Privacy Policy Cookie Policy Terms and Conditions భారతదేశ చరిత్ర - వికిపీడియా

భారతదేశ చరిత్ర

వికీపీడియా నుండి

భారత దేశ చరిత్ర
సరస్వతీ, సింధూ నదీ నాగరికత
వైదిక నాగరికత
మహా జనపదాలు
మగధ సామ్రాజ్యము
శాతవాహనులు
ముస్లిం దండయాత్రలు
విజయనగర రాజ్యము
మొఘల్ పరిపాలన
ఈష్టిండియా కంపెనీ పాలన
బ్రిటీషు పాలన
భారత స్వాతంత్ర్య పోరాటం

భారతదేశ చరిత్ర 34,000 ఏళ్ళ కిందట హోమో సేపియన్స్ కాలం నుండే ప్రారంభమయింది. భారత దేశ చరిత్ర అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లతో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర.

విషయ సూచిక

[మార్చు] పాతరాతి (పాలియోలితిక్) యుగము

Bhimbetka rock painting
Bhimbetka rock painting

మధ్య భారతదేశమునందలి నర్మద నదీ పరివాహ ప్రాంతము నందలి హత్నోరానందలి హొమినిడ్ అవశేషాల వల్ల భారతదేశ భూభాగమునందు పాతరాతి యుగము నుండే జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అవశేషాల యొక్క సరియైన కాలము తెలియకున్నప్పటికినీ, పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం ఇవి కనీసం రెండు నుండి ఏడు లక్షల సంవత్సరాల కాలము నాటి క్రిందవని తెలియుచున్నది. ఈ శిలాజాలు దక్షిణ ఆసియా లోనే లభించిన తొలి మానవ అవశేషాలు. దక్షిణ భారతదేశమునందలి కలడ్గి ప్రాంతంలో ఓ క్వారీలో ఇటీవల కొన్ని అవశేషాలు కనుగొన్నారు. వీటిని బట్టి ఆధునిక మానవులు ఈ ప్రాంతంలో సుమారు 12,000 సంవత్సరాల నాటి చివరి మంచు యుగము నుండే ఉన్నట్లు తెలియుచున్నది. మధ్య ప్రదేశు నందలి బింబెట్కా అను ప్రదేశములోని ఆధారాలను అనుసరించి 9,000 సంవత్సరాల క్రితము ఇక్కడ మనుషులు ఉన్నట్లు పూర్తి ఆధారాలతో నిర్ధారణ అవుచున్నది.

[మార్చు] కొత్తరాతి (నియోలితిక్) యుగము

దక్షిణాసియా ప్రాంతంలో, కొత్తరాతి యుగపు తొలి సంస్కృతి మెహర్‌గఢ్లో క్రీ.పూ.7000 లో వర్ద్ధిల్లింది. ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్‌ లో ఉంది. మెహర్గఢ్‌ ప్రజలు ముఖ్యంగా పశువుల కాపరులు, మట్టి ఇళ్ళలో నివసించేవారు. బుట్టలు అల్లుతూ, గొర్రెలను పెంచుతూ ఉండేవారు. క్రీ.పూ.5500 నాటికి, వీరు కుండలు చెయ్యడము మొదలు పెట్టినారు. అలాగే రాగి పనిముట్ల వాడకం కూడా మొదలైంది. క్రీ.పూ.2000 నాటికి వీరు అదృశ్యం అయినారు.


[మార్చు] కంచు యుగము

[మార్చు] సరస్వతీ, సింధూ నదీ లోయల నాగరికత

బొమ్మ:Indusvalleyexcavation.jpg
The Indus Valley Civilization existed along the Indus River in present-day Pakistan. The Mohenjo-daro ruins pictured above were once the centre of this ancient society.
ప్రధాన వ్యాసము: సింధూ, సరస్వతీ నదీ నాగరికత

వ్యవసాయాధారిత జనపదాల నుండి, పట్టణ జనావాసాల వైపు పురోగమనం మెహర్‌గఢ్‌ కాలానికీ, క్రీ.పూ.3000 కు మధ్య ప్రారంభమైంది. ఈ కాలంలోనే భారతదేశపు మొట్టమొదటి పట్టణ సంస్కృతి ప్రారంభమైంది. అదే సింధు లోయ నాగరికత. హరప్పా నాగరికత అని కూడా పిలువబడే ఈ నాగరికత క్రీ.పూ. 2800 నుండి, క్రీ.పూ 1800 వరకు విలసిల్లింది. సరస్వతి, సింధు నదులూ, వాటి ఉపనదుల తీరాల వెంబడి కేంద్రీకృతమైన ఈ నాగరికత గంగ, యమున మధ్య ప్రాంతం లోను, గుజరాత్‌‌‌లోను, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌‌లోను కూడా వ్యాపించింది.


ఇది ఇటుకలతో కట్టబడిన కట్టడాలకూ, రోడ్లకూ, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజి పద్దతికీ, బహుళ అంతస్తుల భవనాలకూ, పేరుగాంచినది. సుమేరియను రికార్డులలో పేర్కొన్న మేలుహ్హా అంటే భారతదేశమే కావచ్చని భావిస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటి సారిగా భారతదేశపు ప్రస్తావన వచ్చింది ఇక్కడే. సమకాలీన నాగరికతలైన సుమేరియను, ఈజిప్టు లతో పోలిస్తే ఇది భౌగోళికంగా చాలా పెద్దదీ, చక్కని ప్రణాళీకాబద్దమైనదీ, మరియూ బహుశా ఒకే రాజు క్రింది ఉండి ఉండవచ్చు, ఎందుకంటే ఇక్కడి చాలా వాటికి ఏక ప్రమాణాలు పాటించబడినాయి, ఉదాహరణకు ఇటుకల కొలత, మొత్తము అన్ని సైటులలోనూ ఒకేరకముగా ఉన్నాయి!


మొహెంజో దారో ఈ నాగరికతకు కేంద్రం. దక్షిణాన బొంబాయి వరకూ, ఉత్తరాన డిల్లీ వరకూ, పశ్చిమాన ఇరాన్ ఎల్లల వరకూ, ఉత్తరాన హిమాలయాల వరకూ ఈ నాగరికత వ్యాపించినది. హరప్పా, దొలవీర, గన్వేరివాలా, లోథాల్‌, అనునవి ఇక్కడి ముఖ్యమైన కనుగొన్న పట్టాణాలు. సుమారుగా యాబై లక్షల జనాబా వరకూ ఉండి ఉండవచ్చు అని ఓ అభిప్రాయము. ఇప్పటివరకూ 2,500 నగరాలు కనుగొనబడ్డాయి! ముఖ్యముగా లుప్తమైన సరస్వతీ నదీ పరివాహ ప్రదేశమున ఎక్కువగా కనుగొనబడ్డాయి. ఈ సరస్వతీ నది యొక్క మరణమే ఈ నాగరికత యొక్క మరణానికి కారణమని చాలా మంది నమ్ముతున్నారు.

[మార్చు] వైదిక నాగరికత

ప్రధాన వ్యాసము: వైదిక నాగరికత

వేదాలతో ముడిపడ్డ ఇండో-ఆర్యన్‌ నాగరికతే వైదిక నాగరికత. వైదిక సంస్కృత భాషలో ఉన్న వేదాలు ఇండో-యూరపియను రచనలోకెల్లా పురాతనమైనవి. ఈ పుస్తకాల యొక్క ఆర్యుల ఆగమన సిద్దాంతము పై భిన్నాభిప్రాయాలున్నాయి. వైదిక నాగరికులు తొలుత పశువుల కాపరులు. తరువాతి కాలంలో వీరు వ్యవసాయంపై ఆధారపడ్డారు. సమాజం నాలుగు వర్ణాలుగా వర్గీకరించబడింది. అనేక చిన్న చిన్న రాజ్యాలు, జాతులు విలీనమై కొన్ని పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. ఆ తరువాత వేదాలను నాలుగు భాగాలుగా విభజించినారు.

వేదాలతో పాటు రామాయణము, భారతము కూడా ఈ కాలంలోనే వ్రాయబడినాయని చెప్పబడుచున్నది. భగవద్గీత కూడా ఈ కాలములోనే వ్రాయబడినది.


కురు సామ్రాజ్యము వేదిక నాగరికత కాలానికి చెందినదే! ఇదే మహాభారతము నందలి పోరాట భూమికను పోషించినది. క్రీ.పూ.7 వ శతాబ్దానికి భారతదేశము చాలా వరకు పట్టణీకరింపబడినది. ఆ కాలం నాటి సారస్వతంలో 16 మహా జనపదాల ప్రస్తావన ఉన్నది.

[మార్చు] మహాజనపదములు

Standing Buddha, ancient region of Gandhara, 1st century CE.
Standing Buddha, ancient region of Gandhara, 1st century CE.

క్రీ. పూ. 600నాటికి భారతదేశము నందలి గంగా పరివాహక ప్రదేశములో మరియూ సింధూ పరివాహక ప్రదేశములలో పదహారు రాజ్యాలు విస్తరించినాయి. వీటిని మహా జనపదాలు అని పిలవడం కద్దు. ఇందులో ముఖ్యమైనవి, కురు, కోశల, మగధ, గాంధార. ఇవి ఎంత ముఖ్యమైనవంటే ఇప్పటికీ చందమామ కథలలో మనము ఈ పేర్లే చూస్తుంటాము! ఉపనిషత్తులు ఈ కాలములోనే వ్రాయబడినాయని ఓ అభిప్రాయము. ఈ కాలములో రాజ భాష సంస్కృతము. సాధారణ జన భాష మాత్రము ప్రాకృతము. గౌతమ బుద్ధుడు ఈ కాలము నాటి వాడే. జైన మతము స్థాపించిన మహా వీరుడు కూడా ఈకాలము వాడే. ఈ రెండు మతాలూ సులభంగా ఉండి ప్రాకృత భాషలో బోధించినాయి, అందువల్ల సామాన్యులు వీటిని ఎక్కువగా ఆదరించినారు. జైన మతము భౌగోళికంగా ఎక్కువ వ్యాపించకపోయినప్పటికీ, బౌద్ధ మతము మాత్రము టిబెట్, జపాన్, శ్రీలంక దక్షిణ ఆసియా దేశాలుకు వ్యాపించినది.


క్రీ. పూ. 500 సంవత్సరమున ఈ ప్రాంతమును పర్షియన్లు ఆక్రమించినారు. వీరు ప్రభువైన మొదటి డారస్ ఇందుకు ఆద్యుడు. పర్షియన్లు తక్షశిలను తమ రాజధానిగా చేసుకున్నప్పటికీ వీరి ప్రభావము నామ మాత్రమే. వీరు 150 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినారు. తరువాత అలెగ్జాండరు వీరిని ఓడించినాడు.

[మార్చు] మగధ సామ్రాజ్యము

పదహారు జనపదాలలో మగధ ముఖ్యమైన స్థానమునకు చేరుకున్నది. ముఖ్యముగా అశోక చక్రవర్తి కాలమున ఇది భారత దేశము చాలావరకు ఒక్కటి చేసినది. ఇతను భారత దేశపు చాలా ప్రసిద్ది చెందిన రాజు. మగధ తన రెండు పొరుగు రాజ్యాలను ఆక్రమించుకొని చాలా పెద్ద సామ్రాజ్యముగా రూపొందినది, ఇది ఓ గొప్ప సైనిక శక్తిగా కూడా వెలుగొందినది.


[మార్చు] శిశునాగ సామ్రాజ్యము

శిశునాగ వంశము మగధ సామ్రాజ్యాన్ని క్రీ. పూ. 684 వ సంవత్సరాన నెలకొల్పినది. దీని రాజధాని పాటలీపుత్రము, ప్రస్తుత పాట్నా . ఈ వంశాము క్రీ. పూ. 424 వరకూ పరిపాలన సాగించినది. తరువాత నంద వంశముచేత ఓడింపబడినది. ఈ కాలములో బౌద్ద మతమూ, జైన మతమూ స్తాపించబడినాయి.


[మార్చు] నంద సామ్రాజ్యము

నంద వంశము పూర్వపు శిశునాగ వంశమునకు చెందిన మహా నందునిఉంపుడు గత్తె కుమారునిచేత నెలకొల్పబడినది. మహాపాద నందుడు 88 సంవత్సరాల వయసులో మరణించినాడు. ఈ వంశము తరువాత మౌర్య సామ్రాజ్యము భారతదేశమును పరిపాలించినది.


[మార్చు] మౌర్య వంశపాలన

The Mauryan empire (321 to 185 BCE), at its largest extent around 230 BCE.
The Mauryan empire (321 to 185 BCE), at its largest extent around 230 BCE.

క్రీ. పూ. 321 న చంద్రగుప్త మౌర్యుడు ఆనాటి రాజయిన ధన నందుడిని సింహాసనం నుండి పదవీచ్యుతుని చేసి తాను మౌర్య సామ్రాజ్యమును స్తాపించినాడు. చంద్రగుప్తుని తరువాత అతని కుమారుడు బింబిసారుడు దేశానికి రాజయినాడు. ఇతని కాలములో భారతదేశము ప్రస్తుత భారతదేశము మొత్తాన్ని ఆక్రమించినది. మొదటిసారిగా ఉపఖండము మొత్తమూ ఓ ఝండా క్రిందికి వచ్చినది


తరువాత ఈ సామ్రాజ్యానికి అశోక చక్రవర్తి రాజయినాడు. ఇతను రాజ్యాన్ని విస్తరించడానికి పూనుకొని కళింగ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. కానీ తరువాత ఆ రక్తపాతాన్ని చూసి మనసు మార్చుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. భారతదేశ చరిత్రకు అత్యంత పురాతన ఆధారాలు అశోకుడి కాలం నాటి శాసనాలే. వీటి ఆధారంగానే వివిధ రాజ్య వంశాల కాలాలు లెక్కించబడ్డాయి. ఈ రాజు వల్లనే బౌద్ధ మతము ప్రస్తుతము ఉన్నటువండి దేశాలన్నింటిలోనూ వ్యాపించినది. అంతే కాకుండా ఈజిప్టు వంటి దేశాలకు కూడా రాయబారులను పంపించినాడు. ప్రపంచ చరిత్రలోని అత్యంత గొప్ప పరిపాలకులలో ఒకరిగా అశోక చక్రవర్తిని పరిగణిస్తారు.


మౌర్య సామ్రాజ్యము
రాజు మొదలు చివర
చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ.322 క్రీ.పూ.298
బింబిసారుడు క్రీ.పూ.297 క్రీ.పూ.272
అశోక చక్రవర్తి క్రీ.పూ.273 క్రీ.పూ.232
దశరథ మౌర్యుడు క్రీ.పూ.232 క్రీ.పూ.224
సంప్రతి క్రీ.పూ.224 క్రీ.పూ.215
శాలిశుక క్రీ.పూ.215 క్రీ.పూ.202
దేవవర్మ క్రీ.పూ.202 క్రీ.పూ.195
శతధన్వుడు క్రీ.పూ.195 క్రీ.పూ.187
బృహద్రధుడు క్రీ.పూ.187 క్రీ.పూ.185

[మార్చు] శుంగ వంశము

 శుంగవంశపుకాలము (షుమారు క్రీ.పూ. 1వ శతాబ్దం)నాటి దుర్గామాత శిలాఫలకము, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో లభించినది
శుంగవంశపుకాలము (షుమారు క్రీ.పూ. 1వ శతాబ్దం)నాటి దుర్గామాత శిలాఫలకము, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో లభించినది


శుంగ వంశము, క్రీ. పూ. 185 వ సంవత్సరములో సుమారుగా అశోకుని మరణానంతరము 50 సంవత్సరాల తరువాత ఏర్పాటుచేయబడినది. అప్పటి మౌర్య రాజు బృహద్రథుడు. ఇతను తన సైన్యాధిపతి చేతిలో దారుణంగా హత్యచేయబడినాడు. ఆ సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు. ఇతను సైనిక వందనం స్వీకరించుతున్న రాజు బృహద్రధుని చంపి, తరువాత సింహాసనాన్ని అధిష్టించినాడు.

[మార్చు] తొలి మధ్య యుగపు రాజ్యాలు - స్వర్ణ యుగము

మరిన్ని వివరాలకు చూడండి: Middle kingdoms of India.
మరిన్ని వివరాలకు చూడండి: భారత దేశపు మధ్య యుగపు రాజ్యాలు .

మధ్య యుగము, ముఖ్యముగా గుప్తుల పరిపాలన కాలాన్ని స్వర్ణ యుగము అని పిలుస్తారు, ఈ కాలములో భారతదేశము చాలావరకు భౌగోళికంగా ఏకం చేయబడినది, మరియూ ఈ కాలమున రాజకీయ, సాంస్కృతిక, శాస్త్రీయ విషయములు చాలా అభివృద్ది చేయబడినాయి. మొదటి శతాబ్దములో కుశానులు భారతదేశమును ఆక్రమించినారు. వీరు మధ్య ఆసియా నుండి వచ్చినారు. వీరి సామ్రాజ్యము పేశ్వారు నుండి గంగా నదీ పరివాహక ప్రాంతము వరకూ పరిడవిల్లినది. దీనిలో పాత బాక్టీరియా కూడా ఓ భాగంగా ఉన్నది. ఈ కాలంలో దక్షిణ భారత దేశంలో చాలా సామ్రాజ్యాలు పరిడవిల్లినాయి. ముఖ్యముగా తమిళనాడులో పాండ్యులు మధురైని రాజధానిగా చేసుకోని తమ సామ్రాజ్యాన్ని పరిపాలించినారు. తరువాత అలెక్షాండారు దండయాత్రల వల్ల పుట్టిన ఇండో - గ్రీకు రాజ్యాలు గాంధార రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 180 నుండి క్రీస్తు అనంతరం పదవ సంవత్సరం వరకూ పరిపాలించినాయి.


[మార్చు] శాతవాహన సామ్రాజ్యము

శాతవాహనులు లేదా ఆంధ్రులు దక్షిణ మరియూ మధ్య భారత దేశాన్ని పరిపాలించిన ఓ గొప్ప సామ్రాజ్యము. వీరి పరిపాలన క్రీస్తు పూర్వం 230 నందు మొదలయినది. ఏకాభిప్రాయం లేకున్నప్పటికీ సుమారుగా 450 సంవత్సరాల అనంతరము ఈ సామ్రాజ్యము పరిపాలన కొనసాగినది అని చెప్పవచ్చు. ముఖ్యముగా శక రాజులతో యుద్దాల వల్ల, సామంతుల తిరుగుబాటుల వల్ల, ఈ రాజ్యము పతనము అయినది. తరువాత చాలా చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకొని వచ్చినాయి.


[మార్చు] కుషాణు రాజ్యము

కుషాణు సామ్రాజ్యము మొదటి శతాబ్దము ఆరంభములో స్తాపించబడినది. మూడవ శతాబ్దానికల్లా ఈ సామ్రాజ్యము ఉత్తాన దశకు చేరుకున్నది. ఇది తజకిస్తాను, ఆఫ్గనిస్తాను గంగానదీ పరివాహక ప్రదేశం ల మద్య వ్యాపించినది. ఈ సామ్రాజ్యము తోచారియన్లు చే నెలకొల్పబడినది, వీరు ప్రస్తుత చైనా నుండి వచ్చినారు. కానీ సాంస్కృతిక పరముగా మాత్రము వీరు భారతీయులే! వీర్కి రామ్, సాస్సనియను పర్షియా, చైనాలతో మంచి సంబంధాలు కలవు. వీరు బౌద్ద మతాన్ని చాలా దూరం వ్యాప్తి చెందించినారు

[మార్చు] గుప్త వంశము

Standing Buddha, 5th century Uttar Pradesh, Mathura, Gupta period (4th-6th century)
Standing Buddha, 5th century Uttar Pradesh, Mathura, Gupta period (4th-6th century)

నాల్గవ శతాబ్దం నుండి ఐదవ శతాబ్దం వరకూ గుప్తుల స్వర్ణ యుగమును భారతదేశము చవిచూసినది. ఈ కాలములో హిందూ సంస్కృతి, శాస్త్ర సంపద, పరిపాలన, రాజకీయ సాంగీక సంబంధాలు ఉన్నత స్తానానికి చేరుకొన్నాయి. ఆరవ శతాబ్దంలో గుప్తుల రాజ్యం పతనమైన తరువాత భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపొయినది.


గుప్తులు మగధను కేంద్రముగా చేసుకోని పరిపాలన చేసినారు. పురాణాలు ఈ కాలములోనే వ్రాయబడినాయి అని ఓ అభిప్రాయము. హూణుల దండయాత్రల వల్ల ఈ సామ్రాజ్యము పతనము అయినది. తరువాత చిన్న సామ్రాజ్యముగా ఉన్న గుప్తులను హర్ష చక్రవర్తి పూర్తిగా ఓడించినాడు.


[మార్చు] చివరి మధ్య యుగపు రాజులు, సాంప్రదాయ యుగము

మరిన్ని వివరాలకు చూడండి: Middle kingdoms of India.
మరిన్ని వివరాలకు చూడండి: భారత దేశపు మధ్య యుగపు రాజ్యములు.

ఈ కాలములో తమిళనాడులో చోళ, కేరళయందు చేర రాజ్యాలు స్థిరపడినాయి. ఇవి సుగంధద్రవ్యాలు వంటివాటిని పశ్చిమాన ఉన్న రోమను రాజ్యానికి ఎగుమతి చేయసాగినాయి. ముఖ్యముగా సముద్ర వ్యాపారము బాగుగా అభివృద్ది చెందినది. స్వాతంత్రము వరకూ ఎదో ఒక రూపములో నెగ్గుకొని వచ్చిన రాజపుత్ర రాజ్యాలులోని మొదటి రాజ్యము ఇప్పుడే ఏర్పడినది.


[మార్చు] హర్షుని సామ్రాజ్యము

హర్షుడు కనౌజు ను రాజధానిగా చేసుకోని ఉత్తర భారత దేశమును ఏకం చేసినాడు. ఇతను ఏడవ శతాబ్దమునకు చెందిన రాజు. కానీ ఇతని మరణానంతరము సామ్రాజ్యము కుప్పకూలిపోయినది. తరువాత ఏడు నుండి తొమ్మిదవ శతాబ్దము వరకూ మూడు వంశాలు ఉత్తర భారత దేశముపై ఆధిపత్యముకొఱకు యుద్దాలు చేసినాయి. మాల్వ నగరానికి చెందిన ప్రతిహారులు, బెంగాలునకు చెందిన పాలులు, దక్కనుకు చెందిన రాష్ట్రకూఠులు.


[మార్చు] చాళుక్యులు, పల్లవులు

చాళుక్యులు, దక్షిణ భారతదేశమును 550 - 750 మరళా 970- 1190 మద్యా పరిపాలించినారు. వీరికి పల్లవులనుండి చాలా గట్టి పోటీ ఉండేది. ఈ కాలములో రెండు రాజ్యాలూ చిన్న చిన్నయుద్దాలు చాలా వరకూ పోరాడినాయి. రెండూ పరస్పరమూ ఇతర రాజ్యాల రాజధానిని ఆక్రమించుకుంటూ ఉండేవి. శ్రీలంక మరియూ చేర రాజ్యాలు పల్లవులకూ, పాండ్య రాజులు చాళుక్యులకు సహాయము చేసినాయి. ఈ రెండు రాజ్యాలు కూడా చక్కని దేవాలయాల నిర్మాణాలు చేసినాయి

[మార్చు] చోళ సామ్రాజ్యము

బొమ్మ:Hampi1.JPG
Virupaksha Temple, Hampi

తొమ్మిదవ శతాబ్దానికల్లా చోళులు చాలా శక్తివంతమైన సామ్రాజ్యముగా ఆవిర్భవించినారు. ఈ సామ్రాజ్యము 13 వ శతాబ్దములో విజయ నగర సామ్రాజ్యము స్థాపించినంత వరకూ ఓ వెలుగు వెలిగినది. వీరి ముందరి, మరియూ తరువాతి రాజుల వలెనే వీరు కూడా చక్కని నిర్మాణాలు చేసినారు. సాంస్కృతిక పరముగా ఈ కాలమును వీరు ఏలినారు, వీరి నిర్మాణాలను పోలిన నిర్మాణాలు ఇండోనేషియా శ్రీలంక లలో చూడవచ్చు!

[మార్చు] ప్రతిహారులు, పాలులు, రాష్ట్రకూటులు

ప్రతిహారులు లేదా గుర్జారా - ప్రతిహారులు రాజస్థానును పరిపాలించిన రాజులు. వీరు ఆరు నుండి పదకొండవ శతాబ్దము వరకూ పరిపాలించినారు. ఎనిమిది మరియూ పన్నెండవ శతాబ్దాలలో బీహారును పాల, బెంగాలును కూడా కంట్రోలు చేసినది. రాష్ట్రకూటులు దక్కనును పరిపాలించినారు. చోళులు దక్షిణాదిలో చక్కగా పరిపాలిస్తుంటే ఈ మూడు రాజ్యాలూ (ప్రతిహార, పాల, రాష్ట్రకూటులు) ఉత్తరాన అధికారం కోసం పోరాటం చేసినారు

[మార్చు] రాజపుత్రులు

తొలి రాజ పుత్రుల వివరములు రాజస్తానులో ఆరవ శతాబ్దములో లభిస్తున్నది. ఆ తరువాత వీరు ఉత్తర భారత దేశాన్ని చాలా వరకూ పరిపాలించినారు. ఇందులో గుజరాతు, సోలంకీ, మాళ్వా, పరమారా యొక్క బుందేల్కండు, చందేలు యొక్క హర్యానా తోమరాజు యొక్క తోమర ఉన్నాయి. కాంచీపురాన్ని పల్లవ రాజులు నాలుగు నుండి తొమ్మిదవ శతాబ్దం వరకూ పరిపాలించినారు. రాజ పుత్రుల కు ముందు ఉత్తర భారత దేసాన్ని ప్రతిహారులు పరిపాలించినారు. ఈ కాలములో ఇంకా యాదవ, చేర, హోసల, సేన పాల రాజ్యాలు పరిపాలన సాగించినాయి

[మార్చు] ముస్లిం పరిపాలకులు

ప్రధాన వ్యాసము: Islamic empires in India

పర్షియాపై అరబ్, తురుష్కు దండయాత్రల తరువాత భారతదేశంపై సుమారుగా ఓ వెయ్యి సంవత్సరాలు వివిధ చిన్న చిన్న ముస్లిం రాజుల దండయాత్రలు కొనసాగినాయి. తురుష్కు దండయాత్రలకు ముందు అరబ్బు యాత్రికులు దక్షిణ భారత దేశము నందు చక్కగా వ్యాపార సంబంధములు కొనసాగించినారు. ముఖ్యముగా కేరళలో! పదవ పదకొండవ శతాబ్దములలో తురుష్కులు మరియూ ఆఫ్ఘానులు భారతదేశ రాజధానిపై దండెత్తి డిల్లీని ఆక్రమించినారు. తరువాత బానిస వంశము, ఖిల్జీ వంశమూ పరిపాలన సాగించినాయి. తరువాత ముస్లింలు మొఘలు పరిపాలకులు

[మార్చు] విజయనగర సామ్రాజ్యము

This 14th century statue depicts Shiva (on the left) and his wife Uma (on the right}. It is housed in the Smithsonian Institution in Washington, D.C.
This 14th century statue depicts Shiva (on the left) and his wife Uma (on the right}. It is housed in the Smithsonian Institution in Washington, D.C.

హరిహర బుక్క అను సోదరులు ఇద్దరూ కలసి కావేరి నది ఒడ్డున స్తాపించిన సామ్రాజ్యము, దక్షిణ భారతదేశ చరిత్రలో ఓ ఆణిముత్యముగా రూపొందినది. ఈ కాలములో శిలలు మాట్లాడినాయి, కళలు విలసిల్లినాయి, కవిత్వము దారాళముగా ప్రవహించినది. ఈ సామ్రాజ్యాన్ని విజయ నగర సామ్రాజ్యము అని కూడా అంటారు. దీనిని 1336 లో స్తాపించినారు. కృష్ణదేవరాయలు ఈ వంశములో ప్రముఖ వ్యక్తి. 1556లో ఓ పెద్ద ఓటమిని చవిచూసినప్పటికీ తరువాత ఓ శతాబ్దము వరకూ పరిపాలన కొనసాగినది. వీరి ప్రభావం ఇండోనేషియా వరకూ వ్యాపించినది. వీరు చాలా సముద్ర మార్గాన్ని తమ ఆధీనములో ఉంచుకున్నారు.


[మార్చు] మొఘల్ సామ్రాజ్యము

ప్రధాన వ్యాసము: మొఘల్ సామ్రాజ్యం

పదహారో శతాబ్దం తొలి నాళ్ళలో కైబర్ కనుముదాటి వచ్చిన్ బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. ఇది సుమారుగా రెండు వందల సంవత్సరాలు ఉత్తర భారత దేశంను పరిపాలించినది, చివరినాళ్ళలో ముఖ్యముగా ఔరంగజేబు కాలంలో తన ఉనికిని హైదరాబాదువరకూ వ్యాపించినది. 1707 తరువాత నెమ్మదిగా నాశనమవుతూ, తరువాత పూర్తిగా నిర్మూలింపబడినది. ఈ కాలము భారతదేశము ఓ పెద్ద సాంఘిక మార్పు చవిచూసినది.

మొఘల్ సామ్రాజ్యం
రాజు మొదలు చివర
బాబర్ 1526 1530
హుమాయిను 1530 1556
అక్బరు 1556 1605
జహంగీరు 1605 1627
షాజహాను 1627 1658
ఔరంగజేబు 1658 1707


[మార్చు] మహారాష్ట్ర పరిపాలకులు

Extent of the Maratha Confederacy ca. 1760(shown here in yellow)
Extent of the Maratha Confederacy ca. 1760
(shown here in yellow)

మూస:Semain

మరాఠా సామ్రాజ్యము, మహారాజా శివాజీ చేత 1674 లో స్థాపించబడినది. వీరు నాటి బీజాపూరు సుల్తానులను ఓడించినారు. ఆ తరువాత శివాజీ మహారాజు మొఘల్ సామ్రాజ్యము పై యుద్దాన్ని ప్రకటించి ముస్లిం పరిపాలన నుండి దేశాన్ని విముక్తం చేయాలను ఆశయంగా పెట్టుకున్నారు. పద్దెనిమిదవ శతాబ్దంనాటికి పీష్వా పరిపాలన క్రిందికి చాలా వరకు భారతదేశం వచ్చినది. 1760 నాటికి ఈ సామ్రాజ్యం అటో ఇటో ఉపఖండం మొత్తం వ్యాపించినది. ఈ విస్థరణకు అడ్డుకట్ట మూడవ పానిపట్టు యుద్దం వల్ల వచ్చినది. తరువాత చివరి పీష్వా 1761లో బ్రిటీషు వారి చేతిలో ఓడిపొయినాడు.


