Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
తుర్కమేనిస్తాన్ - వికిపీడియా

తుర్కమేనిస్తాన్

వికీపీడియా నుండి

Türkmenistan Jumhuriyäti
Flag of {{{the}}} తుర్కమేనిస్తాన్ Emblem of {{{the}}} తుర్కమేనిస్తాన్
(జండా) (చిహ్నం)
ప్రమాణం:
జాతీయ గీతం: స్వంతంత్ర, నిష్పాక్షిక, తుర్కమేనిస్తాన్ జాతీయగీతము
Location of తుర్కమేనిస్తాన్
రాజధాని అష్గబత్
37°58′N″58, 20°E′type:city″{{{8}}}
పెద్ద నగరము అష్గబత్
అధికార భాషలు తుర్క్‌మెన్
ప్రభుత్వము
అధ్యక్షుడు/ఛైర్మెన్1
ఏక పార్టీ పాలన
సపర్మురత్ నియజోవ్
స్వాతంత్యము
ప్రకటన
గుర్తింపు
సోవియట్ సమాఖ్య నుండి
అక్టోబర్ 27, 1991
డిసెంబర్ 8, 1991
వైశాల్యము
 • మొత్తం
 • నీరు(%)
 
488,100 km² (52వది)
4.9%
జనాభా
 • 2005 అంచనా
 • [[As of |]] గణన
 • జన సాంద్రత
 
4,833,000 (113వది2)

10/km² (173వది)
జి.డి.పి (పి.పి.పి)
 • మొత్తం
 • తలసరి
2005 అంచనా
$29.38 బిలియన్ (94th)
$5,900 (92వది)
కరెన్సీ తుర్క్‌మెన్ మనత్ (TMM)
కాల మానము
 • వేసవి (DST)
(UTC+5)
(UTC+6)
ఇంటర్నెట్ TLD .tm
ఫోను కోడ్ +993
1.) నియజోవ్ అధ్యక్షుడుగా మరియు మంత్రివర్గానికి నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు.
2.) 2005 గణాంకాల పై ఆధారిత ర్యాంకు

తుర్కమేనిస్తాన్, మధ్య ఆసియా లో ఒకప్పుడు తుర్క్‌మెన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా పిలవబడిన దేశము. దీనికి సరిహద్దులుగా ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఖజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు మరియు తూర్పున కాస్పియన్ సముద్రము కలవు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

తుర్కమేనిస్తాన్ ప్రాంతము అనాదిగా జనవాసములు కలిగిన ప్రాంతము. అనేక సామ్రాజ్యాల సైన్యాలు పుష్కలమైన ప్రదేశాలకు వెళుతూ మార్గమధ్యములో ఇక్కడ తిష్ట వేశాయి.

క్రీ.పూ. 4వ శతాబ్దములో అలెగ్జాండర్ ఇండియా వెళ్లే మార్గములో తుర్కమేనిస్తాన్ ను జయించాడు. ఆ తరువాత నూటా యాభై సంవత్సరాలకు ప్రస్తుత రాజధాని అష్గబత్ పరిసర ప్రాంతములోనున్న నిసా రాజధానిగా పార్థియన్ సామ్రాజ్యము స్థాపించబడినది. 7వ శతాబ్దములో అరబ్బులు ఈ ప్రాంతాన్ని జయించి ఇస్లాం మతాన్ని వ్యాపించజేశారు. దీనితో తుర్క్‌మెన్ మధ్య ప్రాచ్య సంస్కృతిలో భాగమైనారు. ఇదే సమయములో ఆసియా మరియు ఐరోపాల మధ్య అతిపెద్ద వాణిజ్య మార్గముగా ప్రఖ్యాత సిల్క్ రోడ్ అభివృద్ధి చెందినది.

ఖలీఫా అల్-మమూన్ తన రాజధాని మెర్వ్ కు తరలించినప్పుడు అనతి కాలములోనే తుర్కమేనిస్తాన్ ప్రాంతము గ్రేటర్ ఖొరసాన్ యొక్క రాజధానిగా ప్రసిద్ధి చెందినది.

11వ శతాబ్దము మధ్య కాలములో, సెల్ద్‌జుక్ సామ్రాజ్యమునకు చెందిన శక్తివంతమైన తుర్కలు ఆఫ్ఘనిస్తాన్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి తమ శక్తిని తుర్కమేనిస్తాన్ ప్రాంతములో కేంద్రీకరించారు. అయితే 12వ శతాబ్దపు రెండవ అర్ధ భాగములో ఆ సామ్రాజ్యము విచ్చిన్నమై తుర్క్‌మెన్ తమ స్వాతంత్ర్యము కోల్పోయారు. చెంఘీజ్ ఖాన్ తన పశ్చిమ దండయాత్రలో భాగముగా కాస్పియన్ సముద్రము యొక్క తూర్పు తీర ప్రాంతాన్ని తన ఆధినములోకి తెచ్చుకొన్నాడు. తర్వాత యేడు శతాబ్దాల పాటు తుర్క్‌మెన్ ప్రజలు అనేక సామ్రాజ్యాల పాలనలో తరచూ అంతర్-తెగల యుద్ధాలతో జీవించారు.

తుర్కమేనిస్తాన్ పర్షియా నుండి వేర్పడి 1865 నుండి 1885 వరకు రష్యా లో కలపబడినది. 1894 వరకు తుర్కమేనిస్తాన్ పూర్తిగా రష్యన్ సామ్రాజ్యము యొక్క ఆధీనములోకి వచ్చింది. 1917 లో జరిగిన రష్యన్ విప్లవము మరియు దాని తరువాత నెలకొన్న రాజకీయ ఉన్రెస్త్ 1924లో తుర్కమేనిస్తాన్ ను సోవియట్ సమాఖ్య యొక్క 15వ రిపబ్లిక్‌గా ప్రకటించడానికి దారితీసినది. అప్పుడే ఆధునిక సరిహద్దులతో ప్రస్తుత రూపములోని తుర్కమేనిస్తాన్ అవతరించినది.

1991 లో సోవియట్ సమాఖ్య విఛ్ఛిన్నము కావడముతో తుర్కమేనిస్తాన్ కు స్వాతంత్ర్యము వచ్చినది. స్వాతంత్ర్యము తర్వాత కూడా సోవియట్ కాలపు కమ్యూనిష్టు నేత, సపర్మురత్ నియజోవ్ అధికారములో కొనసాగాడు.

[మార్చు] రాజకీయాలు

పూర్వపు సోవియట్ సమాఖ్య యొక్క కమ్యూనిష్టు పార్టీలో బ్యూరోక్రాట్ అయిన సపర్మురత్ నియజోవ్, జీవితకాల అధ్యక్షునిగా తుర్కమేనిస్తాన్ యొక్క సర్వాధికారాలు తన గుప్పెట పెట్టుకొన్నాడు. ఈయన వ్యతిరేకతను సహించడు. అధ్యక్షుడు నియజోవ్ తుర్క్‌మెన్‌బాషీ (సమస్త తుర్క్‌మెన్ల యొక్క నాయకుడు) గా వ్యక్తి పూజ సర్వవ్యాపితమై ఉన్నది. ఈయన ముఖచిత్రము తుర్కమేనిస్తాన్ లో కరెన్సీ నోట్ల నుండి వోడ్కా సీసాల వరకు అన్నింటిమీద కనిపిస్తుంది. తుర్క్‌మెన్ జాతీయ టెలివిజన్ యొక్క చిహ్నము కూడా ఈయన చిత్రమే. నియజోవ్ రాసిన రెండు పుస్తకాలు పాఠశాలలో, మోటరుక్లబ్బుల్లో మరియు ఇళ్లల్లో తప్పనిసరిగా చదవలసినవిగా ఆజ్ఞ జారీ చేశారు. ఈయన పేరుపెట్టలేని సంస్థలకు ఈయన తల్లి పేరు పెట్టారు. అన్ని గోడ మరియు చేతి గడియారాలలో డయల్ మీద నియజోవ్ ముఖచిత్రము ముద్రించబడినది. రాజధాని నగరములో తానే స్వయంగా రూపొందించిన 15 మీటర్ల ఎత్తైన నియజోవ్ విగ్రహము తిరిగే మడపముపై ప్రతిష్టించారు. ఇది అన్నివేళలా సూర్యుని ఎదురుగా ఉండి నగరముపై కాంతి విరజిమ్ముతూ ఉంటుంది. అయితే నిజజీవితములో నియజోవ్ అంత పొడుగు మనిషేమీ కాదు. కేవలము ఐదడుగుల ఎత్తే.

తుర్క్‌మెన్లలో బాగా ప్రాచుర్యము పొందిన నినాదము హల్క్! వతన్! తుర్క్‌మెన్‌బాషి (ప్రజలు! మాత్రుభూమి! నాయకుడు!) నియజోవ్ వారములో రోజుల పేర్లను మార్చి తన కుటుంబసభ్యుల పేర్లు పెట్టాడు. సరికొత్త తుర్క్‌మెన్ జాతీయ గీతాన్ని, ప్రతిజ్ఞను స్వయంగా రాశాడు. అందులో మాతృభూమి ని, తుర్క్‌మెన్‌బాషీని తులనాడిన వారి చేతులు తీసెయ్యాలని కుడా ఉంది.

తుర్కమేనిస్తాన్ యొక్క విస్తార సహజ వాయువు నిల్వలను చేజిక్కించుకోవాలనుకుంటున్న విదేశీ కంపెనీలకు ఈ నిల్వలు నియజోవ్ ఆధీనములో ఉండటము వలన ఆయనతో సహకరించక తప్పట్లేదు. ఇదే కారణముచేత ఈయన రాసిన "రుహనామా" పుస్తకము విదేశీ పారిశ్రామికవేత్తలచే క్రొయేషియన్, పోలిష్, హంగేరియన్ మరియు బంటూ మొదలైన ప్రపంచములోని ముఖ్య భాషలన్నింటిలో ప్రచురించబడింది.

[మార్చు] ప్రాంతాలు

తుర్కమేనిస్తాన్ 5 ప్రాంతాలు లేదా వెలాయత్లర్ (ఏకవచనము - వెలాయత్) మరియు ఒక స్వతంత్ర నగరముగా విభజించబడినది.

ప్రాంతము ISO 3166-2 రాజధాని విస్తీర్ణము (చ.కి.మీ) విస్తీర్ణము (చ.మఈ) జనాభా (1995) పటసూచిక
అష్గబత్ అష్గబత్ 604,000
అహాల్ ప్రాంతము TM-A అష్గబత్ 95,000 36,680 722,800 1
బాల్కన్ ప్రాంతము TM-B బాల్కనబత్  138,000 53,280 424,700 2
దషోవుజ్ ప్రాంతము TM-D దషొగుజ్ 74,000 28,570 1,059,800 3
లెబాప్ ప్రాంతము TM-L తుర్క్‌మెనబత్ 94,000  36,290 1,034,700 4
మేరీ ప్రాంతము TM-M మేరీ 87,000 33,590. 1,146,800 5

[మార్చు] భౌగోళికము

తుర్కమేనిస్తాన్ పటము
తుర్కమేనిస్తాన్ పటము

తుర్కమేనిస్తాన్ విస్తీర్ణము దాదాపు 488,100 చ.కి.మీలు. దేశము యొక్క 90% విస్తీర్ణంలో కారాకుం ఎడారి వ్యాపించిఉన్నది. మధ్య భాగమును తురాన్ లోతట్టుభూమి మరియు కారాకుం ఎడారి ఆక్రమించుచున్నాయి. ఇవి అంతా చదునైన భూములు. నైఋతి సరిహద్దు వెంటా ఉన్న కోపెత్ దాగ్ పర్వతశ్రేణులు 2,912 మీటర్ల ఎత్తుకు చేరుతున్నవి. దూర పశ్చిమాన బాల్కన్ పర్వతాలు, దూర తూర్పున కుగితాంగ్ శ్రేణులు దేశములోని ఇతర చెప్పుకోదగిన ఎత్తైన ప్రదేశాలు. ఆమూ దర్యా మరియు హరి రుద్ ఈ దేశము గుండా ప్రవహించే నదులు.

ఇక్కడ స్వల్ప వర్షాలతో కూడిన ఉప ఆయనరేఖా ప్రాంతపు ఎడారి వాతావరణము. శీతాకాలాలు పొడిగా మరియు మితముగా ఉంటాయి. జనవరి నుండి మే వరకు చాలా మటుకు అవపాతము కురుస్తుంది. కోపెత్ దాగ్ శ్రేణులు అన్నింటికంటే ఎక్కువ అవపాతాన్ని పొందుతాయి.

ఇతర నగరములు : తుర్క్‌మెన్‌బాషి (ఇదివరకటి క్రాస్నొవోడ్స్క్) మరియు దషొగుజ్.

