Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
రాయప్రోలు సుబ్బారావు - వికిపీడియా

రాయప్రోలు సుబ్బారావు

వికీపీడియా నుండి

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.


కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత.18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.

అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి.


ఈయన రచనలు ప్రధానంగా ఖండ కావ్యాలు

  • తృణకంకణము
  • ఆంధ్రావళి
  • కష్టకమల
  • రమ్యలోకము
  • వనమాల
  • మిశ్రమంజరి
  • స్నేహలతా దేవి
  • స్వప్నకుమారము
  • తెలుగు తోట
  • మాధురీ దర్శనం

అనువాదాలు

  • అనుమతి
  • భజగోవిందము
  • సౌందర్య లహరి
  • దూతమత్తేభము
  • లలిత
  • మధుకలశము
  • వంటి లఘు కావ్యాలెన్నో రచించాడు.

రాయప్రోలు కవితల నుండి ఉదాహరణలు:

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము


శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యం బందె నిచ్చట


అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు
ఓరుగల్లున రాజ వీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు
ఆంధ్ర సంతతి కే మహితాభిమాన
దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె
నా మహాదేశ మర్థించి యాంధ్రులార
చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు


తృణ కంకణమునుండి:

అడుగుల బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్
మడుగులు గట్ట, మండు కనుమాలపుటెండ పడంతియోర్తు జా
ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా
ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటలకున్
నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళకింద
పుస్తకపు పేటికలను, నా హస్తముదిత
చిత్రసూత్రమునను వసియించియున్న
దోయి!యిందాక మన ప్రేమయును సఖుండ!

[మార్చు] రాయప్రోలు వారి తృణకంకణమునకు కట్టమంచి రామలింగారెడ్డి వ్రాసిన సందేశము:

MAHARAJA'S COLLEGE, Mysore. 26th May 1916.


Though I have not known Mr. Rayaprolu Subbarao personally, I have been in touch with him by correspondence, common friends, and above all, his own splendid writings in prose and verse. He holds a high rank amongst modern Telugu Poets, and I think he is almost entitled to be acclaimed as the founder of a new school of poetry which is bound to mark a new epoch in the development of the Andhra literature. His imaginative gifts are of a high order and his power of phrase is remarkable, almost unique. He will bring name and fame to any institution with which he may be connected. And I, therefore, confidently recommend him as a man of genius who has every title to the admiration and encouragement of the Telugu people.


[Signed] C.R.REDDY, M.A.(Cantab)- Principal, Maharaja's College,Mysore.


[మార్చు] వనరులు

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com