Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
తెలుగు - వికిపీడియా

తెలుగు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.

తెలుగు: టి=తేనే వంటిది, ఈ=ఎంతో, ఎల్=లయ , యు=ఉన్నటు వంటిది, జి=గానామ్రుతం కలిగి, యు=ఉయ్యాల ఊగించేది.(రవి వర్మ)


తెలుగు, భారత దేశములోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని పక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, చత్తీస్ గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశములో రెండవ స్థానములోను నిలుస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం సుమారుగా ఏడుకోట్ల ముప్పై లక్షల మంది ఈ భాషను మాట్లాడతారు.

   
తెలుగు
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
   
తెలుగు

శ్రీ కృష్ణదేవ రాయలు

   
తెలుగు
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
   
తెలుగు

శ్రీనాథ మహాకవి

   
తెలుగు
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు
   
తెలుగు
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారము
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారము

విషయ సూచిక

[మార్చు] ఉపోద్ఘాతము

భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు. అనగా తెలుగు హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, బ్రహుయి మొదలగు భాషలతోపాటుగా ద్రవిడ భాషా వర్గమునకు చెందును.

తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాషా, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగా రుజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవ్వటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.

తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా, తేలికగా అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. సంస్కృతము చూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా (aspirated?) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ కోస్తా ప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు.

సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబందములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఇంగ్లీషు పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (Genetic) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడము ఆశ్చర్యకారణము కాదు.


తెలుగువారికి ఇంగ్లీషు అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీ ఇంగ్లీషు నందు మాత్రము కర్త-క్రియ-కర్మ గా వస్తాయి. ఇంగ్లీషు మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి. ఇంకా చాలా తేడాలు ఉన్నాయి, ముఖ్యముగా past perfect Tense విషయములో.

భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటిలోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చులో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతంలోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తనలతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" (Italian of the east) అని పిలుచుకున్నారు. (నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది, కాబట్టి మనము ఇటాలియనును "తెలుగు ఆఫ్ యూరోపు" అని పిలుచుకోవచ్చు!).

తెలుగు (మరియూ ఇతర భారతదేశ బాషలలోని) ఓ ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.

[మార్చు] చరిత్ర

అనేక ఇతర ద్రవిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాణ్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, మొదటి శకం బి.సి లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాశప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ ,గోదావరి మధ్య భూభాగంలో నివాసం ఉండే వారయి ఉంటారని నిర్ణయించ వచ్చు.


ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు, ఆరవ శతాబ్దము ముందటి తెలుగు చరిత్రకు సంబంధించి మనకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు.తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి

ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:

అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

[మార్చు] తెలుగు, తెనుగు, ఆంధ్రము

ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్రీ.పూ. ±700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.


ఆంధ్రులు మాటాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం.


మొత్తానికి క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి.


11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు.


15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.

ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు


శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్ధన. ఇది గంభీరతకొరకు సంస్కృతీకరింపబడిన పదమే ననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు.


మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపుదిద్దుకొన్నాయి.

[మార్చు] భాష స్వరూపము

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ,"పంచదారకన్న పనస తొనలకన్న కమ్మని తేనెకన్న తెలుగు మిన్న"
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ,"పంచదారకన్న పనస తొనలకన్న కమ్మని తేనెకన్న తెలుగు మిన్న"



తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.

అశోకుడి చారిత్రక శకానికి చెందిన బ్రాహ్మి లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించినట్టుగా నమ్ముతున్నారు. తెలుగు యొక్క తూర్పు చాళుక్యుల లిపిని వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.


తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు "హల్లులు" ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు "అ" ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరాబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి.


ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.


తెలుగును సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు, ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.


