల్బలము, నాలుగు వందల గుర్రములు
  10. రాయలు 44,000 కాల్బలము, 7,000 గుర్రములు, 315 ఏనుగులు

మొత్తం 5,37,000 కాల్బలము, 27,150 గుర్రములు, 1151 ఏనుగులు. పోరు భీకరముగా జరిగింది. ఇరువైపులా అనేక మంది నేలకూలారు. ఆదిల్షా ఏనుగునెక్కి పారిపొయినాడు. సేనానులు దిక్కుతోచనివారైనారు. చివరకు ఎంతో ప్రాణ నష్టము తరువాత యుద్ధం 1520 మే 19 న ముగిసింది. ఈ విజయం వలన రాయలుకు విశేషమైన డబ్బు, గుర్రాలు, ఏనుగులు లభించినాయి.

తరువాత రాయచూరు కోటను ముట్టడించి ఇరవై రోజులు యుద్ధం చేసి పోర్చుగీసు సైనికుల సహాయంతో విజయం సాధించాడు. రాయలు రాజధానికి వెళ్ళినా, త్వరలోనే మరలా ముద్గల్లు, బీజాపూరు లను ముట్టడించి ధ్వంస పరచి కల్యాణి, గుల్బర్గా కోటలను స్వాధీనం చేసుకున్నాడు.

తరువాత రాయలు రాజధానికి వచ్చి నిశ్చింతగా కవితా గోష్టులను నిర్వహించినాడు.

[మార్చు] విశేషములు

రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

[మార్చు] మత విషయములు

ఇతను మత సహనం కలవాడు, అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు, అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమరుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.

  • చూడండి: కృష్ణ దేవ రాయల తిరుమల యాత్రలు

[మార్చు] నిర్మాణములు

[మార్చు] కవి సాహితీ పోషణ

[మార్చు] ఆదాయము

240 కోట్ల వార్షికాదాయము కలదు.

[మార్చు] వారసుడు

  • ఇతనికి ఇద్దరు భార్యలు, తిరుమల దేవి, చిన్నాదేవి
  • ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను రామ రాయలుకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు.
  • ఒక్కడే కొడుకు, తిరుమల దేవ రాయలు ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి తనే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు, కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524లో మరణించినాడు. ఈ విషయం పై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి అతనిని గుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలును వారసునిగా చేసాడు.

[మార్చు] సినిమాలు

  1. మహామంత్రి తిమ్మరుసు సినిమా

ఇంకా ఎన్నో సినిమాలు వచ్చాయి.



విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
వీరనరసింహ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1509 — 1529
తరువాత వచ్చినవారు:
అచ్యుత దేవ రాయలు
Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com