[మార్చు] మైసూరు సామ్రాజ్యము

ప్రధాన వ్యాసము: మైసూరు రాజ్యము

మైసూరు రాజ్యము 1400వ సంవత్సరములో వడైయారులచేత స్థాపించబడినది. ఆ తరువాత వీరి పరిపాలన హైదర్ ఆలీ చేత ఆటంకబరచబడినది, ముఖ్యముగా టిప్పూ సుల్తాన్ వల్ల చాలా యుద్దాలలో వీరు ఓడించబడినారు. బ్రిటీషువారు, మరాఠీలతో ఫ్రెంచి వారి సహాయంతో టిప్పూ సుల్తాన్ చాలా యుద్దాలతో ఇబ్బంది పెట్టినాడు, కానీ చివరకు బ్రిటీషువారే గెలిచినారు. తరువాత వడైయారులు ఈ సామ్రాజ్యమునకు పరిపాలకులుగా పరిమిత అధికారాలతో నియమించబడినారు. స్వాతంత్రానంతరము ఈ రాజ్యము భారతదేశంలో కలపబడినది, ఇది ప్రస్తుత కర్నాటక రాష్ట్రమునందు కలదు. ఇప్పటీకీ ఈ వంశపు రాజుల చేతిలోనే మైసూరు ప్యాలస్కలదు, వీరు మైసూరు దసరా ఉత్సవాలయందు అధికారికంగా పాల్గొంటారు.


[మార్చు] పంజాబు చరిత

ప్రధాన వ్యాసము: సిక్కు సామ్రాజ్యము

పంజాబు రాజ్యము, సిక్కులచేత పరిపాలించబడినది, ఇది ముఖ్యముగా పదిమంది గురువుల ద్వారా వ్యాపించబడిన మత అవలంభికులయిన సిక్కులచేత పరిపాలింపబడినది. ఇది ప్రస్తుత పంజాబును కలిగి ఉన్నది, కానీ మహా రాజా రంజిత్ సింగ్ పరిపాలనలో మాత్రము కాశ్మీరు, పేశ్వారు వరకూ వ్యాపించినది.

తరువాత ఆంగ్లో - సిక్కు యుద్దంలో వీరు ఓడింపబడినారు.

[మార్చు] ఈష్టు ఇండియా పాలన

ప్రధాన వ్యాసములు: ఈష్టు ఇండియా పాలన, భారతదేశంలో యూరోపు కాలనీలు
Robert Clive, 1st Baron Clive, became the first British Governor of Bengal.
Robert Clive, 1st Baron Clive, became the first British Governor of Bengal.

వాస్కోడిగామ 1498 లో భారతదేశానికి దగ్గర దారిని కనుగొని యూరోపు దేశాల కాలనీ పరిపాలనకు ద్వారాలు తెరిచినాడు.

1619లో సూరత్ నందు బ్రిటీషువారు తమ తొలి పోష్టును ఏర్పాటుచేసుకున్నారు. తరువాత పోర్చుగీసువారు, డచ్చి వారు (బుడత కీచులు) కూడా వచ్చే సరికి, తమ పోష్టును మద్రాసునకు మార్చుకున్నారు. ఆ తరువాత బొంబాయి, కలకత్తాలలో కూడా వ్యాపార కేంద్రాలు ఏర్పాటుచేసుకున్నారు. ఇవి అన్నీ కూడా మొదట వాటి వాటి పాలకుల అనుమతితోనే జరిగినాయి.


పోర్చుగీసువారు గోవా, డామన్, డయ్యూ, బొంబాయిలలో ఏర్పాటు చేసుకున్నారు. అవి 1962 వరకూ వారి ఆధీనములోనే ఉన్నాయి, తరువాత నెహ్రూగారు తమ యుక్తితో పోలీసు చర్య ద్వారా వాటిని స్వాధీనము చేసుకున్నారు.

ప్రధాన వ్యాసము: భారతదేశంలో ఫ్రెంచివారు

ఫ్రెంచివారుకూడా బ్రిటీషు తోపాటు 17 వ శాతాబ్దంలోనే వచ్చినారు. కానీ బ్రిటీషువారితో యుద్దాలతో వీరు పరాజితులై వెనుదిరితినారు, కానీ పాండిచ్చెరి, చందరనగర్ వీరితోనే ఉన్నాయి.


డచ్చివారు, భారతదేశం వచ్చినప్పటికీ ఎక్కువగా ఏమీ సాధించలేదు, ట్రావెనుకోరు మాత్రం వారికి వచ్చినది, ముఖ్యముగా వారు శ్రీలంక పైననే దృష్టిసారించినారు. వీరు కేరళ లోని రాజులకు యుద్ద శిక్షణ ఇచ్చినారు.

[మార్చు] బ్రిటిషు వారి పాలన

ప్రధాన వ్యాసము: బ్రిటీషు పాలన

బ్రిటిషు మొదట వ్యాపారం నిమిత్తము దేశానికి ఈష్టు ఇండియా కంపెనీ అనే పేరు మీద వచ్చి, చంద్రగిరి రాజు దగ్గర అనుమతి తీసుకోని చెన్నై వద్ద ఓ కోట నిర్మించుకోని (తమ సరుకుల రక్షణ కోసం) వ్యాపారం సాగించినారు. అప్పటి నుండి ఇక్కడి రాజుల మధ్య తగాదలలో తలదూరుస్తూ, తమ స్వార్దమే పరమావధిగా మారుతూ, విభజించి పాలిస్తూ ఇతర ఐరోపా కంపెనీలపై పైచేయి సాధిస్తూ తమ కుటిల నీతితో దేశాన్ని ఒక్కో భాగాన్ని కబలించినారు. ముఖ్యముగా 1757లోని ప్లాసీ యుద్దంతో మొత్తం అప్పటి బెంగాలు ప్రావిన్సును ఆక్రమించినారు. తరువాత తరువాత అవే కుటిలనీతితో మొత్తం దేశాన్ని ఆక్రమించినారు.

