Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
Wikipedia:సమర్పణల ప్రశ్నలు - వికిపీడియా

Wikipedia:సమర్పణల ప్రశ్నలు

వికీపీడియా నుండి

ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...

స్థూలదృష్టి ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
విద్యాలయాల ప్రశ్నలు
సమర్పణల ప్రశ్నలు
దిద్దుబాటు ప్రశ్నలు
నిర్వహణ ప్రశ్నలు
సాంకేతిక ప్రశ్నలు
సమస్యల ప్రశ్నలు
ఇతర ప్రశ్నలు
కాపీహక్కు ప్రశ్నలు

చూడండి...

సహాయ పేజీ


వికీపీడియా సమర్పకులు సాధారణంగా అడుగుతూ వుండే ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి తరచూ అడిగే ప్రశ్నల్ని ఈ పేజీలో ఇస్తున్నాం.


పేజీలలో ఎలా దిద్దుబాట్లు చేయాలి అనే విషయంపై మరిన్ని వివరాల కొరకు సహాయ పేజీ చూడండి.

విషయ సూచిక

[మార్చు] శుభారంభం

[మార్చు] నేను ఎలా సమర్పించాలి?

ఎన్నో మార్గాలు ఉన్నాయి! వికీపీడియాలో సమర్పణలు చూడండి.

[మార్చు] నేనెందుకు సమర్పించాలి?

అసలు నేనో వికీకి ఎందుకు సమర్పించాలి మరియు ఏమిటి వికీపీడియా గొప్ప లను చూడండి.

[మార్చు] పేజీలు దిద్దటానికి నేను నమోదు చేసుకోవాలా?

లేదు. ఎవరైనా ఎటువంటి నమోదు కాకుండానే దిద్దుబాట్లు చెయ్యవచ్చు (నిషేధించిన విఛ్చిన్నకర సభ్యులు తప్పించి). (Wikipedia:అనామక దిద్దుబాట్లకు స్వాగతం చూడండి)

[మార్చు] సభ్య నామం యొక్క అవసరం ఏమిటి?

చాలా కారణాలున్నయి: Wikipedia:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.

[మార్చు] నేను నా అసలు పేరును ఉపయోగించాలా?

అసలు పేర్లు అవసరం లేదు; కొంతమంది అసలు పేర్లు వాడతారు; కొంతమంది వాడరు.

[మార్చు] నా సభ్యనామాన్ని మార్చుకోవడం ఎలా?

Wikipedia:సభ్యనామం మార్పు చూడండి.

[మార్చు] పదకోశం

చర్చా పేజీల్లోనూ, దిద్దుబట్ల చరితం తాత్పర్యాల్లోను వికీపీడియాకే ప్రత్యేకమైన కొన్ని పదాలను, పొడి పదాలను మీరు ఎక్కువగా చూస్తారు. కొత్తవారికి కొత్తగా అనిపించే పదాలు ఏవంటే;
దిద్దుబాట్ల తాత్పర్యంలో వచ్చే rv లేదా revert అంటే ఆ పేజీని తిరిగి పూర్వపు కూర్పుకు పంపిచినట్లు. ఎక్కువగా ఇది దుష్ప్రవర్తన కారణమ్గా జరుగుతుంది.
NPOV అంటే నిష్పాక్షిక దృక్కోణం కలిగివుండటం. దానికి వ్యతిరేకమైనది POV; అంటే సంబంధిత సమర్పణ పక్షపాతం గా వున్నదన్నమాట.
Wikify అంటే మామూలు వ్యాసానికి అంతర్గత లింకులు పెట్టటం, ఇతర కూర్పులు చెయ్యడం వంటివి.
dab అంటే అయోమయ నివృత్తి లేదా ఒక లింకును మెరుగు పరచి సరాసరి సంబంధిత వ్యాసానికి వెళ్ళేటట్లు చెయ్యడం.
మరింత విస్తృత జాబితా కొరకు పదకోశం చూడండి.