[మార్చు] ఆర్ధిక వ్యవస్థ

తుర్కమేనిస్తాన్ ప్రపంచములోనే 10వపెద్ద పత్తి ఉత్పత్తిదారు. సాగుభూమిలో సగభాగము పత్తి పండిస్తారు. తుర్కమేనిస్తాన్ లో ప్రపంచములోనే ఐదవ పెద్ద సహజ వాయువు నిల్వలు, చమురు నిల్వలు కలవు. 1994 లో రష్యా తుర్క్‌మెన్ సహజ వాయువును హార్డ్ కరెన్సీ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి నిరాకరించడము, పూర్వపు సోవియట్ సమాఖ్యలోని పెద్దపెద్ద తుర్క్‌మెన్ సహజ వాయువు వినియోగదారుల అప్పులు కొండలా పెరిగి పోవడముతో పారిశ్రామిక ఉత్పాదన వేగంగా అడుగంటి దేశ బడ్జెట్ మెరుగులోనుండి స్వల్ప తరుగుకు వెళ్లినది.

తుర్కమేనిస్తాన్ తమ సహజవాయువు మరియు పత్తి అమ్మకాలతో కుంటుపడిన ఆర్ధిక వ్యవస్థను నెట్టుకు రాగలమనే ఆశతో సంస్కరణల మార్గములో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ప్రైవేటీకరణ లక్ష్యాలు పరిమితముగానే ఉన్నాయి. 1998 నుండి 2002 మధ్య కాలములో తుర్కమేనిస్తాన్ తగినన్ని సహజ వాయువు ఎగుమతి మార్గాలు లేక మరియు విస్తారమైన స్వల్పకాలిక విదేశీ అప్పు వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. అదే సమయములో అంతర్జాతీయముగా చమురు మరియు వాయువు ధరలు పెరగడము వలన మొత్తము ఎగుమతుల యొక్క విలువ మాత్రము త్వరితగతిన పెరిగినది. సర్వవ్యాప్తమైన అంతర్గత పేదరికము, విదేశీ అప్పు భారము, మరియు మార్కెట్-oriented సంస్కరణలు అవలంభించడానికి ప్రభుత్వము యొక్క విముఖత వలన దగ్గరి భవిష్యత్తు నిరాశాజనకముగానే ఉన్నది.

అధ్యక్షుడు నియజోవ్ తన సొంత దర్జాలకోసము దేశము యొక్క ఖజానను ఖాళీ చేసినాడు. రాజధాని బయటి ప్రాంతాలలోని ప్రజలు కటిక దారిద్ర్యముతో పోరాడుతుంటే నగరములకు, ప్రత్యేకముగా అష్గబత్కు, విస్తారముగా హంగులు కూర్చి రూపుదిద్దాడు. నియజోవ్ ఉచిత మంచినీరు, విధ్యుఛ్ఛక్తి మరియు ఇంధనము ఇస్తానని ప్రమాణము చేశాడు కానీ కోతలు సర్వసాధారణము.

[మార్చు] ప్రజలు

సాంప్రదాయక వస్త్రధారణలో ఒక తుర్క్‌మేన్
సాంప్రదాయక వస్త్రధారణలో ఒక తుర్క్‌మేన్

తుర్కమేనిస్తాన్ లో అధిక సంఖ్యాక ప్రజలు తుర్క్‌మెన్ జాతికి చెందినవారు. రష్యన్లు మరియు ఉజ్బెక్లు ఇతర జాతుల ప్రజలు. జాతుల మధ్య వారధిగా రష్యన్ బాష ఇంకా చాల విరివిగా ఉపయోగిస్తున్నప్పటికీ తుర్క్‌మెన్ బాష తుర్కమేనిస్తాన్ యొక్క అధికార బాష. ఉన్నత పాఠశాల స్థాయి వరకు విద్యాభ్యాసము అందరికీ తప్పనిసరి. పాఠశాల విద్య యొక్క నిడివి ఇటీవల 11 నుండి 9 సంవత్సరాలకు కుదించబడినది.

[మార్చు] బయటి లింకులు


మధ్య ఆసియా దేశాలు

ఆఫ్ఘానిస్తాన్ | కజఖిస్తాన్ | కిర్గిజ్‌స్తాన్ | మంగోలియా | రష్యా | తజికిస్తాన్ | తుర్కమేనిస్తాన్ | ఉజ్బెకిస్తాన్

మూస:Commonwealth of Independent States

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com