1857లో భారతీయులు తమ ప్రథమ స్వాతంత్ర్య పోరాటంసాగించినారు, కానీ అది విజయం సాధించలేక పోయినది.


[మార్చు] భారత దేశ స్వాతంత్ర్య పోరాటం

ప్రధాన వ్యాసము: భారత స్వాతంత్ర్య పోరాటము

భారత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రకే తలమానికమైనది. అహింసాయుత పద్దతిలో సత్యాగ్రహమే ఆయుధంగా మహాత్మా గాంధీ నడిపించిన పోరాటం, ఇతర దేశాలకు మార్గదర్శినిగా నిలిచి, ప్రపంచాన్ని శాంతిమయం చేయడానికి మార్గం చూపించింది. భారత స్వాతంత్ర్య పోరాటం చాలా కాలం కొనసాగింది. తొలిసారి భ్రిటీషువారు దేశానికి వచ్చినప్పటినుండీ రాజులు తమ తమ రాజ్యాలు రక్షించుకోవడానికి చాలా యుద్దాలు చేసారు. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య పోరాటం దేశం మొత్తాన్ని ఓ కుదుపు కుదిపింది. తరువాత ఎన్నో పోరాటాలు జరిగినాయి. అల్లూరి సీతారామరాజు లాంటి దేశ భక్తులు బ్రిటీషు వారి దోపిడీ విదానాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి, తమ ప్రాణాలను అర్పించారు. వందేమాతరం అంటూ బెంగాలు ప్రజలను కార్యోన్ముఖులను చేసిన వంగ ఐక్యోద్యమం ఇటువంటి పోరాటాల్లో ముఖ్యమైనది. తరువాత జరిగిన పోరులో మహాత్మా గాంధీ కాంగ్రెసు పార్టీ ద్వారా భారతీయులందరినీ ఓ తాటిపై నడిపి, అహింసా పోరాటం జరిపి, భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టాడు. ఇదే కాలంలో సుభాస్‌చంద్ర బోసు వంటి వీరులు సాయుధ పోరాటం చేసి, తమ ప్రాణాలను భరత మాత పాదాల చెంత వదిలినారు.

కోట్ల మంది భారతీయుల పోరాట ఫలితంగా 1947 ఆగష్టు 15 న భారతదేశం స్వాతంత్ర్యం సాధించింది.

[మార్చు] స్వతంత్ర భారత దేశము

ప్రధాన వ్యాసము: స్వాతంత్రానంతర భారత దేశ చరిత్ర


Map of Indiaమూస:Mn.
Map of Indiaమూస:Mn.

స్వాతంత్రానంతరము భారత దేశము తన పొరుగు దేశాలతో ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నది. ముఖ్యముగా పాకిస్తానుతో నాలుగు యుద్ధాలు, మరియూ చైనా తో ఓ యుద్ధము చెప్పుకోవచ్చు. 1974 లోని తొలి అణు పరిక్షలు ద్వారా అణు దేశముగా రూపాంతరము చెందినది. తరువాత 1998 లో జరిపిన అణు పరిక్షలు ద్వారా తనను తాను అణు దేశంగా ప్రకటించుకున్నది. కానీ తొలిసారి ఎవరిపైననూ అణుబాంబులు ప్రయోగించరాదని తనకు తాను మారటోరియం విధించుకున్నది. ప్రస్తుతము ప్రంచము భారతదేశాన్ని ఓ బాద్యతాయుత అణుదేశంగా గుర్తిస్తున్నది. 1990 వరకూ భారతదేశము సోషలిస్టు సిద్దాంతాల ప్రకారము తన ప్రణాలికలు రచించుకొని అభివృద్దివైపు అడుగులు వేసినది. తరువాత మొదలైన ఆర్ధిక సంస్కరణలు భారతదేశాన్ని ఓ క్రొత్త మార్గంవైపు నడిపించినాయి. ముఖ్యముగా ఈ కాలములోని ఐ టీ విప్లవం ప్రపంచానికి ఓ క్రొత్త భారతదేసాన్ని చూపించినది. మరిన్ని వివరములు ఆర్ధిక సంస్క్రణలు అను వ్యాసంలో తెలుసుకుందాము. ప్రస్తుతము,21 వ శతాబ్దంలో భారతదేశాన్ని త్వరగా అభివృద్ది చెందుతున్న దేశంగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం, స్తూల జాతియాదాయంను అనుసరించి ప్రపంచంలో పదవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ. కొనుగోలు శక్తి ద్వారా ఇది నాలుగవ స్థానంలో ఉన్నది.


అణు కార్యక్రమం మాత్రమే కాకుండా భారతదేశానికి ఓ శక్తివంతమైన అంతరిక్ష కార్యక్రమం కూడా కలదు.

స్వాతంత్రానంతర భారత దేశ పూర్తి చరిత్ర కోసం చూడండి: స్వాతంత్రానంతర భారత దేశ చరిత్ర


[మార్చు] ఇంకా చూడండి

భారత దేశ విద్యా వ్యవస్థ - చరిత్ర


[మార్చు] బయటి లింకులు

దోపిడి పాలనకు దండకాలా? an article in eenaadu paper |

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu