బకింగ్‌హాం కాలువ
వికీపీడియా నుండి
బకింగ్‌హాం కాలువ (Buckingham Canal), దక్షిణ భారతదేశములోని కోరమాండల్ తీరము వెంట ప్రయాణించే నావికా యోగ్యమైన ఉప్పునీటి కాలువ. 420 కిలోమీటర్లు పొడవున్న ఈ కాలువ ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుండి తమిళనాడు లోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉన్నది. ఈ కాలువ తీరము వెంబడి ఉన్న సహజ సిద్ధమైన వెనుకజలాలను మద్రాసు నౌకాశ్రయముతో కలుపుతున్నది. ఆంగ్లేయులు కట్టించిన ఈ కాలువ బ్రీటిషు పాలనా కాలములో ప్రధాన జలరవాణా మార్గముగా అభివృద్ధి చెందినది.