[మార్చు] పేజీకి వ్యాసానికి మధ్య గల తేడా ఏమిటి?

వికీపీడియా లో వున్న విజ్ఞాన వ్యాసాలు, చర్చా పేజీలు, దాక్యుమెంటేషను, ఇటీవలి మార్పులు వంటి ప్రత్యేక పేజీలు మొదలైనవన్నీ పేజీలే. "వ్యాసం" అనేది కేవలం విజ్ఞాన సర్వస్వం కు సంబంధించిన సమర్పణ మాత్రమే. అంటే, అన్ని వ్యాసాలూ పేజీలే, కానీ, అన్ని పేజీలు వ్యాసాలు కావు. మరింత సమాచారం కొరకు Wikipedia:వ్యాసం అంటే ఏమిటి చూడండి

[మార్చు] అనాధ అంటే ఏమిటి?

వేరే ఏ ఇతర వ్యాసం నుండి లింకులు లేని వ్యాసాన్ని అనాధ అంటారు. వికీపీడియాను అన్వేషిస్తే ఇవి దొరుకుతాయి, అయినా ఎదో ఒక సంబంధిత వ్యాసంలో దీనికి లింకు పెట్టటం అనేది అభిలషణీయం. అనాధ వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు.

[మార్చు] మొలక (stub) అంటే ఏమిటి?

వికీపీడియాలో ఒక పేరాగ్రాఫు లోపు వుండే చిన్న వ్యాసాన్ని మొలక అంటారు. ఎక్కువ మందికి మొలక అంటే పడదు, కాకపోతే అవి తప్పని తలనెప్పి వంటివి. చాలా గొప్ప వ్యాసాలు కూడా చిన్న మొలకలుగా మొదలైనవే, కాబట్టి, ఇప్పటి మొలకల్ని పూర్తిస్థాయి వ్యాసాలుగా విస్తృత పరచాలి. మొలకలపై సమాచారం కొరకు Wikipedia:మొలక ను చూడండి.

[మార్చు] అయోమయ నివృత్తి ఏమిటి?

Wikipedia:అయోమయ నివృత్తి చూడండి.

[మార్చు] చిన్న మార్పు అంటే ఏమిటి? దాన్నెప్పుడు వాడాలి?

వికీపీడియా లో లాగిన్‌ అయిన సభ్యుడు తాను చేసే మార్పులను "చిన్న" మార్పులుగా గుర్తు పెట్టే అవకాశం ఉంది. ఇలా గుర్తు పెట్టడం అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాల్ని బట్టి ఉంటుంది. ఒక బండ గుర్తు ఏమిటంటే చిన్న వ్యాకరణ దోషాలు, వ్యాసం అమరికలో చేసే చిన్న చిన్న మార్పులు, కొద్ది పదాలను మార్చడం మొదలైనవి ఈ కోవ లోనికి వస్తాయి. వ్యాసంలోని మార్పులను మళ్ళీ

పరిశీలించాలనుకునే మార్పులు పెద్ద మార్పులు అవుతాయి. అంత మాత్రాన, "తీవ్రవాది" ని "స్వాతంత్ర్య సమర యోధుడు" అని మార్చి, ఒకే పదం మార్పు కదా అని దీన్ని "చిన్న" మార్పు అని గుర్తించరాదు

ఈ అంశం ముఖ్యమైనది, ఎందుకంటే సభ్యులు ఇటీవలి మార్పులు చూసేటపుడు మార్పుల సంఖ్యను తగ్గించి చూడడానికి చిన్న మార్పులను "దాచ" వచ్చు.


లాగిన్‌ కాని వారు చిన్న మార్పులని గుర్తు పెట్టే అవకాశం ఇవ్వనిది ఎందుకంటే దుష్ప్రవర్తనతో కూడిన మార్పులను చిన్న మార్పులుగా గుర్తు పెడితే, వాటిని గుర్తించడంలో ఆలస్యమవుతుంది కనుక. అకౌంటు సృష్టించి లాగిన్‌ అయివుండాలనటానికి ఇది మరో కారణం.
ఇంకా చూడండి: Wikipedia:చిన్న మార్పులు.

[మార్చు] సాధారణం

[మార్చు] ఈ ప్రశ్నల్లో కంటే ఇంకా ఎక్కువ సమాచారం నాకెక్కడ దొరుకుతుంది?

Wikipedia:కొత్త సభ్యులకు స్వాగతము తో మొదలు పెట్టండి. సహాయం పేజీలో చక్కని సూచిక ఉంది, Wikipedia:విషయ సూచిక లో వివిధ లింకులకు సంబంధించి పెద్ద జాబితా ఉంది.

[మార్చు] నేను తెలుసుకోవలసిన నియమాలు, మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా?

Wikipedia:విధానాలు, మార్గదర్శకాలు చూడండి. ఇందులో:

[మార్చు] ఇటీవలి మార్పులు అంటే ఏమిటి, అక్కడ వాడిన పొడి పదాల అర్ధం ఏమిటి?

ఒక నిర్ణీత సమయం లోపు చేసిన మార్పులను ఇటీవలి మార్పులు అంటారు. దీనిపై సమాచారం కొరకు Wikipedia:ఇటీవలి మార్పులు చూడండి.

[మార్చు] తేదీ వంటి వాటికి ప్రామాణికమైన మూసలు ఏమైనా ఉన్నయా?

శైలి మాన్యువల్‌ చూడండి.

[మార్చు] ఒకే విషయంపై రెండు వ్యాసాలుంటే ఏం చెయ్యాలి?

ఏముందీ, చొరవ తీసుకుని వాటిని కలపండి. చక్కగా అతికే పేరు ను ఎంచుకోండి (ఉన్న రెండూ కాకపోయినా పరవాలేదు!). ఏ పేరు వాడాలో నిర్ణయించుకోలేకపోతే లేదా అసలా వ్యాసాల్ని కలపాలో అక్కర్లేదో నిర్ణయించుకోలేక పోతే, ఏదో ఒక వ్యాసపు చర్చా పేజీ లో రాసి (రెండో వ్యాసపు చర్చా పేజీలో దీనికి లింకు పెట్టండి) ఇతర వికీపీడియన్లు ఏమి అనుకుంటారో గమనించండి. Wikipedia:డూప్లికేటు వ్యాసాల జాబితాలో కూడా దీనిని ప్రస్తావించ వచ్చు.

[మార్చు] వ్యాసానికి గరిష్ఠ/అనుకూలమైన పొడవు ఎంత? వ్యాసాన్ని ఎప్పుడు చిన్న చిన్న భాగాలుగా విభజించాలి?

Wikipedia:వ్యాసపు పరిమాణం చూడండి

[మార్చు] వ్యాస విషయాలపై ఇక్కడ చర్చించ వచ్చా?

ఇది ఒక విజ్ఞాన సర్వస్వం, విషయాలను నిష్పాక్షిక దృక్కోణం లో ప్రచురించడానికి శ్రమిస్తుంది. మీ అభిప్రాయంతో ఏకిభవించేలా వేరే వారిని ఒప్పించడం కోసం చేసే చర్చ Wikipedia:IRC ఛానెల్స్‌ లో చెయ్యవచ్చు. అయితే వ్యాసాలను మెరుగు పరచే ఉద్దేశ్యంతో చేసే చర్చ ఇక్కడ చెయ్యవచ్చు; వ్యాసానికున్న చర్చా పేజీలో ఇది జరుగుతుంది.

[మార్చు] దుష్ప్రవర్తనను కనుక్కున్నాను, లేదా పొరపాటున నేనే ఒక పేజీని పాడు చేసాను! దాన్నెలా సరిదిద్దాలి?

చూడండి: Wikipedia:పేజీని పూర్వపు కూర్పుకు ఎలా తీసుకువెళ్ళాలి.

[మార్చు] ఏ యే భాషలు వాడవచ్చు?

తెలుగు వికీపీడియా లో తెలుగే వాడాలి, మీరు రాసే పదానికి తెలుగు అనువాదం లేకపోతే తప్ప. వేరే భాషల్లో రాయదలుచుకుంటే వివిధ భాషల్లో వికీపీడియాలున్నాయి, అక్కడ రాయవచ్చు. వీటి లింకుల కొరకు బహుళ భాషా సమన్వయం లో చూడండి. మీ భాష ఇంకా ఆచరణలో లేకపోతే, వికీపీడియా-L లో సభ్యులై మీ కోరికను తెలియజేయవచ్చు.

[మార్చు] కొన్ని లింకులు ఎర్రగా ఎందుకుంటాయి? ఈ ? లింకులు ఏమిటి?

అవి రెండూ కూడా- ఆ పేరుతో నున్న పేజీ ఇంకా మొదలు కాలేదని తెలియజేస్తాయి. ఈ రెండింటిలో ఏది మీకు కనపడుతుందనేది మీ స్పెషల్‌:అభిరుచుల ను బట్టి వుంటుంది. "ఖాళీ పేజీల లింకులను గుర్తించు" అనేది ఎంచుకుని వుంటే, మీకు ఎర్ర లింకులు కనిపిస్తాయి. లేకపోతే, చిన్న నీలం రంగు ప్రశ్నార్ధకాలు కనిపిస్తాయి.
ఏ విధంగా నయినా సరే, ఆ లింకును నొక్కి ఆ పేరుతో మీరో కొత్త పేజీని మొదలు పెట్టవచ్చు. జాగ్రత్త సుమా-- అటువంటి విషయాల పై వేరే వ్యాసాలు ఉండవచ్చు, లేదా అదే వ్యాసం వేరే పేరుతో ఉండవచ్చు. అటువంటి విషయాల గురించి ముందు వెదకడం అనేది ముఖ్యం. పేజీలకు పేరు పెట్టే విషయంపై సమాచారం కొరకు Wikipedia:నామకరణ పధ్ధతులు చూడండి.

[మార్చు] సరే, ఈ తేలిక నీలం రంగు లింకుల సంగతేమిటి?

ఇవి బయటి లింకులు; అంటే, వికీపీడియా కు బయట ఉండే పేజీల లింకులు. అవి ఇలా కనపడతాయి.

[మార్చు] ఒక పేజీని ఇద్దరు సభ్యులు ఒకే సమయంలో మార్చితే ఏమి జరుగుతుంది?

దీనిని "మార్పు ఘర్షణ" అంటారు. రెండు కూర్పులను రెండు విండో లలో చూపిస్తూ వాటిలోని తేడాలను హైలైట్‌ చేసి (ఇద్దరూ చేసిన మార్పులు మాత్రమే చుపిస్తుంది కానీ వాళ్ళు చేసిన ఒకే విధమైన మార్పును చూపించదు), తరువాత వారెలా ముందుకు సాగాలో తెలియజేస్తుంది. సమాచారం ఏ కొంచం కూడా పోయే అవకాశం లేదు.
భవిష్యత్తులో రెండు కూర్పులను దానంతట అదే కలిపేసే సాఫ్ట్‌వెర్‌ రావచ్చని వికీపీడియా డెవెలపర్లు సూచించారు

[మార్చు] దిద్దుబాటు మధ్యలో ఉండగా నా కంప్యూటరు గాని బ్రౌజరు గాని క్రాష్‌ అయితే, లేక సర్వరు స్పందించకపోతేనో ఏమి జరుగుతుంది?

క్రాష్‌ అయితే మీ దిద్దుబాట్లు పోతాయి. ఏదో ఒక టెక్స్ట్‌ ఎడిటరు వాడి దీనినుండి కొంతవరకు బయట పడవచ్చు (కానీ ఎప్పటికప్పుడు సేవ్‌ చేసుకోక పోతే క్రాష్‌ అయిన సందర్భంలో ఇదీ పనిచేయదు).
సర్వరు టైమవుట్‌ అయినప్పుడు దిద్దుబాట్లు పోవడం పోవకపోవడం అనేది మీ బ్రౌజరును బట్టి వుంటుంది. కొన్ని బ్రౌజర్లు (ఉదా..మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌) బాక్‌ బటను నొక్కినపుడు మీరు రాసిన దాన్ని మళ్ళీ చూపిస్తాయి. కొన్నిటిలో అవి పోతాయి. ఆ టెక్స్ట్‌ ను కాపీ చేసుకుని(కనీసం క్లిప్‌బోర్డుకు) రక్షించుకోవచ్చు. మీరిది చేయకపోతే, బాక్‌ బటను నొక్కి వెనక్కి వెళ్ళి, రిఫ్రెష్‌ చేస్తే కనీసం ఇటీవలి కూర్పును పొందవచ్చు.

[మార్చు] ఒక విషయంపై జరిగే మార్పుల సంగతి ప్రతిసారీ ఆ పేజీ కి వెళ్ళకుండానే ఎలా తెలుసుకోవడం?

మీరు లాగిన్‌ అయివుంటే, ప్రతిపేజీలోను మీకు "ఈ వ్యాసాన్ని వీక్షించు" అనే లింకు కనిపిస్తుంది. దానిని నొక్కితే, ఆ వ్యాసం మీ స్వంత వీక్షణ జాబితా లో చేరిపోతుంది. మీరు గమనిస్తున్న వ్యాసాల లోని ఇటీవలి మార్పులను మీ వీక్షణ జాబితా చూపిస్తుంది.

[మార్చు] బొమ్మలకు/వీడియోలకు ఏ ఫైల్‌ ఫార్మాట్‌ ను వాడాలి?

ఫోటోగ్రాఫులకు JPEG ను, డ్రాయింగులకు, లోగోలు మొదలైన వాటికి PNG ని వాడాలి. PNG కి బదులుగా GIF ను వాడవచ్చు గానీ పేటేంటు కారణాల వలన దానిని ప్రోత్సహించడం లేదు. ఇక వీడియో, మంచి ప్రశ్న; అది ఇంకా లేదు. మరింత సమాచారం కొరకు Wikipedia:బొమ్మలు వాడుకునే విధానం చూడండి.

[మార్చు] శబ్దానికి ఏ ఫైల్‌ ఫార్మాట్‌ ను వాడాలి?

వివిధ ఫార్మాట్లను ప్రోత్సహిస్తున్నాం. WAV మరియు Ogg Vorbis లను అంగీకరిస్తాం, కానీ MP3 ని ఒప్పుకోం. మరింత సమాచారం కొరకుWikipedia:శబ్దం ను చూడండి.

[మార్చు] ఒక సమర్పకుడు మరీ అసంబధ్దంగా ఉన్నారు. సాయం చెయ్యగలరా!

Wikipedia:సంయమనంతో ఉండండి మరియు Wikipedia:వివాద పరిష్కారం చూడండి.

[మార్చు] "నా మార్పులు చేర్పులు" జాబితా లోని సమర్పణల సంఖ్యను నేను మార్చవచ్చా?

ప్రస్తుతానికి కుదరదు. You can, however, change the setting on the page and bookmark the resulting page.

[మార్చు] నేను రాసిన వ్యాసాన్ని ఎందుకు తొలగించారు?

  • కొత్త వ్యాసాలను వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల ను పాటించనందుకు తొలగిస్తారు. మీ వ్యాసాన్ని తొలగించినా సరే, మీరు మరిన్ని వ్యాసాలను సమర్పించవచ్చు.
  • వ్యాసాలను త్వరగా తొలగించడానికి కారణాలిలా ఉండవచ్చు:
  • అసందర్భంగా ఉండే వాక్యాలతో కూడిన చాలా చిన్న పేజి(ఉదా.. "నాకు దాహం వేస్తోంది. అయినా సరే అనకాపల్లి ఎంత పెద్దదో నాకు తెలియదు.").
  • అర్ధం పర్ధం లేని వాక్యాలు లేదా చరితం (ఉదా.. "స్ధ్ఘీదూXఫ"). సిసలైన చెత్త ను చూడండి.
  • పరీక్షా పేజి (ఉదా.. "నేనిక్కడ కొత్త పేజిని తయారు చెయ్యగలనా?").
  • సిసలైన దుశ్చర్య(దుశ్చర్యను ఎదుర్కోవడం చూడండి). మీలో చెడు తలంపులు లేకపోతే, మీ వ్యాసం ఈ కోవ లోకి రాదని తెలుసుకోండి.
  • తొలగింపు విధానం కింద ఇంతకు ముందు తొలగిమ్చిన దానిని మళ్ళీ సమర్పించడం.పున:ప్రతిష్ఠ విధానం ప్రకారం తిరిగి చేర్చిన వాటికి ఇది వర్తించదు.
  • ఒక సభ్యుని నిషేధించిన తరువాత ఆ సభ్యుడు తానొక్కడే సృష్టించి, దిద్దుబాట్లు జరిపిన పేజీ (నిషేధాలూ అడ్డగింపులు చూడండి). దీని విషయంలో భేదాభిప్రాయాలున్నాయి!
  • ఇప్పటికే ట్రాన్స్‌వికీ పధ్దతిలో వ్యాసాన్ని తరలించినపుడు.

[మార్చు] నేను చేసిన మార్పు చేర్పులను ఎందుకు తొలగించారు?

చాలా రకాల కారణాలున్నాయి(కొన్నిసాధారణ పొరపాట్లు). మీరు ముందు చెయ్యవసింది మీరు దిద్దుబాటు చేసిన వ్యాసపు చరితం పేజీని చూడటం. ఎవరు చేసారు, ఎప్పుడు చేసారు, బహుశా ఎందుకు చేసారో చిన్న కారణం కూడా అక్కడ మీకు దొరుకుతుంది. అక్కడ చర్చ చూడు అని వుంటే, ఆ వ్యాసపు చర్చా పేజీ ని చూడాలి. ఇంకా, మీరు మీ చర్చా పేజీ ని కూడా ఏమైనా సందేశం ఉందేమో చూడండి. మీకు సంతృప్తికరమైన సమాధానం దొరక్క పోతే, వ్యాసపు చర్చా పేజీలో మీరు తలపెట్టిన మార్పు గురించి మర్యాదగా రాయండి. మీ మార్పులో ఉండవలసిన కొన్ని మార్పుల గురించి సలహాలు రావచ్చు, లేదా ఎందుకు దానిని ప్రచురించకూడదో కారణాలు మీకు లభించవచ్చు.

[మార్చు] లింకులు: బయటివీ, బహుళ భాషలవి

[మార్చు] ఒక వికీపీడియా నుండి మరొక దానికి నేను పేజీలను అనువాదం చెయ్యవచ్చా?

తప్పకుండా, అదొక మంచి ఆలోచన.

[మార్చు] యాంత్రిక అనువాదం వాడవచ్చా?

ఒక తెలియని భాషలోని విషయాన్ని తెలుసుకోవడానికి యాంత్రిక అనువాదాన్ని వాడవచ్చు కాని దాని అనువాదాలు చాలా అథమ స్థాయిలో ఉంటాయి. అందుచేత వాటిని యథాతథంగా వాడలేము. యాంత్రిక అనువాదాన్ని కేవలం ఒక సాధనం గా వాడుకుని తరువాత ఆ అనువాదాన్ని సరి దిద్దుకునే ఆలోచన ఉంటే, అలా చెయ్యవచ్చు.

