అండమాన్ నికోబార్ దీవులు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
అండమాన్ నికోబార్ దీవులు భారత దేశము యొక్క కేంద్ర పాలిత ప్రాంతము. ఈ దీవులు బంగాళా ఖాతము కు దక్షిణమున హిందూ మహాసముద్రము లో ఉన్నవి. అండమాన్ దీవులను మరియు నికోబార్ దీవులను వేరుచేస్తున్న 10° ఉ అక్షాంశమునకు ఉత్తరమున అండమాన్ దీవులు, దక్షిణమున నికోబార్ దీవులు ఉన్నవి. ఈ కేంద్ర పాలిత ప్రాంతము యొక్క రాజధాని నగరము పోర్ట్ బ్లెయిర్.
విస్తీర్ణము | 8293 చ.కీ.మీ. |
జనాభా | 277,989 |
రాజధాని | పోర్ట్ బ్లెయిర్ |
అక్షరాస్యత | 73.74% |
ప్రధాన భాషలు | స్థానిక గిరిజన భాషలు, హిందీ, తమిళము మరియు బెంగాలీ |
విషయ సూచిక |
[మార్చు] పేరు
అండమాన్ అను పేరు హండుమాన్ అను పదమునుండి పుట్టినది. మలయ్ భాష లో హిందూ దేవుడు హనుమాన్ లేదా హనుమంతున్నీ హండుమాన్ అని పిలుస్తారు.
మలయ్ భాషలో నికోబార్ అనగా నగ్న మనుషుల భూమి.
[మార్చు] చరిత్ర
17వ శతాబ్దంలొ మరాఠీలు(మహరాష్ట్రీయులు) ఈ దీవులను ఆక్రమించారు. అటు పిమ్మట ఈ దీవులు బ్రిటిష్ ఇండియాలో భాగం అయినవి. రెండవ ప్రపంచ యుద్దకాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్, జపనీయుల సహాయముతో ఈ దీవులను బ్రిటిష్ వారి నుండి స్వాధీనం చేసుకొన్నది. జనరల్ లోకనాధన్ గవర్నర్ గా తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వం నెలకొల్పబడినది. నేతాజీ ఈ దీవులకు షహీద్(అమరజీవి) మరియు స్వరాజ్య్(స్వరాజ్యం) అని నామకరణం చేసారు.కానీ రెండవ ప్రపంచ యుద్దములో జపనీయుల ఓటమి మరియు నేతాజీ మరణంతో ఈదీవులు తిరిగి బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చినవి.1947లొ ఇవి స్వతంత్ర భారతంలో భాగం అయినవి.
ప్రవాస లేదా ఏకాంత ద్వీపాంతర శిక్ష విధించబడిన భారత స్వతంత్ర సమరయోధులను బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి సెల్యులార్ జైలులొ బంధించేది. ఈ జైలును కాలాపానీ అని కూడా పిలిచేవారు. పోర్ట్ బ్లెయిర్ లోని ఈ సెల్యులార్ జైలును భారతదేశపు సైబీరియాగా పరిగణించేవారు.
26 డిశెంబరు 2004 న హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం ఫలితంగా వచ్చిన సునామీ 7వేలకు పైగా అండమాన్ మరియు నికోబార్ దీవుల వాసులను పొట్టన పెట్టుకొంది. మరణించిన వారిలో అధికులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారే కాగా ఈ దీవులలోని ఆదిమవాసులు క్షేమముగా తప్పించుకోగలిగారు.[1]
[మార్చు] ఇవికూడా చూడండి
- 2004 హిందూ మహాసముద్రపు భూకంపము
- అండమాన్ దీవులు
- నికోబార్ దీవులు
- అండమాను భాషలు
[మార్చు] బయటి లింకులు
- అండమాన్ నికోబార్ దీవుల పరిపాలనా వెబ్ సైటు
- అండమాన్ సంఘము
- అండమాన్ఇండియా.కాం
- భారతదేసపు పగడపు దీవుల ప్రాంతము - అండమాన్
- 2004 హిందూ మహాసముద్రపు భూకంపముపై సన్ నెట్వర్క్ లో వ్యాసము
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అస్సాం | బీహార్ | చత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ మరియు కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్, నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్, డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |