రేడియో
వికీపీడియా నుండి
మెదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ లో "రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయీ" ద్వారా ప్రసారం చెయబడినవి. దీని తరువాత "బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ" ఏర్పాటు చెయ్యబడింది. ప్రయౌగాత్మకంగా జూలై 1927 లొ కలకత్తా, బొంబాయ్ నగరాలలొ "ఇండియన్ బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ" ప్రసారాలు చెసింది. ఇండియన్ బ్రాడ్ కాష్టింగు కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యం లొ ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరములొ అకాశవాణి ప్రభుత్వ సంస్ధగా అవతరించింది. అంతకి పూర్వము ప్రైవేటు రేడియో క్లబ్బులు ఉండేవి.
స్వాతంత్ర్యం వచ్చేసరికి ఆరు అకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉండేవి.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చెసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు (కలకత్తా,డిల్లీ, బొంబాయ్, మద్రాసు, లక్నో, తిరుచనాపల్లి) మాత్రమే ఉన్నాయి.
ఇప్పుడు 215 అకాశవాణి కేంద్రాలు 337 ప్రసార కెంద్రాల (144 MW కేంద్రాలు,54 SW కేంద్రాలు,139 FM కేంద్రాలు)తొ 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని,విజ్ఞానాన్ని,వినోదాన్ని అందిస్తున్నాయి.
తాజాగా టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్న వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిసిస్తూ సృష్టిస్తున్న సంచలనం అందరికీ తెలిసిందే. మన రాష్టంలొ కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు
విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లు, అదిలాబాదు, అనంతపురం, హైదరాబాదు, కొత్తగూడెం, కర్నూలు, కడప, తిరుపతి.