చర్చ:బ్లాగు
వికీపీడియా నుండి
చదివేవారిని చదువరి-చదువరులు అన్నట్లే బ్లాగింగు చేసే వారిని బ్లాగరి-బ్లాగరులు అనడం ఎలా ఉంటుంది? (ప్రస్తుతం బ్లాగరు-బ్లాగర్లు అని, బ్లాగకుడు/రాలు-బ్లాగకులు అని అంటున్నాం.) -త్రివిక్రమ్ 15:59, 11 జూలై 2006 (UTC)
- బ్లాగరి, బ్లాగరులే సరైన పదాలు. ఈ వ్యాసంలో నేనవే వాడాను. కానీ ఒకచోట స్పెల్లింగు తప్పు పడి బ్లాగర్లు అని పడింది, సరిదిద్దుతాను. Blogroll ను బ్లాగ్ధార అనవచ్చునా?__చదువరి (చర్చ, రచనలు) 07:20, 12 జూలై 2006 (UTC)
- బ్లాగ్ధార పదం బాగుంది. కానీ blogroll కి సరిపోదేమో? బ్లాగ్పట్టీ, బ్లాగ్జాబితా రెండూ అంత బాలేవు.--వీవెన్ 09:00, 12 జూలై 2006 (UTC)
[మార్చు] బ్లాగోళం
Blogsphere: బ్లాగ్గోళం కంటే బ్లాగోళం బాగుంటుంది కదా. (కూడలికి పెట్టాలనుకున్న పేర్లలో అదొకటి.) --వీవెన్ 05:16, 12 జూలై 2006 (UTC)