నందలూరు
వికీపీడియా నుండి
నందలూరు మండలం | |
---|---|
జిల్లా: | కడప |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | నందలూరు |
గ్రామాలు: | 21 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 38.28 వేలు |
పురుషులు: | 19.113 వేలు |
స్త్రీలు: | 19.167 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 64.84 % |
పురుషులు: | 77.03 % |
స్త్రీలు: | 52.72 % |
చూడండి: కడప జిల్లా మండలాలు |
నందలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము. కడప - తిరుపతి మార్గంలో కడప నుంచి 40 కి.మీ. దూరంలో నందలూరు చెయ్యేటికి ఎడమ గట్టున ఉంది. నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయం విశాలమైనది. సౌమ్యనాథుని నారదముని ప్రతిష్టించాడంటారు. 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు ఆలయాన్ని నిర్మించాడు. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురం కట్టించాడు. ఇంకా ఈ ఆలయాన్ని పాండ్యులు, విజయనగర రాజులు, పొత్తపి పాలకులు, మట్లి రాజులు అభివృద్ధి చేశారు. సౌమ్యనాథాలయం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి 108 స్తంభాలున్నాయి.
ఈ ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఆలయం గోడల మీద మత్స్య, సింహ చిహ్నాలున్నాయి. గర్భగుడి ముందు ఆలయం కప్పు పై చేప బొమ్మ ఉంది. జలప్రళయం వచ్చి నీరు చేపను తాకినప్పుడు చేప సజీవమై నీటిలో కలిసిపోతుందట. ఆలయ నిర్మాణానికి ఎర్రరాతిని ఉపయోగించారు. ఈ సౌమ్యనాథుని చొక్కనాథుడు అంటారు. ఆదికవి నన్నయ ఈ సౌమ్యనాథుని దర్శించి సేవించాడు. నందలూరుకు 5 కి.మీ. దూరాన తాళ్ళపాక ఉంది. తాళ్ళపాక అన్నమాచార్యుడు కూడా చొక్కనాథుడిని సేవించాడు.
కాకతీయ ప్రతాపరుద్రుడు మన్నూరు, హస్తవరం, నందలూరు, అడపూరు, మందరం గ్రామాలను ఈ ఆలయానికి దానంగా ఇచ్చాడు. ఆ గ్రామాల రెవెన్యూ ఇప్పటికీ ఆలయానికే అందుతోంది. నందలూరును నిరందనూరు, నిరంతనూరు, నిరంతాపురం, నెలందలూరు అని కూడా పిలిచేవారు. ఈ గ్రామం ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం. నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామముండేది. ఇప్పటికీ దీనిని బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట మీద సొరంగ మార్గముంది. నందలూరు దగ్గర చాలా గుహలున్నాయి. సిద్ధవటం కోటలోనుంచి నందలూరు గుహల్లోకి రహస్య మార్గముందంటారు. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు, బౌద్ధ విహారం, కొన్ని కట్టడాలు, 1600 పైగా సీసపు నాణేలు, మరికొన్ని బౌద్ధ చిహ్నాలు దొరికాయి.
[మార్చు] గ్రామాలు
- అడపూరు
- చింతలకుంట
- జంగాలపల్లె
- కొమ్మూరు
- కోనాపురం
- కుమారునిపల్లె
- కుండ నెల్లూరు
- లేబాక
- లేబాక మంగమాంబాపురం
- నాగిరెడ్డిపల్లె
- నల్లతిమ్మయపల్లె
- నందలూరు
- నూకినేనిపల్లె
- పాతూరు
- పొత్తపి
- రామమాంబపురం
- రంగాయపల్లె
- టంగుటూరు
- టంగుటూరు వెంగమాంబాపురం
- తిమ్మరాజుపల్లె
- యెల్లమరాజుపల్లె
[మార్చు] కడప జిల్లా మండలాలు
కొండాపురం | మైలవరం | పెద్దముడియం | రాజుపాలెం | దువ్వూరు | మైదుకూరు | బ్రహ్మంగారిమఠం | బి.కోడూరు | కలసపాడు | పోరుమామిళ్ల | బద్వేలు | గోపవరం | ఖాజీపేట | చాపాడు | ప్రొద్దుటూరు | జమ్మలమడుగు | ముద్దనూరు | సింహాద్రిపురం | లింగాల | పులివెందల | వేముల | తొండూరు | వీరపునాయునిపల్లె | యర్రగుంట్ల | కమలాపురం | వల్లూరు | చెన్నూరు | అట్లూరు | ఒంటిమిట్ట | సిద్ధవటం | కడప | చింతకొమ్మదిన్నె | పెండ్లిమర్రి | వేంపల్లె | చక్రాయపేట | లక్కిరెడ్డిపల్లె | రామాపురం | వీరబల్లె | రాజంపేట | నందలూరు | పెనగలూరు | చిట్వేలు | కోడూరు | ఓబులవారిపల్లె | పుల్లంపేట | టి.సుండుపల్లె | సంబేపల్లి | చిన్నమండెం | రాయచోటి | గాలివీడు | కాశి నాయన