త్రిలింగాలు
వికీపీడియా నుండి
దాక్షారామం (దీనికి దక్షుడి పేరుమీద దాక్షారామమని పేరు వచ్చింది. కానీ కొంతమంది దీన్ని ద్రాక్షారామం అంటారు.)
ఈ మూడు లింగాల మధ్య ఉన్న దేశం త్రిలింగదేశం అంటే తెలుగునాడు అనడం వాడుక. అప్పకవి, మరికొందరు ఈ మాటను వాడారు కానీ ప్రాచీనకావ్యాల్లో గానీ, సంస్కృతనిఘంటువుల్లో ఉండే యాభైఆరుదేశాల్లో గానీ త్రిలింగదేశమంటే తెలుగునాడు అనే అర్థం లేదని సిపి బ్రౌన్ తన తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులో పేర్కొన్నాడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది కల్పిత నామం.