ఆంధ్ర విశ్వవిద్యాలయం
వికీపీడియా నుండి
ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్నంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం 1925 లో ఏర్పడింది. ప్రారంభ సంవత్సరాలలో మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరక విశ్వవిద్యాలయ ఉపసంచాలకునిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపసంచాలకునిగా ఉన్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడినది.
యూనివర్సిటిలో రెండు విభాగాలున్నాయి. దక్షిణ క్యాంపస్ లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు మరియు శాస్త్రరంగ డిపార్టుమెంట్లు కలవు. 1962 లో కొత్తగా స్థాపించిన ఉత్తర క్యాంపస్లో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
విశ్వవిద్యాలయానికి విశాఖపట్నం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విజయనగరం జిల్లాల్లో అనుబంధ క్యాంపస్లు కలవు. 1967లో గుంటూరు నగరములో స్థాపించబడిన అనుబంధ క్యాంపస్ 1976లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది.
[మార్చు] ప్రత్యేకతలు
- భారతదేశంలోనే మొదటిసారిగా (1957 లోనే) MBA కోర్సుని అందించిన విశ్వవిద్యాలయం.
- ఫార్మసీ విభాగం ఏర్పాటులో భారతదేశంలో రెండవ స్థానం (మొదట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం).
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |