ఆపరేటింగు సిస్టంలు
వికీపీడియా నుండి
[మార్చు] ఆపరేటింగు సిస్టములు
ఆపరేటింగు సిస్టము అనగా, కంప్యూటరు హార్డ్ వేర్ తో నేరుగా అనుసంధానింపబడి ఉండి అప్లికేషన్ల నుండి వచ్చు కమాండులు, విన్నపాలు హార్డ్ వేర్ తో పని చేయించగలదు. మరింత తేలికగా ఈ ఆపరేటింగు సిస్టము యొక్క పాత్రను అర్ధము చేసుకొనడానికి ఈ క్రింది ఉదాహరణను చూడండి.
మీ దగ్గర ఒక కంప్యూటరు ఉన్నది. అది హార్డువేరు. మీరు సినిమా చూడాలి అని సీడీ ని సీడీ డ్రైవు నందు ఉంచి మీడియా ప్లేయరు ని ఓపెన్ చేసి సినిమా చూసినారు. ఇందు లో సీడీ మరియు సీడీ డ్రైవులు రెండూ హార్డువేరు లో భాగమే, ఇహ మీడియా ప్లేయరు అనునది ఒక అప్లికేషను. మీరు మీడియా ప్లేయరు నందు ప్లే నొక్కగానే మీ విన్నపము ముందు మీడియా ప్లేయరు కు వెళ్ళి తరువాత లోన ఉన్న ఆపరేటింగు సిస్టము నకు చేరుతుంది, ఆ విన్నపాలను గ్రహించి ఆపరేటింగు సిస్టమే మీకు బొమ్మ కనపడేటట్లు, ధ్వని వినపడేటట్లు హార్డువేరు ను నియంత్రిస్తుంది.
మీకూ కంప్యూటరు కు మధ్య అప్లికేషన్ వుంటే, అప్లికేషనుకు కంప్యూటరు హార్డువేరు నకు మధ్య ఆపరేటింగు సిస్టం ఉంటుంది.
మనకు మార్కెట్లో రక రకాల ఆపరేటింగు సిస్టములు లభిస్తున్నాయి. వీటిని రెండు రకాల గా విభజించ వచ్చు
[మార్చు] డెస్కుటాపు ఆపరేటింగు సిస్టములు
డెస్కుటాపు ఆపరేటింగు సిస్టములు అనగా మనము ఇల్లలో వాడే కంప్యూటర్లను నడపటానికి వాడు ఆపరేటింగు సిస్టములు. మనకు మార్కెట్లో లభించు రకరకాల ఆపరేటింగు సిస్టములు:
- విండోసు
- లినక్షు
- మేక్
[మార్చు] సర్వరు ఆపరేటింగు సిస్టములు
- విండోసు సర్వర్లు
- లినక్షు సర్వర్లు
- యునిక్షు సర్వర్లు