Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
గుంటూరు - వికిపీడియా

గుంటూరు

వికీపీడియా నుండి

గుంటూరు జిల్లా
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ప్రాంతము: కోస్తా
ముఖ్య పట్టణము: గుంటూరు
విస్తీర్ణము: 11,391 చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 44.06 లక్షలు
పురుషులు: 22.20 లక్షలు
స్త్రీలు: 21.85 లక్షలు
పట్టణ: 12.31 లక్షలు
గ్రామీణ: 31.74 లక్షలు
జనసాంద్రత: 387 / చ.కి.మీ
జనాభా వృద్ధి: 7.27 % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 62.8 %
పురుషులు: 71.32 %
స్త్రీలు: 54.17 %
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు

గుంటూరు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుగల గుంటూరు జిల్లాకు పరిపాలనా కేంద్రము. ఈ పట్టణము 6,00,000 జనాభాతో రాష్ట్రము యొక్క నాలుగవ పెద్ద నగరము అయినది. భారత దేశములోని పెద్ద విశ్వవిద్యాలయములలో ఒకటైన నాగార్జున విశ్వవిద్యాలయము గుంటూరు నగరములో ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణము లో వ్యాపించి, 44,05,521 (2001 గణన) జనాభా కలిగిఉన్నది. జిల్లాకు తూర్పు, ఈశాన్యాన కృష్ణా నది ప్రవహిస్తూ జిల్లాను కృష్ణా జిల్లా నుండి వేరు చేయుచున్నది. వాయవ్యాన బంగాళాఖాతము, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా, మరియు ఈశాన్యాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

వరి, పొగాకు, ప్రత్తి మరియు మిర్చిలు జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. కృష్ణ, చంద్రవంక, నాగులేరు మరియు గుండ్లకమ్మ జిల్లాలోని ముఖ్య నదులు.

అమరావతి, భట్టిప్రోలు, ఉండవల్లి గుహలు మరియు గుంటూరు లోని మ్యూజియం గుంటూరు జిల్లా లోని ముఖ్య చారిత్రక స్థలాలు

[మార్చు] చరిత్ర

గుంటూరు ప్రాంతంలో పాత రాతి యుగము నాటినుండి మానవుడు నివసించినాడనుటకు ఆధారములు కలవు. పాత రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి.


వేంగీ చాళుక్య రాజు అయిన అమ్మరాజ ఈ (922-929) యొక్క శాసనాలలో (ఈదెర్న్‌ ప్లతెస్‌) గుంటూరు గురించిన ప్రధమ ప్రస్తావన ఉన్నది. 1147 మరియు 1158 నాటి రెండు శాసనాలలో కూడ గుంటూరు ప్రసక్తి ఉన్నది.

బౌద్ధం ప్రారంభం నుండి కూడా, విద్యా సబంధ విషయాలలో గుంటూరు అగ్రశ్రేణిలో ఉంటూ వచ్చింది. భౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్యకటకము(ధరణికోట) వద్ద విశ్వవిద్యాలయమును స్థాపించారు. ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త అయిన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడేనని, క్రీ.పూ 200 నాటికే ఈ ప్రాంతంలో అభ్రకము (మైకా) ను కనుగొన్నాడని తెలుస్తోంది.


పర్తీపాలపుత్ర రాజ్యం (క్రీ పూ 5వ శతాబ్ది) – ఇప్పటి భట్టిప్రోలు – గుంటూరు జిల్లాలోని ప్రధమ రాజ్యంగా గుర్తింపు పొందింది. శాసన ఆధారాలను బట్టి కుబేర రాజు క్రీ. పూ. 230 ప్రాంతంలో భట్టిప్రోలును పరిపాలించాడని, ఆ తరువాత సాల రజులు పాలించారని తెలుస్తున్నది. వివిధ కాలాల్లో గుంటూరును పాలించిన వంశాలలో ప్రముఖమైనవి: శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రినులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు మరియు కుతుబ్ షాహీలు. కొందరు సామంత రాజులు కూడ ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు, వారసత్వ పోరులు సర్వ సాధారణంగా ఉండేవి. అటువంటి వారసత్వ పోరే ప్రసిద్ధి గాంచిన పలనాటి యుద్ధం. జిల్లాలోని పలనాడు ప్రాంతంలో 1180 లలో జరిగిన ఈ యుద్ధం "ఆంధ్ర కురుక్షేత్రం" గా చరిత్ర లోను, సాహిత్యంలోను చిరస్థాయిగా నిలిచిపోయింది.


