Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
ఒరిస్సా - వికిపీడియా

ఒరిస్సా

వికీపీడియా నుండి

ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి


ఒరిస్సా
Map of India with the location of ఒరిస్సా highlighted.
రాజధాని
 - Coordinates
భువనేశ్వర్
 - 20.15° ఉ 85.50° తూ
పెద్ద నగరము భువనేశ్వర్
జనాభా (2001)
 - జనసాంద్రత
36,706,920 (11వది)
 - 236/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
155,707 చ.కి.మీ (9వది)
 - 30
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1949-01-01
 - రామేశ్వర్ ఠాకూర్
 - నవీన్ పట్నాయక్
 - ఒకే సభ (147)
అధికార బాష (లు) ఒరియా
పొడిపదం (ISO) IN-OR
వెబ్‌సైటు: www.orissa.gov.in

ఒరిస్సా (Orissa) (ଓଡ଼ିଶା) భారతదేశం తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920


ఒరిస్సాకు ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలున్నాయి. తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నది.

కోణార్క, పూరి, భువనేశ్వర్ లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. ఒరియా ప్రధాన భాష.


విషయ సూచిక

[మార్చు] భౌగోళికం

ఒరిస్సా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివశిస్తున్నారు.

తూర్పు కనుమలకు, సముద్రానికి మధ్యభాగంలోని మైదాన ప్రాంతం సారవంతమైన వ్వవసాయభూమి. తీరప్రాంత మైదానాలు ప్రధాన జనావాసకేంద్రాలు. మహానది, బ్రాహ్మణి నది, బైతరణి నది డెల్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తీర రేఖ తిన్నగా (చీలకుండా) ఉండడంవల్ల మంచి నౌకాశ్రయాలకు అవకాశంలేదు. ఒక్క పరదీప్ మాత్రం నౌకలకు అనుకూలమైనది. తీర ప్రాంతాలు, మహానది డెల్టా సారవంతమైన నేలలు. సక్రమంగా మంచి వర్షపాతం ఉండడంవల్ల ఏటా రెండు వరి పంటలు పండుతాయి.

బంగాళాఖాతంలో జనించే తుఫానుల తాకిడికి ఒరిస్సా తీరప్రాంతం తరచు నష్టపోతూ ఉంటుంది. 1999 అక్టోబరులో వచ్చిన తుఫాను వల్ల 10,000 మంది మరణించాఱు. తీవ్రమైన నష్టం వాటిల్లింది


[మార్చు] చరిత్ర

ఎక్కువ కాలం ఒరిస్సా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉన్నది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.

  • మురుంద వంశము
  • మరాఠ వంశము
  • నల వంశము
  • విగ్రహ, ముద్గల వంశము
  • శైలోద్భవ వంశము
  • భౌమకార వంశము
  • నందోద్భవ వంశము
  • సోమవంశి వంశము
  • తూర్పు గంగుల వంశము
  • సూర్య వంశి వంశము

ముస్లిం దండయాత్రల ప్రధానమార్గానికి ప్రక్కగా ఉన్నందువల్లా, కొద్ది దండయాత్రలకు బలమైన ప్రతిఘటన చేయగలగడం వల్లా ఈ ప్రాంతం చాలా కాలం మహమ్మదీయుల పాలనలోకి రాలేదు. కాని 1568లో ముఘల్ సామ్రాజ్యంలో కలుపబడింది.

ముఘల్ రాజుల పతనం తరువాత ఒరిస్సాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో బీహారులో కొంతభాగం చేర్చి ఒరిస్సా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒరిస్సా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.

1950లో ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

[మార్చు] సంస్కృతి

ఒరియా అధికారిక భాష. ఒరిస్సా లో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, కటక్ వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదిమవాసుల (కొండజాతుల)వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒరిస్సా సాంస్కృతిక ప్రతీకలు.



[మార్చు] జన విస్తరణ

ఒరిస్సా జనాభాలో దాదాపు 24% వరకు ఆదిమవాసులు. ఇది చాలా రాష్ట్రాలకంటే ఎక్కువ. 87% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్నారు. ఎక్కువ భూమి కొద్ది మంది అధినంలో ఉండడంవలనా, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసి ప్రాంతాలకు విస్తరిచకపోవడం వలనా ఒరిస్సాలో పేదరికం బాగా ఎక్కువనే చెప్పవచ్చును.

24% వరకు ఉన్న ఆదివాసజనులలో 62 వివిధ తెగలున్నాయి. వీరి జీవనవిధానం వన్య సంపద కేంద్రంగా ఉంటుంది. రైల్వేలు, ఆనకట్టలు, ఖనిజాల త్రవ్వకం వంటి ఆధునిక కార్యక్రమాలు వీరి బ్రతుకుతెరువును దుర్భరంచేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

16% వరకు ఉన్న దళితులు దేశమంతటా ఉన్న సామాజిక వివక్షతల్ల, ఆర్ధిక అసమానతల వల్ల బాగా వెనుకబడి ఉన్నారు.

ఒరిస్సాలో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒరిస్సా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు.


