మల్లికార్జున రాయలు
వికీపీడియా నుండి
[మార్చు] మల్లికార్జున రాయలు
తండ్రి రెండవ దేవ రాయలు తరువాత అధికారములోనికి వచ్చినాడు, ఇతడు అంత సమర్థుడుగా పేరుగాంచలేదు, తాత తండ్రుల రాజ సంపదను కొంత బహుమనీ సుల్తానులకు, మరికొంత గజపతులకు సమర్పించినాడు.
== కపిలేశ్వర గజపతి పద్మనాయకుల సహాయముతో 1448 న తీరాంధ్రపైకి దండెత్తివచ్చి రాజమహేంద్రవరమును ఆక్రమించినాడు. తరువాత ఇంకా ముందుకు సాగి 1450లో కొండవీడును జయించినాడు. అద్దంకి, శ్రీశలము, వెలుగోడు, బెల్లంకొండలను జయించి, తరువాత విజయనగరంను ముట్టడించినాడు, రాయలు సంధి చేసుకోని అపరాధరుసుము చెల్లించినాడు.
[మార్చు] గజపతుల రెండవ దడయాత్ర
1464 వ సంవత్సరమున, గజపతులు కపిలేశ్వర గజపతి , గొప్ప సైన్యాన్ని ఇచ్చి హంవీర గజపతి సైన్యాధిపతిగా విజయనగరంపైకి దండయాత్రకు వచ్చి కాంచీనగరము వరకు ఆక్రమించెను, ఇతను చంద్రగిరి, ఉదయగిరి, కొండపల్లి, వినుకొండ, అద్దంకి, తిరుచానూరు, తిరుచనాపల్లి మొదలగు ప్రాంతములను గజపతుల ఆధీనములోనికి తెచ్చినాడు. మొత్తానికి ఈ రాజు చాలా అసమర్థుడైనాడు
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: రెండవ దేవ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1446 — 1465 |
తరువాత వచ్చినవారు: రెండవ విరూపాక్ష రాయలు |