అవధానము
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కుంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తికి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability), పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే "అష్టావధానం" లో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగే వారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరి కొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.
ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు.
ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు.
విషయ సూచిక |
[మార్చు] అవధానము
అవధానాలు చాలా రకాలు
[మార్చు] అష్టావధానము
ఇందు ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యవలెను, కనీస సమయము నాలుగు గంటలు. ఆ ఎనిమిది ప్రక్రియలు
- కావ్య పాఠము
- కవిత్వము
- శాస్త్రార్దము
- ఆకాశపురాణము
- లోకాభిరామాయణము
- వ్యస్తాక్షరి
- చదరంగము
- పుష్ప గణనము
ఇవే కాకుండా కొంతమంది ఇంకా ఎక్కువ కూడా చేస్తారు
[మార్చు] శతావధానము
వంద మంది పృచ్చకులు అడిగే ప్రశ్నలకు, సమస్యలకు ఒక్కొక్క పాదాన్ని పూరించి మరలా ఆ వంద మంది అయిపోయిన తరువాత రెండవ పాదాన్ని, ఆ తరువాత మూడవ పాదాన్ని, ఆ తరువాత ఎవరి ఇష్టాన్ని బట్టి వారి పాదాన్ని పూరించవలెను