త్రిపుర
వికీపీడియా నుండి
త్రిపుర | |
రాజధాని - Coordinates |
అగర్తల - |
పెద్ద నగరము | అగర్తల |
జనాభా (2001) - జనసాంద్రత |
3,191,168 (21వది) - 304/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
10,492 చ.కి.మీ (26వది) - 4 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1972-01-21 - డి.ఎన్. సహాయ్ - మానిక్ సర్కార్ - Unicameral (60) |
అధికార బాష (లు) | బెంగాళీ, కోక్‌బరోక్ |
పొడిపదం (ISO) | IN-TR |
వెబ్‌సైటు: tripura.nic.in | |
త్రిపుర రాజముద్ర |
త్రిపుర (ত্রিপুরা) (Tripura) ఈశాన్య భారత దేశము లోని రాష్ట్రము. రాష్ట్ర రాజధాని అగర్తల మరియు ఇక్కడ మాట్లాడే ప్రధాన బాషలు బెంగాళీ మరియు కోక్‌బరోక్.
[మార్చు] చరిత్ర
త్రిపుర స్వాతంత్ర్యానికి మునుపు ఒక రాజ్యముగా ఉండేది. 1949 లో భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించారు. వీరి రాజ్యము యొక్క రాజధాని దక్షిణ త్రిపురలో గోమతీ నది తీరమున రంగమతిగా పేరుపొందిన ఉదయపూర్ లో ఉన్నది. రాజధానిని తొలుత పాత అగర్తలకు ఆ తర్వాత 19వ శతాబ్దములో ప్రస్తుత అగర్తలకు తరలించబడినది. రాచరిక పరిపాలనకు వ్యతిరేకముగా గణముక్తి పరిషద్ ఉద్యమము ప్రారంభమైనది. ఈ ఉద్యమము యొక్క విజయానికి ఫలితముగా త్రిపుర భారత దేశములో విలీనమైనది. దేశ విభజన తీవ్ర ప్రభావము చూపిన ప్రాంతములలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రములో ఇప్పుడు బెంగాళీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయము పొందిన వారే) స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనము సాగిస్తున్నారు.
[మార్చు] రాజకీయాలు
త్రిపుర రాష్ట్రాన్ని ప్రస్తుతము మానిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా వామపక్ష కూటమి పరిపాలించుచున్నది. 1977 వరకు రాష్ట్రాన్ని కాంగ్రేసు పార్టీ పరిపాలించినది. 1978 నుండి 1988 వరకు వామపక్ష కూటమి పరిపాలించి, తిరిగి 1993లో అధికారములోకి వచ్చినది. 1988 నుండి 1993 వరకు భారత జాతీయ కాంగ్రేసు మరియు త్రిపుర ఉపజాతి యుబ సమితి యొక్క సంకీర్ణ ప్రభుత్వము పాలించినది.
1970 దశాబ్దము చివరి నుండి త్రిపురలో సాయుధ ఘర్షణ కొనసాగుతున్నది
[మార్చు] బయటి లింకులు
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అస్సాం | బీహార్ | చత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ మరియు కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్, నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్, డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |