పచ్చకామెర్లు
వికీపీడియా నుండి
పచ్చకామెర్లు. కళ్ళు పచ్చగా ఉన్నంతనే అందరూ అయ్యో కామెర్లు అని జడిపిస్తారు.
[మార్చు] లక్షణాలు మరియు నిర్ధారణ
- కళ్ళు తెల్ల గుడ్డు పచ్చగా , నీరుడు మూత్రం ఎర్రగా, ఆకుపచ్చగా రంగులో ఉంటే అది అసలైన లివర్ కాలేయం పచ్చ కామెర్లు.
- కళ్ళు పచ్చగా ఉండి నీరుడు మూత్రం తెల్లగా ఉంటే అది మలేరియాలో రక్తం విరిగి కావచ్చు.
- కళ్ళు మూత్రం పచ్చగా ఉండి, కుడి వైపు డొక్కలో శూల పోటు వస్తుంటే అది పైత్యకోశ రాళ్ళు గురించి పరీక్ష చూడవలె.
- ఎన్ని పరీక్షలకు దొరక్క పోతే అది రాచపుండు కేన్సర్ కావచ్చా?
- అల్ట్రాసౌండ్ స్కాన్, మామూలు ఎక్స్-రేల్లో రాళ్ళు తెలుస్తాయ
- ఎండోస్కోప్ /లాపరోస్కోపుల్లో కొన్ని కేన్సర్లు దొరకవచ్చు.
- పచ్చ కామెర్లకు ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ పోల్చుకోవడం కొంతకాలం పట్టవచ్చును.
[మార్చు] చికిత్స
వైరస్ హెపటైటిస్ మామూలు లివర్ కామెర్లకు వైరస్ కారణం కాబట్టి వైద్యం లేదు. అందు చేత పసర్లు వగైరా చలామణీలో ఉన్నాయి. 15-30 రోజులు సేదతీరితే అదే తగ్గిపోతుంది. నీరసం 2 నెలలు ఉంటుంది. మాంసము, పప్పులు తగ్గించి తినాలి. ఎక్కువ తింటే మెదడుకు ఎక్కగలదు. మలేరియాకు క్లోరోక్విన్ పూర్తి కోర్సు 10 బిళ్ళలు రెండున్నర రోజులపాటు భోజనం తరువాత వేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఖరీదైన మందులు ఇంజక్షన్లు అక్కర్లేదు. వైరస్ జాండిస్ ఉన్నవారికి చేసిన ఇంజక్షన్ సూదులు మళ్ళీ వాడవలసి వస్తే ఎక్కువ మరిగించవలెను.