అం అః
/a/ /ɑː/ /ɪ/ /iː/ /u/ /uː/ /ru/ /ruː/ /lu/ /luː/ /e/ /eː/ /ai/ /o/ /oː/ /au/ /am/ /aha/


[మార్చు] గ్రాంధిక వ్యావహారిక భాషా వాదాలు

నన్నయకు పూర్వమునుండి గ్రాంధిక భాష మరియు వ్యవహారిక భాష దేనికై అది స్వతంత్ర్యముగా పరిణామము చెందుతూ వచ్చాయి కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంధికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంధిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

[మార్చు] మాండలికాలు

బెరడ, దాసరి, దొమ్మర, గొలరి, కమతి, కోమటి, కొండ రెడ్డి, సాలేస్వరి, తెలంగాణా, తెలుగు, వడగ, వడరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, రాయల సీమ, నెల్లూరు, గుంటూరు, సాలెం, కోయంబత్తూరు, మద్రాసు, మరియూ విరుధునగరం, టుటికోరిను, మధురయి, తంజావూరు,

[మార్చు] లిపి

ప్రధాన వ్యాసము: తెలుగు లిపి

[మార్చు] లిపి పరిణామము

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి.

తెలుగు లిపి పరిణామము
తెలుగు లిపి పరిణామము
మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా
మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా


[మార్చు] ప్రస్తుత లిపి

అచ్చులు (16)
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ
ప్రాణ్యక్షరములు (2)
అం అః
ఉభయాక్షరములు (3)
ం ఁ ః
హల్లులు (38)
క ఖ గ ఘ ఙ
చ ౘ ఛ జ ౙ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ఱ ల ళ వ
శ ష స హ క్ష
అంకెలు(10)
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౦

[మార్చు] తెలుగుభాష విస్తరణ

[మార్చు] ఆంధ్రప్రదేశ్ లో

[మార్చు] భారతదేశంలో

[మార్చు] ప్రపంచంలో

Deshabhasahalandu Telugu lessa. Tenela tetala Telugu.

[మార్చు] తెలుగు సాహిత్యం

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.

[మార్చు] క్రీ.శ. 1020 వరకు - నన్నయకు ముందు కాలం

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి కాని అని బహుశా గ్రంధస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.

[మార్చు] 1020-1400 - పురాణ యుగము

దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు.వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.


నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణఅలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

[మార్చు] 1400-1510 -మధ్య యుగము (శ్రీనాధుని యుగము )

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కధాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాధుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని "శృంగార నైషధం," పోతన "భాగవతం", జక్కన "విక్రమార్క చరిత్ర", తాళ్ళపాక తిమ్మక్క "సుభద్రా కల్యాణం", మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.


ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం.

[మార్చు] 1510-1600 - ప్రబంధ యుగము

విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన "ఆముక్తమాల్యద" తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.

[మార్చు] 1600-1820 - దాక్షిణాత్య యుగము

కర్నాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, మరియు క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.

[మార్చు] 1820 తరువాత - ఆధునిక యుగము

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లో సాధ్యమయ్యింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.


మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగంగారి "రాజశేఖరచరిత్రము" తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావుగారు. గిడుగు రామ్మూర్తి వారి "ముత్యాల సరాలు", కట్టమంచి రామలింగారెడ్డిగారి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకులు) "ముసలమ్మ మరణం", రాయప్రోలు సుబ్బారావుగారి "తృణకంకణం" మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం "వ్యావహారిక భాషా వాదా"నికి దారితీసింది.

[మార్చు] మారుతున్న సాహిత్యం

[మార్చు] కంప్యూటర్లో తెలుగుభాష

[మార్చు] తెలుగు యూనీకోడు

తెలుగు నకు ఈ క్రింది యూనీకోడు బ్లాకు ఇవ్వబడినది 0C00-0C7F (3072-3199).

0 1 2 3 4 5 6 7 8 9 A B C D E F
C00 -- -- -- am,అం aha,అః a, అ A, ఆ i, ఇ I, ఈ u, ఉ U, ఊ R, ఋ -- -- e, ఎ E, ఏ
C10 ai, ఐ -- o, ఒ O, ఓ ou, ఔ ka, క kha, ఖ ga, గ gha, ఘ gna, ఙ ca, చ cha, ఛ ja, జ jha, ఝ iNi,ఞ Ta, ట
C20 Tha, ఠ Da, డ Dha, ఢ Na, ణ ta, త tha, థ da, ద dha, ధ na, న -- pa, ప pha, ఫ ba, బ bha, భ ma, మ ya, య
C30 ra, ర ~Ra, ఱ la, ల La, ళ -- va, వ Sa, శ sha, ష sa, స ha, హ ksha, క్ష -- -- -- -- --


[మార్చు] ఇవి కూడా చూడండి

  1. తెలుగు సాహిత్యము
  2. సామెతలు
  3. జాతీయములు
  4. ఛందస్సు
  5. పొడుపు కధలు
  6. మా తెలుగు తల్లికి మల్లె పూదండ
  7. తెలుగు లిపి

[మార్చు] తెలుగుభాష ఎదుర్కొంటున్న సవాళ్ళు


(చర్చించండి - ఈ విభాగంలోని విషయాలు కొంతవరకు అభిప్రాయాలుగా పరిగణింపవచ్చును. దీనిని గురించి చర్చా పేజీలో వ్రాయండి. ఎక్కువగా సభ్యుల ఆమోదం పొందినట్లయితే వాటిని సార్వజనీనకంగా పరిగణింపవచ్చును)


తెలుగుభాష, తెలుగు సాహిత్యం ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నది.ఆర్ధికంగా తెలుగుజాతి గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న సమయంలో తెలుగుభాష ప్రాచుర్యం క్షీణించడం ఆందోళన కలిగించే సమస్య. ముఖ్యంగా స్థితిగతులు కలిగి, విద్యావంతులైన వర్గాలలో తెలుగుభాష వినియోగం బలహీనమవుతున్నది. ఇంగ్లీషు చదువుల వ్యామోహంలో పట్టభద్రులైన వారికి తెలుగు వచ్చీరాని పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. భాష ఉపయోగమే అంతంత మాత్రంగా ఉన్నపుడు ఇక సాహిత్యానికి ఆదరణ ఎలా ఉంటుంది?

[మార్చు] క్షీణతకు ప్రధానమైన కారణాలు

  • తెలుగు నేర్చుకోవడం వల్ల బ్రతుకుతెరువుకు ఏమీ లాభంలేదన్నస్థితి. తెలుగు రాకపోవడం వల్ల ఏమీ ఇబ్బంది లేదన్న పరిస్థితి.
  • అధికారభాషగా ఏమీ ప్రగతి సాధించలేక పోవడం
  • కొరవడిన మాతృభాషాభిమానం. ఇక తెలుగువారికి పరభాషాభిమానం ఎప్పుడూ ఉన్నదే
  • భాషలకు కంప్యూటరులు ప్రధానసాధనాలుగా మారుతున్నాయి. కంప్యూటరుపై వాడకంలో భారతీయభాషలన్నీ చాలా వెనుకబడి ఉన్నాయి.
  • రాజకీయాలలో కులాలకు, వృత్తులకు, మతాలకు ఉన్నంత ప్రభావంలో ఇసుమంతయినా భాషకు లేదు. భాషాభిమానంతో ఇంతవరకు ఏ తెలుగు రాజకీయనాయకులూ ఎదగలేదు. నందమూరి తారక రామారావు తప్ప.


[మార్చు] ఆశాజనకమైన విషయాలు

అలాగని పరిస్థితి పూర్తిగా చేజారలేదు. తెలుగును నిలిపే పట్టుగొమ్మలలో కొన్ని.

  • తెలుగు మాటలాడేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉండబట్టి కొన్ని ఒడిదుడుకులున్నా తట్టుకొనే శక్తి భాషకు లభిస్తున్నది
  • నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి వచ్చిన తరువాత తెలుగు భాషకూ, తెలుగు జాతికీ భారతస్థాయిలో అంతకు ముందెన్నడూ లేని బలం కూడింది.
  • తెలుగు భాష బాగా పరిణతి చెందినదవడం వల్ల, అన్ని మాధ్యమాలకూ అనుగుణంగా మార్చుకొనే శక్తి కలిగి ఉన్నది.
  • ముందుగా సినిమాలు, తరువాత టీవీ ఛానళ్ళు తెలుగు భాష వినియోగానికి ఊపిరి పోస్తున్నాయి. ప్రభుత్వం చేయలేని ఘనకార్యాలను ఇవి సాధించాయి. విరవిగా విస్తరించిన సినిమా వెబ్ సైటులు ఇందుకు ఉదాహరణ.
  • కంప్యూటరులో తెలుగు వినియోగం ఆరోగ్యకరంగా పెరుగుతున్నది. అందుకు అనుగుణమైన సాధనాలూ వెలుగు చూస్తున్నాయి.
  • భాషాభిమానం మరీ అంత తక్కువ కాదు - అనిపిస్తున్నది. మనకు గర్వకారణంగా ఎదుగుతున్న తెలుగు వికీపీడియా ఇందుకు ఒక తార్కాణం.


[మార్చు] చేయవలసిన పనులు

  • పాఠశాలల్లో తెలుగు భాష బోధనా ప్రమాణాలు పెంచాలి. అంటే మరింత క్లిష్టం చేయడం కాదు. ఆసక్తిని పెంచాలి.
  • ఆచార వ్యవహారాలలోనూ, అధికారిక వ్యవహారాలలోనూ తెలుగు వాడుక పెంచాలి
  • భాషపై ఆదరణ పెంచడానికి వాణిజ్య ధోరణి అవలంబింపక తప్పేలా లేదు. భాషను ప్రాచుర్యం చేయడానికి పోటీలు, గేమ్‌షోలు, క్విజ్‌లు పెట్ట వచ్చును.

[మార్చు] మీకు తెలుసా?

[మార్చు] తెలుగు తొలిప్రొద్దు వెలుగులు

  • శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు
  • తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది
  • తొలి తెలుగు కవి - నన్నయ
  • తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం
  • తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము
  • తొలి తెలుగు ప్రబంధము -మనుచరిత్రము
  • తొలి తెలుగు నవలిక - రాజశేఖర చరిత్రము
  • తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క
  • తొలి తెలుగు వ్యాకరణము - ఆంధ్రభాషాభూషణము
  • తొలి తెలుగు గణిత గ్రంధము -గణితసార సంగ్రహము
  • తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము
  • తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము
  • తొలి తెలుగు నాటకము - మంజరీ మధుకీయము
  • తొలి తెలుగు శృంగారకవయిత్రి - ముద్దుపళని
  • తొలి తెలుగు కధానిక - దిద్దుబాటు
  • తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము
  • తొలి తెలుగు రామాయణము - రంగనాధ రామాయణము
  • తొలి తెలుగు ద్వ్యర్ధికావ్యము - రాఘవ పాండవీయము
  • తొలి తెలుగు జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన
  • తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
  • తొలి తెలుగు ఉదాహరణకావ్యము - బసవోదాహరణము
  • తొలి తెలుగు పత్రిక - సత్యదూత
  • తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము
  • తొలి తెలుగు సాంఘిక నాటకము - నందకరాజ్యం
  • తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
  • తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన
  • తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ
  • తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము
  • తొలి తెలుగు ధర్మశాస్త్రము - విజ్ఙానేశ్వరీయము
  • తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంధము - సకల నీతి సమ్మతము
  • తొలి తెలుగు వ్యావహారిక నాటకము - కన్యాశుల్కం
  • తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర

[మార్చు] తెలుగు గురించి ఇతరభాషలవారేమన్నారు?

