సదాశివ రాయలు
వికీపీడియా నుండి
ఇతను కేవలం నామమాత్ర పరిపాలకుడు మాత్రమే, అధికారము మొత్తం పెదతిరుమలయ్యదేవమహారాయలు చేతిలో ఉండెడిది. కానీ తరువాత అళియ రామ రాయలు కూడా అధికారం కోసం పోటీ పడినాడు. ఈ కాలమున విజయనగరం అంతఃకలహములకు తీవ్రంగా లోనయ్యింది, పరిస్తితులు ఎంతవరకూ వచ్చినాయంటే, పెద తిరుమలయ్యదేవమహారాయలు రాజధానిలోనికి ఆదిల్షాను సైన్యసమేతంగా ఆహ్వానించినాడు. అంతకు ముందే పెద తిరుమలయ్య దేవమహారాయలు తన మేనళ్ళుడూ, రాజ్యానికి వారసుడూ, అచ్యుత రాయలు కుమారుడు అయిన చిన వేంకటపతి రాయలును హత్యాగావించి తనే సింహాసనం అధిస్టించినాడు!
ఈ సుల్తాను రాజధానిలోనికి రావడంలో సిగ్గుపడి, బయపది, అవమానపడిన అళియ రామ రాయలు పెద తిరుమలయ్యను ఒప్పించి సుల్తానుకు ధనం అప్పగించి ఇంటికి పంపించినాడు.
తరువాత మాత్రం అళియ దేవ రాయలు తిరుగుబాటు కొనసాగించినారు, అయితే పెద తిరుమలయ్య పాపానికి చింతించి, ఆత్మహత్య గావించుకున్నాడు.
తరువాత అచ్యుత దేవ రాయలు సోదరుని కుమారుడగు సదా శివ రాయలు సింహాసనం అధిష్టించినాడు, కానీ అధికారం మాత్రం అళియ రామ రాయలు చేతిలోనే ఉండేది.
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: అచ్యుత దేవ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1542 — 1570 |
తరువాత వచ్చినవారు: అళియ రామ రాయలు |