మూస:ఈ వారం వికీ చిట్కా
వికీపీడియా నుండి
ఈ చిట్కాను వాడి మరింత సమర్ధవంతంగా వికిపీడియా ను ఉపయోగించండి మరిన్ని చిట్కాలను వికీ చిట్కాలు లో చేర్చండి. |
[మార్చు] వికిపీడియాలో "సంతకం" చెయ్యడం ఎలా?
వికిపీడియా లో సభ్యులు చర్చా పేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాసాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట.
సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు.
- సభ్యనామం రాయడం
- సభ్యనామం తో పాటు తేదీ, సమయం కూడా రాయడం
- తేదీ, సమయం మాత్రమే రాయడం
సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా - "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను -
- 3 సార్లు నొక్కితే - సభ్యనామం
- 4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం
- 5 సార్లు నొక్కితే - తేదీ, సమయం
పడతాయి. మీరు లాగిన్ అయి ఉంటే సభ్యనామం పడుతుంది, లేదంటే, మీ ఐ పి అడ్రసు పడుతుంది.
ఇది చూడండి - Chaduvari 06:29, 25 August 2005 (UTC) - ఇది ఈ రచయిత సంతకం, తేదీ, సమయం.
దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి లో ఇటువంటి వివరాలు ఇంకా ఉన్నాయి చూడండి.
ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి.