అశోకుడు
వికీపీడియా నుండి
అశోక చక్రవర్తి (హిందీ: अशोक) (Ashoka); (క్రీ.పూ.304–క్రీ.పూ.232) (రాచరిక ముకుటము: "దేవానాంపియ పియదస్సీ'" అనగా "దేవతల ప్రీతిపాత్రుడు మరియు చూపులకు అందమైనవాడు")
క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు.