అష్టవిధవివాహాలు
వికీపీడియా నుండి
అష్టవిధవివాహాలు:
- బ్రాహ్మ = విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం
- దైవ = యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం
- ఆర్ష = కన్యాశుల్కంగా వరుడినుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం
- ప్రాజాపత్య = కట్నమిచ్చి పెళ్ళి చేయడం
- ఆసుర = వరుడు ధనమిచ్చి వధువును కొనడం
- గాంధర్వ = ప్రేమ వివాహం
- రాక్షస = వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం
- పైశాచ = వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం
(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)