తెలుగుభాషను గురించి తెలుగేతరులు చెప్పిన ప్రశంసావాక్యాలు

  • ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ
ప్రాభాకర పరిశ్రమః
తత్రాపి యాజుషీశాఖా
నాల్పస్య తపసఃఫలం"
-(అప్పయ్యదీక్షితులు)
ఆంధ్రత్వమూ,ఆంధ్ర భాష, భట్టప్రభాకరుని పాండిత్యము, అందులో యాజుషీశాఖాలో పుట్టడము తఫఃఫలము. ఇదియే దీక్షితులవారి చరమవాంఛ.
  • సింధు నదియిన్ మిశై నిల విని లే
చేర నన్నాట్టిళం పెన్ గళుడనే
సుందర తెలుంగు నిఱ్ పాట్టి శైత్తు
త్తోణిగ ళోట్టి విళైయాడి వరువోం.
-(సుబ్రహ్మణ్య భారతి-భారతదేశం)
పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడ్దుతూ, సింధు నదిని పడవ నడుపుదాం.
  • “The Telugus are a people quite as highly civilized as any in Europe, occassionally their mode of speech resembles those of Italy.” (C.P.Brown: A Grammar of Telugu Language, P165 [1857])
తెలుగువారు ఐరోపాఖండ వాసులవలె నాగరికులు. వారిభాష చాలమట్టుకు ఇటలీదేశపు భాషను పోలి ఉంటుంది.
  • Among these five languages, (Trilinga, Karnatic, Tamil, Malayalam and Singalese) the Trilinga appears to be the most polished and though confessedly a difficult language. It must be numbered with those which are most worthy of cultivation, its variety of inflection being such as to give it a capacity of expressing ideas, with a high degree of facility, justness and elegance. (William Carey, Grammar of Telinga Language, 1814, Serampore, Calcutta)
త్రిలింగ, కర్నాటక, తమిళ, మళయాళ, సింహళా భాషలలో తెనుగు కష్టమైన భాష అని అంగీకరించినప్పటికి అది సంస్కారయుతమైన భాష. నేర్చుకోదగిన భాషల్లో ఒకటి, రూపభేదంవల్ల భావాలను, సొంపుగా సౌలభ్యంతో చక్కగా వ్యక్తం ఛేయవచ్చు.
  • Few languages will be found more copious, more sonorous or more regular in constructions and it may boast, in a peculiar manner of great elegance of expression and melody of sound. (A.D.Campbell. Teloogoo Grammar. [1816])
ఏవో కొన్ని భాషలు తప్ప, శబ్దసంపదలోను, శబ్దసౌష్ఠవంలోను, భావవ్యక్తీకరణంలోను, శ్రావ్యతలోను తెలుగుతో తక్కినవి సాటిరావు.
  • By reason of its musical flow Telugu has been called the Italian of the East.It deserves to be equally styled the English of the East on the ground that its vocabulary has been copiously recruited from the classical languages with which it came into contact as it passed through the process of development. So much has this been the case, that one would not be far wrong in holding that Sanskrit had lived after ceasing to be a spoken language by entering into Telugu and other vernacular languages so large and that barring HINDI, Telugu is the best specimen of Sanskrit simplified and popularised. (A.D.Campbell, ‘Introduction to Telugu Grammar’, 3rd Edn. Hindu Press, 1849. 1st Edn.1816)
వీనులవిందుగా ఉండబట్టి తెనుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అన్నారు.తెలుగు భాష అభివృద్ధి అవుతున్నకొద్ది తనకు దగ్గరగా వచ్చే చాలా శబ్దజాలాన్ని ఆయా ప్రాచీన కావ్యభాషల నుంచి గ్రహించింది, కాబట్టి, "ఇంగ్లీష్ ఆఫ్ ది ఈస్ట్" అనవచ్చు. దేశభాషల్లో సంస్కృతం ప్రవేశించిన తరువాత సంస్కృతం వ్యావహారిక భాషగా రాలేదు.హిందీ తప్పిస్తే సరళ సంస్కృతానికి,సులభ సంస్కృతానికి తెనుగుభాష ఒక ఉదాహరణ.
  • Gentoo is the language of this part of the country and one of the prettiest of all the dialects. (Letter from Madras, 1837. A Glossary of Anglo-Indian Colloquial words and phrases. Yule and Burnell, London 1886.Pp280..281, 2nd Edn. P.369[1968])
ఈ ప్రదేశంలోని భాష జెంటూ, అన్ని ప్రాంతీయ భాషలకంటె మధురమైంది.(తెలుగును బుదతకీచులు 'జెంటూ ' అందురు.)
  • In respect of antiquity of culture and glossorial copiousness, Telugu is generally considered as ranking next to Tamil in the list of Dravidian idioms, whilst in euphonic sweetness it justly claims to occupy the first place. (Rev.Robert Caldwell. Comparative Grammar of Dravidian Languages.P.25.Madras! 956[1857])
ద్రావిడ భాషల్లో ప్రాచీనతకు, భాషాసంపదకు, తెలుగు, తమిళభాష తరువాత, చెప్పుకోదగ్గది.భాషామాదుర్యంలో తెలుగు తర్వాతివే అన్ని భాషలు.
  • The Telugu people inhabiting the Northern Circars and the Nizam territory are also remarkable for their industry and their soft language, abounding in vowels, is the Italian of the East. (Modern India and Indians. Monier Williams, 1878.1st Edn. First Indian Reprint1971 p.189.)