1687 లో ఔరంగజేబు కుతుబ్‌ షాహి రాజ్యాన్ని ఆక్రమించినపుడు గుంటూరు కూడా మొగలు సామ్రాజ్యం లో భాగమయింది. సామ్రాజ్యపు రాజప్రతినిధి ఐన ఆసఫ్‌ ఝా 1724 లో హైదరాబాదుకు నిజాముగా ప్రకటించుకొన్నాడు. ఉత్తర సర్కారులు అని పేరొందిన కోస్తా జిల్లాలను ఫ్రెంచి వారు 1750 లో ఆక్రమించుకొన్నారు. 1788 లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఏలుబడిలోనికి వచ్చి, గుంటూరు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగమైంది.


1794 లో 14 తాలూకాలతో జిల్లా ఆవిర్భవించింది. ఆవి: దాచేపల్లి, ప్రత్తిపాడు, మార్టూరు, ఠుంఠురుకొర, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు, కూరపాడు, కొండవీడు, నరసరావుపేట, వినుకొండ. 1859 లో జిల్లాను రాజమండ్రి, మచిలీపట్నం జిల్లాలతో విలీనం చేసి, కృష్ణా, గోదావరి జిల్లాలుగా నామకరణం చేసారు. 1904 లో తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పలనాడు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలను వేరు చేసి మళ్ళీ జిల్లాను ఏర్పాటు చేసారు.


భారత స్వాతంత్ర్య సంగ్రామం లోను, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రం అయింది. రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే ఉత్తరాది జిల్లాలు – గుంటూరు తో సహా - ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953 లో 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.


1970 ఫిబ్రవరి 2ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసారు. దీనితో జిల్లా వైశాల్యం 15032 చ. కి. మీ నుండి 11,347 చ. కి. మీ కి తగ్గిపోయింది.


జిల్లాలో మూడు రెవెన్యూ విభాగాలు ఉనాయి, అవి: తెనాలి, గుంటూరు, నరసరావుపేట. మండల వ్యవస్థ రాకముందు 21 తాలూకాలు ఉండేవి. ఆవి:తెనాలి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, పల్లపట్ల, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, ఈమని, ప్రత్తిపాడు, రాజుపాలెం, తాళ్ళూరు, చిలకలూరిపేట, వినుకొండ, పల్నాడు, మాచెర్ల, ఈపూరు, పిడుగురాళ్ళ, తాడికొండ,

1985 లో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి మండల వ్యవస్థను ఏర్పరిచిన తరువాత జిల్లాలో 57 మండలాలు, 21 పంచాయితీ సమితులు ఏర్పడ్డాయి. పంచాయితీ సమితుల సంఖ్యలో జిల్లా, రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంది.


[మార్చు] గుంటూరు పట్టణము

గుంటూరు బస్ స్తేషను దృశ్యము
గుంటూరు బస్ స్తేషను దృశ్యము

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఈశాన్యాన సుందరమైన కొండవీడు పర్వత శ్రేణికి 9 కి మీ ల తూర్పున గుంటూరు పట్టణం ఉన్నది. అదే పేరుతోనున్న జిల్లా, రెవెన్యూ విభాగం, తాలూకా కు ఈ పట్టణం కేంద్రము. 1866 లో ఏర్పడిన గుంటూరు పురపాలక సంఘం రాష్ట్రం లోని అతి పురాతనమైన పురపాలక సంఘాలలో ఒకటి. 18 వ శతాబ్దపు మధ్యలో ఇది ఫ్రెంచి వారి చేతుల్లోకి వెళ్ళినా, 1788 లో శాశ్వతంగా బ్రిటిషు వారికి సొంతమైంది.

[మార్చు] జానాబ

: 514,707 (2001)

ప్రస్తుతం గుంటూరు పట్టణంలో భాగమైన 'రామచంద్రాపురము అగ్రహారము' అను గ్రామము గుంటూరు కంటే ఎంతో ప్రాచీనమైనదిగా భావించుచున్నారు. లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయపు మంటపం యొక్క స్థంభంపైనున్న 1296 నాటి శాసనాలలో దీని పేరు కనిపించుచున్నది.

