పంచారామాలు
వికీపీడియా నుండి
ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కధనము.
- అమరారామము (అమరావతి) - అమరేశ్వరుడు, బాలచాముండి
- ద్రాక్షారామము - భీమేశ్వరుడు, మాణిక్యాంబ
- కుమారారామము (కోటిపల్లి) - సోమేశ్వరుడు (కోటీశ్వరుడు), రాజరాజేశ్వరి
- భీమారామము (సామర్లకోట)- భీమేశ్వరుడు, బాలా త్రిపుర సుందరి
మరొక నమ్మకము ప్రకారము 1. అమరారామము, 2. ద్రాక్షారామము, 3. సోమారామము (భీమవరము), 4. కుమారారామము లేదా భీమారామము (సామర్లకోట), 5. క్షీరారామము (పాలకొల్లు) అనునవి పంచారామములు
ఇంకొక నమ్మకము ప్రకారము 1. అమరారామము, 2. ద్రాక్షారామము, 3. కుమారారామము (కోటిపల్లి), 4. క్షీరారామము (పాలకొల్లు), 5. భీమారామము (భీమవరము చాళుక్య భీమేశ్వర మందిము) అనునవి పంచారామములు