[మార్చు] పర్యాటక స్థలాలు

  • రాజదాని భువనేశ్వర్: మందిరాల నగరమని దీనికి పేరు. ఇక్కడ షుమారు 1000 మందిరాలున్నాయి.
  • పూరి: జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం ఉన్నది. జగన్నాధ రధయాత్ర ఏటా ఒక ముఖ్యమైన ఉత్సవం. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతారు.
  • కోణార్క సూర్య మందిరం - ఒరిస్సా శిల్పకళా నైపుణ్యానికి, నిర్మాణకౌశలానికి ఒక చక్కని తార్కాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలోని శిల్పాలలో ఆనాటి సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబిస్తుంది.
Stone work at Konark
Stone work at Konark
  • చిల్కా సరస్సు: మహానది ముఖద్వారానికి దక్షిణాన ఉన్న ఉప్పునీటి సరస్సు. ఎన్నో విధాల పక్షులకు ఆవాసం. రక్షితవనం. ఇక్కడ దాదాపు 150 జాతుల పక్షులు వలసకు వస్తుంటాయి.
  • చర్చికా మాత మందిరం: రేణుకా నది ఒడ్డున రుచికా పర్వతంపై, బంకి వద్ద, సుందర ప్రకృతి సౌందర్యానికి దీటుగా నిర్మింపబడ్డ మందిరం. కటక్ కు 52 కి.మీ., భువనేశ్వర్ కు 60 కి.మీ. దూరంలో ఉన్నది.
  • సునాదేయి మందిరం: మహానది ఒడ్డున ఉన్నది. వలస పక్షులకు ఆవాసం కూడాను. పిక్నిక్ లకు జనప్రియమైనది.


[మార్చు] రాజకీయాలు

ఒరిస్శా రాష్ట్రపాలన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పాలనా విధానాన్ని అనుసరించే ఉంటుంది (గవర్నరు, ముఖ్య మంత్రి, కాబినెట్, అసెంబ్లీ వగయిరా)


[మార్చు] ఆర్ధిక పరిస్థితి

ఒరిస్సా ఆర్దిక స్థితికి ముఖ్యమైన వనరులు:

  • మహానది డెల్టాలో పండే వరి
  • మంచి ఖనిజ నిక్షేపాలు - ముఖ్యంగా బొగ్గు, ఇనుము, మైకా, మాంగనీసు
  • తూర్పు కనుమలలో లభించే కలప
  • అటవీ ఉత్పత్తులు

కొన్ని గణాంకాలు:

  • అభివృద్ధి రేటు 4.3 % (భారత దేశం సగటు 6.7 %)
  • మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్వసాయం పాలు 32% . మొత్తం జనాబాలో 62% వ్యసాయ పనులపై ఆధారపడి ఉన్నారు.
  • షుమారు 1,75,000 మంది దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారు
  • అక్షరాస్యత 50% (భారత దేశం సగటు 66%)


[మార్చు] కంప్యూటరు సంస్థలు

[మార్చు] భారీ పరిశ్రమలు

[మార్చు] వ్యవసాయం

  • ఆహార ధాన్యాలు

[మార్చు] మత్స్య పరిశ్రమ

  • ఆక్వా కల్చర్
  • మంచినీటి చేపల పెంపకం
  • సుద్రంలో చేపలు పట్టడం

[మార్చు] విద్య

ఒరిస్సాలో పలు విద్యాలయాలు, విశ్వ విద్యాలయఅలు ఉన్నాయి


[మార్చు] విశ్వ విద్యాలయాలు

[మార్చు] మేనేజిమెంటు కాలేజీలు

[మార్చు] ఇంజినీరింగు కాలేజీలు

[మార్చు] మెడికల్ కాలేజీలు

  • Shri Ramachandra Bhanj Medical College, Cuttack.
  • Maharaja Krushna Chandra Gajapati Dev Medical College, Berhampur.
  • Veer Surendra Sai Medical College, Burla, Sambalpur.
  • Institute of Health Sciences, Bhubaneswar.

[మార్చు] రీహాబిలిటేషన్ విద్య

  • Institute of Health Sciences, Bhubaneswar.
  • Training Centre for Teachers of the Visually Handicapped, Bhubaneswar
  • Chetna Institute for the Mentally Handicapped (Jewels International), Bhubaneswar
  • National Institute of Rehabilitation Training and Research,Olatpur
  • Training Centre for Teachers of the Deaf (A Joint Project of State Govt. & AYJNIHH, Bhubaneswar
  • Open Learning System, Bhubaneswar
  • Shanta Memorial Rehabilitation Centre, Bhubaneswar

[మార్చు] ఆయుర్వేద కాలేజీలు

  • Anata Tripathy Ayurvedic College,Bolangir.
  • Berhampur Govt. Ayurvedic College, Berhampur.
  • Govt. Ayurvedic College, Puri.
  • Gopalbandhu Ayurveda Mahavidyalaya, Puri.
  • Government Ayurveda College, Balangir.
  • K.A.T.A. Ayurvedic College, Ganjam.
  • Nrusingh Nath Govt. Ayurvedic College, Paikmal, Sambalpur.
  • S.S.N.Ayurved College and Research Institute, Nursingnath.

[మార్చు] హోమియోపతి కాలేజీలు

  • Govt. Homoeopathic Medical College, Berhampur.

[మార్చు] జిల్లాలు

  • Angul
  • Balangir
  • Baleshwar
  • Bargarh
  • Bauda
  • Bhadrak
  • Cuttack
  • Deogarh
  • Dhenkanal
  • Gajapati
  • Ganjam
  • Jagatsinghpur
  • Jajpur
  • Jharsuguda
  • Kalahandi
  • Kendrapara
  • Kendujhargarh
  • Khordha
  • Koraput
  • Malkangiri
  • Mayurbhanj
  • Nabarangapur
  • Nayagarh
  • Nuaparha
  • Phulabani
  • Puri
  • Rayagada
  • Sambalpur
  • Sonapur
  • Sundargarh


[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] బయటి లింకులు


భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు Flag of India
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అస్సాం | బీహార్ | చత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ మరియు కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్, నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్, డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ
Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com