గుంటూరు ప్రముఖ రైల్వే జంక్షను. ఇది విజయవాడ, రేపల్లె, మచిలీపట్నం, హైదరబాదు, మాచర్ల, తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉన్నది. గుంటూరు ప్రముఖ వ్యాపార కేంద్రము. పత్తి, నూనె, ధాన్యం మిల్లులే కాక పొగాకును శుద్ధి చేసే బారనులు పట్టణము చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్జీనియా పొగాకుకు గుంటూరు ముఖ్య కేంద్రం. భారత పొగాకు నియంత్రణ బోర్డు కూడ గుంటూరు లో కలదు. బొమ్మ:Http://upload.wikimedia.org/wikipedia/en/2/22/NASA-GNT.jpg

[మార్చు] గుంటూరు ప్రత్యేకతలు

  • 1868, ఆగష్టు 18 న గుంటూరులో నుండి సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నాడు. అప్పటి సూర్యగ్రహణం అసాధారణంగా 10 నిముషాల సేపు వచ్చి, ఎందరో శాస్త్రవేత్తలను ఆకర్షించింది.
  • మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన అప్పటి అతి పెద్ద ప్రయాణీకుల ఓడ- టైటానిక్‌ లోనున్న ఒకే ఒక్క భారతీయ కుటుంబం గుంటూరు వారే.
  • పాకిస్తాన్ ఏర్పాటుకు కర్త అయిన మొహమ్మదు ఆలీ జిన్నా పేరిట గుంటూరులో ఒక స్థూపం ఉన్నది. (హిందూ పత్రికలోని ఈ వ్యాసం దీని ప్రత్యేకతను వివరిస్తుంది)
  • గుంటూరు పొగాకు వ్యపారానికి బాగా ప్రసిద్ది చెందినది
  • ఆబురకము (మైకా)2200 సంవత్చరాల క్రితము మొదట గా గుంటూరు ప్రాంతము లొనె కనుగొన పడిండి

[మార్చు] గుంటూరు మండలాలు

భౌగోళికంగా గుంటూరు జిల్లాను 57 రెవిన్యూ మండలములుగా విభజించారు.

 గుంటూరు జిల్లా మండలాలు

1.మాచెర్ల

2.రెంటచింతల

3.గురజాల

4.దాచేపల్లి

5.మాచవరం

6.బెల్లంకొండ

7.అచ్చంపేట

8.క్రోసూరు

9.అమరావతి

10.తుళ్ళూరు

11.తాడేపల్లి

12.మంగళగిరి

13.తాడికొండ

14.పెదకూరపాడు

15.సత్తెనపల్లె

16.రాజుపాలెం

17.పిడుగురాళ్ల

18.కారంపూడి

19.దుర్గి

20.వెల్దుర్తి

21.బోళ్లపల్లి

22.నకరికల్లు

23.ముప్పాళ్ల

24.ఫిరంగిపురం

25.మేడికొండూరు

26.గుంటూరు

27.పెదకాకాని

28.దుగ్గిరాల

29.కొల్లిపర

30.కొల్లూరు

31.వేమూరు

32.తెనాలి

33.చుండూరు

34.చేబ్రోలు

35.వట్టిచెరుకూరు

36.ప్రత్తిపాడు

37.ఎడ్లపాడు

38.నాదెండ్ల

39.నరసరావుపేట

40.రొంపిచెర్ల

41.ఈపూరు

42.శావల్యాపురం

43.వినుకొండ

44.నూజెండ్ల

45.చిలకలూరిపేట

46.పెదనందిపాడు

47.కాకుమాను

48.పొన్నూరు

49.అమృతలూరు

50.చెరుకుపల్లి

51.భట్టిప్రోలు

52.రేపల్లె

53.నగరం

54.నిజాంపట్నం

55.పిట్టలవానిపాలెం

56.కర్లపాలెం

57.బాపట్ల

[మార్చు] జిల్లాలోని చూడదగ్గ ప్రదేశములు

ఉండవల్లి గుహలు
ఉండవల్లి గుహలు
  1. అమరావతి
  2. భట్టిప్రోలు
  3. కేసనపల్లి
  4. ఉండవల్లి గుహలు
  5. బాపట్ల సముద్రపు ఒడ్డు
  6. కోటప్ప కొండ (త్రికూటేశ్వరుని సన్నిధి, నరసరావు పేట దగ్గర)
  7. మంగళగిరి
  8. మాచెర్ల
  9. పొన్నూరు

[మార్చు] బయటి లింకులు


ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు పూర్ణ కుంభం
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు
Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com