ఉత్తర సర్కారులలోని, నైజాం రాజ్యం లోని తెలుగువారు కష్టపడి పనిచేస్తారు. వాళ్ళ భాషలో అచ్చులు ఎక్కువగా ఉండడంచేత దీనికి 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ' అన్న పేరు వచ్చింది.
  • Telugu is singularly melodius. It is the sweetest and most musical of all the Dravidian tongues, and it sounds harmonius even on the lips of the most illiterate. It has justly been called the ‘Italian of the East’. (Henry Morris, Simplified Telugu Grammar, London 1890. P.I.2)
తెనుగు వీనులకు విందైనది..ద్రావిడ భాష లన్నిటిలోను మధురాతిమధురమైంది.నిరక్షరకుక్షి మాట్లాడినా శ్రవణానందకరంగా ఉంటుంది.'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ' అని అనడం సత్యసమ్మతంగా ఉంది.
  • TELOOGOO is the softest of all the Eastern Languages. (Manual of Administration, Madras. Vol.III. [1893])
ప్రాచ్య భాష లన్నింటిలో తెలుగు సున్నితమైన భాష.
  • As a vernacular this (Telugu) is more widely spread and has a greater number of speakers even than Tamil. (Linguistic Survey of India. P. 91. [1906])
దేశభాషగా తెలుగు విశాలంగా వ్యాపించింది.తమిళంకంటె తెలుగు మాట్లాడేవారి సంఖ్యే యెక్కువ.
  • The Telugu or Telinga Language ranks next to Tamil among the Dravidian Languages in respect of culture and copiousness of vocabulary and exceeds it in euphony. Every word ends in a vowel and it hs been called the ‘Italian of the East’. (Gg.A.Grierson. Linguistic Survey of India. Vol.I.p92 Reprint.1967 [1906])
శబ్దసంపదలోను, సంస్కృతిలోను తెనుగు, ద్రావిడ భాషల్లో తమిళం తర్వాతిదే అయినా, శ్రావ్యతలో దానికంటె మించినది. ఫ్రతిపదం అజంతం. అందుకనే 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ' అని అంటారు.
  • Telugu is poorer in classical literature than its sister language, Tamil. But it certainly bears the form for its exquisite grace and melody. On account of its sweetness of sound it is aptly called the ‘Italian of the East’. (A Manual of Telugu Grammar and phonetics. P. 7. 1918)
కావ్యభాషా సంపదలో తన తోబుట్టువైన తమిళంతో తీసిపోయినా, మనోహరమైన నడకకి, శ్రావ్యతకి తెలుగు పైచేయి. తీయనైన ఆ భాషా మాధుర్యాన్ని బట్టి తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ' అన్నారు.
  • Telugu can be looked upon as the northern most member of the southern languages or the southernmost member of the Northern Languages; and it has the advantages of both groups with few, if any, of the defects.It is adaptable, dynamic, absorbitive, grammatically simple and euphonically exceptionally beautiful even when using foreign words. It has never suffered from narrow provinsiolism. (G. Homefield Mc. Leod. In his letter to the editor; The Hindu dated 16th july, 1958.)
తెలుగు-ద్రావిడ భాషా కుటుంబంలో ఉత్తరాది భాష, ఆర్యభాషా కుటుంబంలో దక్షణాది భాష.రెండింటిలోని లక్షణాలు కొద్దిగా లేకపోలేదు- ఏవోకొలది అవలక్షణాలతో పాటు తెనుగు పొందిక కలది. శక్తివంతమైనది. ఇతరభాషలను తేలికగా తనలో కలుపుకోగలదు.వ్యాకరణ సౌలభ్యం కలది. సహజంగా శ్రవణానందంగా ఉంటుంది-అన్యదేశ భాషాపదాలు ఉపయోగించినా. తెనుగు ఔదార్యంతో అన్ని భాషలను స్వీకరిస్తుంది. దానికి సంకుచితత్వం లేదు.
  • You can not keep out foreign words as you keep out foreign manufactured goods. Perhaps Telugu accepts them more easily thn any other Indian language and this certainly helps to make it a rival to Hindi in teaching Science, Medicine and Engineering. (J.B.S.Haldane…’The Hindu’ dated 27.4.1958.)
విదేశ వస్తువులను బహిష్కరించినట్లు అన్యదేశ్య పదాలను బహిష్కరించలేం. భారతీయ భాషలన్నిటిలోను అన్యదేశ భాషా పదాలను తెలుగు గ్రహించినంత సులభంగా ఏ భాషా స్వీకరించలేదు. కాబట్టి ఎన్నటికైనా విజ్ఙానశాస్త్రం, వైద్యం, ఇంజినీరింగ్ మొదలయిన వాటి బోధనలో హిందీకి తెలుగు ప్రతిస్పర్థి కాగలదు.
  • The pronunciation of Samskrit among the Teloogoos corresponds with the purest pronunciation at Benaras(Varanasi). (Madras Manual of Administration, Madras. Vol III. 1893.)
తెలుగువారి సంస్కృతోచ్చారణ కాశీవాసుల స్వచ్ఛమైన ఉచ్చారణతో సమానంగా ఉంటుంది.

('ఆంధ్ర సదుక్తి కర్ణామృతం' నుండి.కూర్పరులు: యన్.యన్ సుందరేశ్వర రావు & నే.శ్రీ కృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 1975)

[మార్చు] అవధానం - తెలుగు సాహిత్యానికి ప్రత్యేకం

  • అవధానం అనేది తెలుగు సాహిత్యానికి ప్రత్యేకమైన ప్రక్రియ - అవధానుల భాషాపటిమ, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం అద్భుతమైనవి. అవధానాలలో కొన్ని రకాలు
    • అష్టావధానం
    • శతావధానం
    • సహస్రావధానం

[మార్చు] వనరులు

[మార్చు] బయటి లంకెలు

[మార్చు] తెలుగు సాహిత్యము

తెలుగు బ్లాగర్లు | తెనుగు.ఆర్గు | ఆంధ్రభారతి | సి.పి. బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవ) | తెలుగు సాహిత్యము, పిల్లల కధలు, సంసృతి, ఆచార వ్యవహారాలు | తెలుగు బాష మరియు సాహిత్యము | ఈమాట | విదేశాలలో తెలుగు | తెల్మ్నున్ భాష, తెలుగు | కావ్యనందనం | ఛందస్సు | వేపచేదు | ఇన్ఫోవాణి

[మార్చు] పత్రికలు

[మార్చు] ఆన్ లైన్ దినపత్రికలు

ఆంధ్రజ్యోతి | ఈ వార్త | ఈనాడు | వార్త | ఆంధ్రభూమి | ఆంధ్రప్రభ | ప్రజాశక్తి | వెబ్ ప్రపంచం | మ్యాక్స్ పేజెస్(MaxPages) | తెలుగు ఒన్ (http://www.telugupeople.com) also www.thatstelugu.com

[మార్చు] వార/పక్ష/మాస/త్రైమాసిక పత్రికలు

భక్తి | రచన | ఏ.పి.వీక్లీ | నవత | విపుల | సరసం | హాస్యం | ఈవారం | [http://www.telugutoranam.com/ తెలుగు తోరణం)

[మార్చు] తెలుగు సాఫ్ట్ వేర్

[మార్చు] నిఘంటువులు

[మార్చు] వర్గీకరించనవి

తెలుగు కధలు | వెబ్ ప్రపంచం | ఈమాట గ్రంధాలయం | తెలుగు MSN | దట్స్ తెలుగు | తెలుగు జర్నల్ | తెలుగు వెబ్ సైటు | తెలుగు కార్టూన్లు | తెలుగు పత్రిక | తెలుగు పదం | తెలుగు ప్రజలు | మన తెలుగు | తెలుగు వాణి | న్యూఆంధ్ర | అంధ్రప్రదేశ్ పటములు | అంధ్ర భారతి | జోకర్ | ప్రముఖాంధ్ర | నిహార్ ఆన్ లైన్ | వేప చేదు విద్యాపీఠము | కబుర్లు | అమ్మ వంటలు | పదబంధాలు | తెలుగు వెబ్‌సైట్ల కొలువు | తెలుగుకు ఎథ్నోలోగ్ నివేదిక | తెలుగు భాషా వనరులు | ఉపయోగపడే కొన్ని తెలుగు మాటలు | అమెరికాలో తెలుగు సంస్థలు | | గత సహస్రాబ్దిలో రచయిత్రులు |

[మార్చు] పుస్తక గుర్తులు

[మార్చు] తెలుగు వ్యక్తుల వెబ్ పేజీలు

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com