దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
స్వాతంత్ర్య సమర యోధుల్లో ప్రముఖుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండరామస్వామి మరణించాడు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్లలో చదివి ఉత్తీర్ణుడయ్యాడు. ఒక మిత్రుని సాయంతో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఎ చదివాడు. తిరిగివచ్చాక, రాజమండ్రిలోను, బందరులోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు.