తెలుగు సాహిత్యము
వికీపీడియా నుండి
తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర వున్నది. నన్నయ్య రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు వున్నట్లు ఆధారాలు వున్నాయి. గాధా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన వున్నది.
విషయ సూచిక |
[మార్చు] ఉపోద్ఘాతము
తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికమైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం.
[మార్చు] చరిత్ర
తెలుగు సాహితీ చరిత్ర లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. కాలానుగుణ తెలుగు సాహితీ చరిత్ర కోసం తెలుగు సాహితీ చరిత్రను చూడండి. తెలుగు సాహితీకారుల గురించిన మరిన్ని వివరముల కోసం తెలుగు సాహితీ కారులను చూడండి.
- స్త్రీల కోకిల కంఠములలో, కర్షక శ్రామికుల స్వేదంలో, జానపదుల సంతోషములలో, తెలుగువారి ఘనమైన పండుగలలో తెలుగు సాహితీ చరిత్ర మొదలయింది.
- తరువాత క్రీ.శ తొమ్మిదవ శతాబ్దం నుండి శిలా శాసనాలకు ఎక్కింది.
- క్రీ.శ పదకొండవ శతాబ్దములో ఆదికవి నన్నయ్య చేతిలో, ఆంధ్ర మహాభారతం రూపంలో ఆదికావ్య రచన మొదలయింది.
- ఈ ఆంధ్ర మహాభారతాన్ని పద్నాలుగవ శతాబ్దాంతానికి తిక్కన, ఎర్రనలు పూర్తి చేసారు. ఈ ముగ్గురూ తెలుగు కవిత్రయము అని పేరుపొందినారు.
- పదమూడవ శతాబ్దంలో గోన బుద్దారెడ్డి రామాయణాన్ని తెలుగువారికి తెలుగులో అందించినారు.
- పద్నాలుగవ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడు భాగవతాన్ని తేట తెలుగులో రచించి, తెలుగువారిని ధన్యులను గావించారు.
- పోతన కు సమకాలికుడైన శ్రీనాథ కవిసార్వభౌముడు తన ప్రబంధాలతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసాడు.
- పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు భాషకు, పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.
- పదిహేనవ శతాబ్దంలోన ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
- పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పడిన ముప్పైరెండువేల పదాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం.
- క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాఅక సంగీతానికి ఆయువుపట్టు వంటివి.
- తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు"
- ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు.
[మార్చు] తెలుగు సాహితీ పద్దతులు
తెలుగుసాహిత్యములో ప్రపంచ సాహిత్యము లో వలెనే వివిధ రకరకాలైన పద్దతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు.
- జానపద సాహిత్యము
- వచన కవితా సాహిత్యము
- పద కవితా సాహిత్యము
- పద్య కవితా సాహిత్యము
- చంపూ సాహిత్యము
- శతక సాహిత్యము
- నవలా సాహిత్యము
- చిన్న కథలు
- అవధానములు
- ఆశుకవిత
- సినిమా సాహిత్యము
[మార్చు] ప్రముఖ కావ్యాలు
తెలుగులో వివిధ సాహిత్య రీతుల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎన్నో కావ్యాలు వచ్చాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
[మార్చు] ప్రస్తుత పరిస్థితి, ఓ అవలోకనం
ప్రస్తుతము విప్లవ సాహిత్యము, అవధానములు, ఇంటర్నెట్టు తెలుగు సాహిత్యము, వివిధ ఇజములుకు చెందిన సాహిత్యములు, నవలలు,టీ వీ సాహిత్యము, సినీ సాహిత్యము, రీ మిక్షులు, చిన్న కథలు,తెలుగు సాహిత్య ముఖ చిత్రాన్ని చాలా వరకు పూర్తి చేస్తున్నాయి
[మార్చు] భారతదేశ సాహిత్యంలో తెలుగు సాహిత్యపు స్థానం
[మార్చు] ప్రపంచ సాహిత్యంలో తెలుగు సాహిత్యపు స్థానం
[మార్చు] ఉపభాగములు
[మార్చు] చూడండి
తెలుగు సాహిత్యము|తెలుగు సాహితీకారులు|ప్రముఖ కావ్యాలు