చెరుకుపల్లి (గుంటూరు జిల్లా)
వికీపీడియా నుండి
చెరుకుపల్లి మండలం | |
---|---|
జిల్లా: | గుంటూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | చెరుకుపల్లి |
గ్రామాలు: | 10 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 58.484 వేలు |
పురుషులు: | 29.044 వేలు |
స్త్రీలు: | 29.440 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 63.34 % |
పురుషులు: | 71.74 % |
స్త్రీలు: | 55.09 % |
చూడండి: గుంటూరు జిల్లా మండలాలు |
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు తూర్పు భాగాన ఉన్న మండలం, చెరుకుపల్లి (Cherukupalli). మండల కేంద్రమైన చెరుకుపల్లి గ్రామం, జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 40 కి.మీ ల దూరంలో ఉన్నది. పొన్నూరు పట్టణం నుండి 15 కి.మీ.లు, తెనాలి పట్టణం నుండి 25 కి.మీ.లు, రేపల్లె పట్టణం నుండి 23 కి.మీ. ల దూరంలోను చెరుకుపల్లి ఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] విశేషాలు
చెరుకుపల్లి గ్రామం, ఈ మండలం లోని గ్రామాలకే కాక చుట్టుపక్కల ఉన్న ఇతర మండలాలలోని గ్రామాలకు కూడా కూడలిగా ఉంది. పొన్నూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల రహదారులకు ఈ గ్రామం కూడలి. ఈ గ్రామం చుట్టుపట్ల మండలాలకు వైద్యసేవా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయంపై, అందునా వరిపై ఆధారపడినది కనుక సహజంగానే ధాన్యం మిల్లులు చెరుకుపల్లిలో వెలిసాయి. అలాగే కలప కోత మిల్లులకు కూడా ఈ గ్రామం ప్రసిద్ధి. చుట్టుపక్కల తాటిచెట్లు విరివిగా ఉండటం చేత తాటిచెట్లే ఈ కోత మిషన్ల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
అధిక శాతం మాగాణి పొలాలతో కూడిన ఈ మండలంలో మెట్ట ప్రాంతం కూడా ఉన్నది. వరితోపాటు, మినుము కూడా పండిస్తారు. మండలానికి ప్రకాశం బారేజి నుండి సాగునీరు సరఫరా అవుతుంది. భూగర్భ జలాలు తాగునీటికి ప్రధాన వనరు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- చెరుకుపల్లి (ఆరుంబాక)
- కావూరు (చెరుకుపల్లి మండలం)
- రాంభొట్లవారిపాలెం
- బలుసులపాలెం
- పొన్నపల్లి
- నడింపల్లి
- గూడవల్లి
- కనగాల
- రాజవోలు
- ఆరేపల్లి
[మార్చు] కొన్ని వివరాలు
- లోక్‌సభ నియోజకవర్గం: తెనాలి
- శాసనసభ నియోజకవర్గం: రేపల్లె
- రెవెన్యూ డివిజను: తెనాలి
- ప్రముఖ ప్రదేశాలు: వినయాశ్రమము: ఇది చెరుకుపల్లికి 4 కి.మీ.ల దూరంలో ఉన్నది. స్వాతంత్ర్యానికి పూర్వం నెలకొల్పబడిన ఈ ఆశ్రమాన్ని గాంధీజీ సందర్శించాడు. అహింసా సిద్ధాంతం, మరియు ఇతర గాంధీ ప్రబోధాలను వ్యాపింపజేయడానికి స్థాపించబడిన ఈ ఆశృఅమం ప్రాంగణంలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, కర్షక పరిషత్, ఆయుర్వేద వైద్యాలయం పనిచేస్తున్నాయి.
- దగ్గరలోని సముద్రతీరం: నిజాంపట్నం
- STD కోడ్: 08648
- రవాణా సౌకర్యం: చెరుకుపల్లి గ్రామం, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదార్లతో విస్తృతంగా కలపబడి ఉంది. దగ్గరలోని రైలు స్టేషన్లు: తెనాలి, పొన్నూరు, రేపల్లె.
- విద్యా సంస్థలు: చెరుకుపల్లి లోని ప్రైవేటు డిగ్రీ కళాశాల, కావూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
- ప్రముఖ వ్యక్తులు:
- ప్రముఖకవి, తెలుగులెంక బిరుదుపొందిన తుమ్మల సీతారామమూర్తి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించాడు.
- ప్రముఖ క్రికెట్ ఆటగాడు, వి.వి.ఎస్ లక్ష్మణ్ స్వగ్రామం మండలంలోని బలుసులపాలెం. ఆయన తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు.
[మార్చు] బయటి లింకులు
[మార్చు] గుంటూరు జిల్లా మండలాలు
మాచెర్ల | రెంటచింతల | గురజాల | దాచేపల్లి | మాచవరం | బెల్లంకొండ | అచ్చంపేట | క్రోసూరు | అమరావతి | తుళ్ళూరు | తాడేపల్లి | మంగళగిరి | తాడికొండ | పెదకూరపాడు | సత్తెనపల్లి | రాజుపాలెం(గుంటూరు) | పిడుగురాళ్ల | కారంపూడి | దుర్గి | వెల్దుర్తి(గుంటూరు) | బోళ్లపల్లి | నకరికల్లు | ముప్పాళ్ల | ఫిరంగిపురం | మేడికొండూరు | గుంటూరు | పెదకాకాని | దుగ్గిరాల | కొల్లిపర | కొల్లూరు | వేమూరు | తెనాలి | చుండూరు | చేబ్రోలు | వట్టిచెరుకూరు | ప్రత్తిపాడు | యడ్లపాడు | నాదెండ్ల | నరసరావుపేట | రొంపిచెర్ల | ఈపూరు | శావల్యాపురం | వినుకొండ | నూజెండ్ల | చిలకలూరిపేట | పెదనందిపాడు | కాకుమాను | పొన్నూరు | అమృతలూరు | చెరుకుపల్లి | భట్టిప్రోలు | రేపల్లె | నగరం | నిజాంపట్నం | పిట్టలవానిపాలెం | కర్లపాలెం | బాపట్ల