Wikipedia:పరిచయము
వికీపీడియా నుండి
ప్రతి వ్యాసము యొక్క పై భాగమున "మార్పు" టాబ్ ని చూశారా? వికిపీడియాలో, మీరు లాగిన్ అయి ఉన్నా, లేకున్నా, ఎప్పుడైనా పేజీలకు మార్పులు చేర్పులు చేయవచ్చు.
ఏమిటి ఈ వికిపీడియా?
వికిపీడియా ఒక స్వతంత్ర విజ్ఞాన సర్వస్వము. ఇది అనేక మంది పాఠకుల యొక్క సమిష్టి కృషితో తయారు చేయబడినది. చాల మంది వ్యక్తులు ప్రతి రోజూ కొన్ని వందల కొద్ది మార్పులు చేర్పులు చేస్తూ, నిరంతరముగా మెరుగు పరచుచున్నారు. ఈ దిద్దుబాట్లు అన్నీ పేజీ చరిత్ర మరియు ఇటీవలి మార్పులు పేజీలలో నమోదు అవుతాయి. అప్రసంగములు మరియు దుశ్చర్యలు వెంటనే తొలగించబడతాయి మరియు వాటిని సృష్టించిన వారు నిషేదించబడతారు.
నేనెలా తోడ్పడవచ్చు?
వ్యాసాలను సరిదిద్దే విషయమై ఎవరైనా చొరవగా జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది ...కానీ, నిర్లక్ష్యంగా ఉండకండి! సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. వికిపీడియాలో మీరు చేసే దిద్దుబాట్ల వల్ల నష్టము వాటిల్లుతుందని భయపడవద్దు. ఎప్పుడైనా వాటిని సరిదిద్దడము లేదా మెరుగుపరచడము చేయవచ్చు. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరిస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే!
దిద్దుబాట్లు చెయ్యడము చాలా సుళువైన పని:
- ఈ పేజీ పైభాగమునున్న మార్చు ను నొక్కండి. మీ మొదటి దిద్దుబాటును ఇక్కడికిక్కడే ఈ పేజీలో ప్రయోగించవచ్చును.
- సందేశమును టైపు చెయ్యండి.
- మీరు రాసిన విషయాన్ని భద్రపరచుటకు పేజీ క్రింది భాగములోనున్న పేజీ భద్రపరచు ను నొక్కండి.
... లేదా మీరు చేసిన మార్పులు చూపించుటకు "తేడాలు చూపించు" ను నొక్కండి.