[మార్చు] వేరే భాష లోని వికీపీడియాలో ఫలానా వ్యాసం ఉందని ఎలా తెలుస్తుంది?

వివిధ భాషలలోని పేజీల మధ్య లింకులు పెట్టే ప్రయత్నం చేస్తాం -- ఒక వ్యాసం వేరే చోట ఉందో లేదో తెలుసుకోవడానికి అదొక మార్గం. భాషల లింకులు పేజీ పై భాగాన లేక పోతే వేరే భాషలలో సంబంధిత వ్యాసాల కొరకు వెదకండి. దొరికితే, ఒకదానికొకటి లింకులు పెట్టండి; లేదంటే, అనువాదం చెయ్యండి. ఒక్క విషయం గుర్తుంచ్కోండి - ఒకే వ్యాసం వివిధ వికీపీడియాల్లో యథాతథంగా ఉండదు. మరింత సమాచారం కొరకు Wikipedia:భాషాంతర లింకులు మరియు Wikipedia:బహుళ భాషా సమన్వయం చూడండి.

[మార్చు] కాపీహక్కులు

[మార్చు] వికీపీడియా లోకి ఒక బొమ్మను గానీ, వ్యాసాన్ని గానీ కాపీ చేయడానికి నాకు ప్రత్యేక అనుమతి ఉంది, లేదా తెచ్చుకుంటాను. నేనలా చెయ్యవచ్చా?

వికీపీడియా లోని వ్యాసాలూ, బొమ్మలు GNU ఫ్రీ డాక్యుమెంటేషన్‌ లైసెన్స్‌ కు లోబడి ఉంటాయి. ఏదైనా వస్తువు ఇటువంటి లైసెన్స్‌ కు లోబడి లేకున్నా, లేక అది సార్వజనీనం కాకున్నా దానిని వికీపీడియాలో వాడే వీలు లేదు. కాబట్టి మీరు దానిని GFD లైసెన్సుకు లోబడీ ఇవ్వాలని ఆ కాపీ హక్కుదారుని అడగాలి.

[మార్చు] నా దగ్గర కాపీహక్కు లేని ఒక బొమ్మ (లేక వ్యాసం) ఉంది. కానీ దానిని కాపి హక్కులు గల పుస్తకంలో పునర్ముద్రించారు. నేను దానిని వికీపీడియా లోకి స్కాన్‌ గానీ టైపు గాని చెయ్యవచ్చా?

వాళ్ళు దానిని యథాతథంగా వాడితే దాని మీద వారికి కాపీ హక్కులు ఉండవు. వాళ్ళు వాడే ముందు అది సార్వజనీనం అయితే ఇప్పుడూ అది సార్వజనీనమే.

[మార్చు] GIF బొమ్మలను వికీపీడియాలో వాడితే దానికి పేటెంటు ఉంది కాబట్టి GFDL ను అతిక్రమించినట్లా?

లేదు. GIF పధ్దతి తో ఉపయోగించే LZW కంప్రెషన్‌ ఆల్గారిధమ్‌ యొక్క లైసెన్సుకు కాలదోషం పట్టింది.

[మార్చు] జపాను కాపీ హక్కుల చట్టం ప్రకరం హక్కుదారులు తమ వస్తువులను సార్వజనీనం చెయ్యకూడదు, కాబట్టి అక్కడ సార్వజనీనం అనేదే లేదు. అప్పుడు ఏమి చెయ్యాలి?

సాంకేతికంగా, జపాను లో కూడా, లైసెన్సుకు కాలదోషం పట్టడం ఉంటుంది. కాబట్టి లైసెన్సుకు కాలదోషం పట్టగానే అవి సార్వజనీనమైనట్లే. లేని పక్షంలో అవి సార్వజనీనం కానట్లే-- టకు (నాకు బాగ తెలియదు. మీరేమయిన సహాయం చెయ్యగలరా!)

[మార్చు] అవీ, ఇవీ

[మార్చు] వికీపీడియా చాలా బాగుంది, కానీ నేనెంత కాలం ఉంటానో తెలీదు. అందుకని నేను ఈ వికీపీడియా జబ్బును నా తోటివారికి అంటించాలని అనుకుంటున్నాను. ఎలా చేయాలి?

దీనిపై కొన్ని ఉపాయాల కొరకు Wikipedia:వికీపీడియా సభ్యుల సంఖ్యని పెంచడం చూడండి. మీ కుట్ర జయప్రదమగు గాక. హాహాహా..!

[మార్చు] వికీపీడియా కు విరాళాలు ఎలా ఇవ్వాలి?

http://wikimediafoundation.org/fundraising చూడండి.

[మార్చు] వికీపీడియా లో దేన్నయినా సరే మార్చవచ్చా, నిజంగా?

అవును చెయ్యవచ్చు. ఆ మార్పులు వెంటనే కనిపిస్తాయి కూడా..

(వాస్తవానికి, ఇది పూర్తిగా నిజం కాదు. వికీపీడియా లో కొన్ని రక్షించబడిన పేజీలు ఉన్నాయి, వీటిని నిర్వాహకులు మాత్రమే మార్చగలరు. శాశ్వతంగా రక్షించబడిన మొదటి పేజీ, మరియు దిద్దుబాటు యుధ్ధం తరువాత జరిగే సంధి లో భాగంగా తాత్కాలికంగా రక్షించబడిన మామూలు పేజీలు ఈ జాబితా లో ఉంటాయి. అయితే, వికీపీడియా లోని ఎక్కువ భాగం పేజీలను ఎవరైనా, ఎప్పుడైనా దిద్దవచ్చు.)

[మార్చు] నేను చేసిన దిద్దుబాట్ల సంఖ్య తెలుసుకోవడం ఎలా?

దిద్దుబాట్ల లెక్కింపు అనే సాధనం దానంతట అదే లెక్కవేస్తుంది.
మీరే లెక్క పెట్టుకోవాలంటే, పేజీ పై భాగంలో ఉండే నా మార్పు చేర్పులు లింకు ద్వారా చెయ్యవచ్చు.
Special:Contributions లో మీ దిద్దుబాట్ల జాబితా ఉంటుంది; మీరే లెక్క పెట్టుకోవాలి, గబ గబా లెక్క పెట్టటానికి అక్కడ అడ్డదారి ఏమీ లేదు. ఈ URL కు వెళ్ళండి:
http://te.wikipedia.org/w/wiki.phtml?title=Special:Contributions&limit=50&offset=50&hideminor=0&target=username
అక్కడ బొద్దుగా (bolded) ఉన్న 50 ని గమనించండి. ఆ సంఖ్యను పెంచి మళ్ళీ మీ మార్పు చేర్పుల పేజీ కి వెళ్ళండి. ఆ విధంగా మీరు దానితో లెక్క పెట్టించవచ్చు. మీరో 500 దిద్దుబాట్లు చేసి ఉంటానని అనుకుంటే, ఈ విధంగా లెక్క వేస్తే త్వరగా అయిపోతుంది
ముందుగా 500 తో మొదలు పెట్టండి, పేజీలో కొంత ఖాళీ వచ్చిందనుకోండి, దానర్ధం మెరింకా 500 చెయ్యలేదన్నమాట. ఈ సంఖ్యను కొద్ది కొద్ది గా తగ్గించుకుంటూ వెళ్ళండి. ఉదాహరణకు 200 వద్ద ఒక నిండు పేజీ, తరువాతి పేజీలో 15 వచ్చాయనుకుందాం. అంటే మీరు 215 దిద్దుబాట్లు చేసారన్న మాట.

[మార్చు] మొదటి పేజీని దిద్దటం

Wikipedia:మొదటి పేజీని దిద్దటం చూడండి.



Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com