Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
Wikipedia:మూలాలు - వికిపీడియా

Wikipedia:మూలాలు

వికీపీడియా నుండి

ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. ఈ పేజీ లో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి ఆయా మార్పులు చెయ్యండి. కాకపోతే, మీరు చెయ్యదలచిన మార్పులు పెద్దవైతే ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి.

వికీపీడియాలో రాయబడుతున్న వ్యాసాల యొక్క మూలాలను ఎలా ఉంచాలో తెలుపుట ఈ పేజీ యొక్క ఉద్దేశము.

విషయ సూచిక

[మార్చు] మూలాలను ఎందుకు తెలుపాలి

  • చదివేవారు ఇక్కడ ఉన్న సమాచారము సరయినదా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటానికి.
  • వికీపీడియా యొక్క నాణ్యతా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు.
  • అక్కడ ఉన్న సమాచారం మీ సొంత అభిప్రాయం కాదు అని తెలుపటానికి. వికీపీడియా మీ వ్యాసాలలో మీ సొంత అభిప్రాయాలకు తావులేదు. అలాంటివి ఏమయినా ఉంటే గనక వాటిని చర్చా పేజీలలో ఉంచండి.
  • ఇతర సభ్యులు మీరు రాసిన దానిని వ్యతిరేకించకుండా ఉండేందుకు కూడా మూలాలు అవసరం.
  • మూలాలను తెలుపటం వలన అసలు సమాచారం అందించిన వారికి తగిన గుర్తింపు/గౌరవం ఇచ్చినట్లుంటుంది.

గమనిక: సాధ్యమయినంత వరకు వికీపీడియాలో ఉన్న ఇతర వ్యాసములను మూలాలలో చేర్చవద్దు. అలాంటి వాటిని "ఇవికూడా చూడాండి" జాబితాలో ఉంచండి.

[మార్చు] మూలాలను ఏ ఏ సమయాలలో తెలుపాలి

[మార్చు] వ్యాసంలో కొత్త సమాచారాన్ని చేర్చినప్పుడు

మీరు ఏదయినా కొత్త సమాచారాన్ని సేకరించి, దానిని ఇక్కడ ఉన్న వ్యాసాలలో చేర్చాలనుకున్నప్పుడు, మొదట ఆ సమాచారం యొక్క మూలాన్ని తెలుపండి. అది ఒక పుస్తకం కావచ్చు, ఒక వెబ్‌సైటులోని పేజీ లాంటివి ఏదయినా కవచ్చు, కాకపోతే మీరు పొందు పరిచిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా చదివేవారెవరయినా నిర్ధారించగలిగేటట్లు ఉండాలి. ఒక వేళ మీరు రాసే సమాచారం గురించి మీకు ముందే తెలిసినట్లయితే మీరు ఎటువంటి మూలాలను చూడాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ అలాంటి సమయాలలో ఇతరులకు మీరు రాసిన దానిపై సందేహాలుంటే వాటిని తీర్చటానికి కావలిసిన మూలాలను చేర్చండి, అప్పుడు ప్రతీ ఒక్కరి సందేహాలను తీర్చాల్సిన అవసరం ఉండదు.

మూలాల యొక్క అసలు అవసరం ఏదయినా విషయంపై అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు ఉంటుంది. అలా అభిప్రాయాలను తెపుతున్నప్పుడు, దానిని దృడపరచటానికి సరయిన మూలం చూపించారంటే, ఇంక అందరూ మీవాదననే ఒప్పుకుంటారు (దానికి వ్యతిరేకంగా ఇంకో మంచి మూలం చూపించే దాకా). "కొంతమంది ఇలా భావిస్తారు", "కొంతమంది అలా భావిస్తారు", లాంటి వాక్యనిర్మాణాలను సాధ్యమయినంతవరకు తగ్గించండి. సాధారణంగా అళాంటి వాక్యాలు చదివేవారిమదిలో వ్యతిరేక ప్రభావం చూపుతాయి. దానికి బదులుగా "వీరందరూ ఇలాఅన్నారు", "వారు అలా అన్నారు", అని రాసి ఆ వారు లేదా వీరందరూ ఎవరో తెలిపి, ఎప్పుడు, ఎక్కడ అన్నారో కూడా తెలిపారంటే ఆ రచన యొక్క ప్రామాణికత ఎన్నోరెట్లు మెరుగుపడుతుంది. మరొకసారి గుర్తుంచుకోండి, వికీపీడియా మీ అభిప్రాయాలను తెలుపటానికి ఒక వేదిక కాదు.

ఇది తెలుగు భాషలో ఉన్న వికీపీడియా కాబట్టి మీ మూలాలను సాధ్యమయినంత వరకూ తెలుగులో ఉండేటట్లు చూడండి. ఒక వేల తెలుగులో సరయిన మూలాలు దొరకకపోతే, అప్పుడు ఆంగ్లంలో ఉండే మూలాలను సూచించండి.

[మార్చు] వ్యాసాలలో ఉన్న సమాచారాన్ని పరిశీలించినప్పుడు

మీరు చేర్చని విషయాలకు కూడా మీకు తెలిసిన మూలాలు ఏమయినా ఉంటే వాటిని కూడా చేర్చవచ్చు. చేర్చేముందు ఒక సారి పరిశీలించి చేర్చండి. అంతే కాదు వ్యాసానికి మూలాలను చేర్చడం వికీపిడియాలో చాలా గొప్ప కృషిగా భావిస్తారు. వాక్యాలకు పక్కనే మూలాలకు సంబందించిన లిఖులు గానీ సమాచారం కానీ ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే వాటిని మీరు రాస్తున్న వాక్యాల పక్కనే ఉంచటం మంచిది.

[మార్చు] వాస్తవానికి సంబందించిన గొడవలు జరుగుతున్నప్పుడు

గొడవకు కారణమయిన వ్యాస బాగాన్ని వెంటనే చర్చా పేజీనకు తరలించండి. ఒకవేళ ఆ వ్యాస భాగం అంత కీడు తలపెటేది కాదు అని అనుకున్నప్పుడు, లేదా దానికి సంబందించిన ఒక మూలాన్ని చేరిస్తే సరిపోతుంది అని భావించినప్పుడు {{మూలాలు అవసరం}} అనే మూసను ఆ వ్యాస బాగం తరువాత ఉంచండి. {{ మూలాలు సమీక్షించండి}} అనే మూస మరిన్ని సందర్బాలలో ఉపయుక్తంగా ఉంటుంది.

[మార్చు] వాస్తవానికి సంబందించిన గొడవలు జరుగుతుందని అనుకున్నప్పుడు

ముందుగానే ఊహించండి: మీరు చేర్చిన విషయం మీద ఎవరికయినా సందేహం కలుగవచ్చేమో అనే విషయాన్ని ఆలోచించండి. వికీపిడియాలో మీరు చేర్చిన సమాచారానికి ఊతంగా ఏదయినా మంచి మూలాన్ని చేర్చినట్లయితే అప్పుడు ఇతర సబ్యులు ఆ సమాచారాన్ని తొలగించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

[మార్చు] సమాచారం ఎక్కడ లబించిందో తెలుపండి

మూలాలను తెలిపేటప్పుడు సాదారణంగా జరిగే తప్పు, అసలు సమాచారం ఇంకోదగ్గర ఉంది అని తెలిపిన మధ్యవర్తి గురించి తెలుపకపోవటం. ఉదాహరణకు మీరు ఒక వెబ్ సైటులో ఒక విషయాన్ని గురించి చదివారు, అదే వెబ్‌సైటులో ఆ సమాచారాన్ని ఫలానా పుస్తకం నుండి సేకరించబడినదని తెలుపుతారు, అలాంటప్పుడు మీరు స్వయానా ఆ పుస్తకాన్ని చదవందే దానిని వికీపిడియా మూలాలలో చేర్చకూడదు, ఆ మధ్యపర్తి అయిన వెబ్‌సైటు యొక్క చిరునామాని మాత్రమే మూలాలలో చేర్చాలి. అలాంటి వాటిని మూలాలలో ఇలా చేర్చాలి:

  • <ఫలానా వెబ్‌పేజీ>, <ఫలానా పుస్తకం నుండి> ఈ సమాచారాన్ని సేకరించింది, లేదా
  • <ఫలానా పుస్తకం>, <ఫలానా వెబ్‌పేజీ> లో మూలంగా తీసుకున్నప్పుడు సమాచారం తెలిసింది.

మీరు ఆ పుస్తకాన్ని చదవనంత వరకూ దానినొక్క దానినే మూలాలలో ఉంచకూడదు. ఒక సారి మీరు ఆ పుస్తకాన్ని చదివేసినప్పుడు మాత్రం దానినొక్క దానినే మూలలలో ఉంచవచ్చు. కానీ వెబ్‌పేజీలో కూడా ఇంకొంచెం మంచి సమాచారం దొరుకుతుందని అనుకున్నప్పుడు పాఠకులకు దాని గురించి కూడా తెలుపవచ్చు. ఇలా:

  • <ఫలానా పుస్తకం> (<ఫలానా వెబ్‌పేజి> కూడా చూడండి).

దీని వెనుక ప్రధాన ఉద్దేశం మీరు సేకరించిన సమాచారం మొత్తం, మీ పాఠకులు ఎటువంటి సందేహాలు లేకుండా జీర్నించేసుకోవడానికి.

[మార్చు] మూలాలను వ్యాసాలలో చేర్చే విధానం

వికిపీడియాలో మూలాలను రెండు రకాలుగా చేర్చవచ్చు. మొదటిరకంలో మీరు రాస్తున్న వ్యాస భాగంలో సమాచారం చేర్చిన దగ్గరే మూలాన్ని కూడా ప్రస్తావించవచ్చు. లేదా వాటన్నిటినీ వేరుగా మూలాలు అనే విభాగంలో చేర్చవచ్చు. మూలాలను ఏరకంగా చేర్చినాకూడా వాసాన్ని చదివేవారికి ఒకే రకంగా కనిపిస్తాయి. కాకపోతే వ్యాసాన్ని మార్పులు చేసేవారికి ఏదో ఒక రకమయిన విధనమే నచ్చవచ్చు. అప్పుడు వారు వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.

[మార్చు] విధానం ఒకటి

ఈ విధానంలో మీరు ఎటువంటి మూసలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ పద్దతిలో మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ క్రింది విధముగా చేర్చాలి.

<ref name="మూలం పేరు"> ఒకటో రచయిత, రెండో రచయిత, (2001)లో రాసిన ఫలానా పుస్తకంలోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: అఆఇఈ ప్రచురణలు </ref> ఇలా మీరు చేరుస్తున్న సమాచారానికి రుజువులుగా, సమాచారం తోనే చేర్చేయండి. ఆ తరువాత మూలాలు లేదా రిఫరెంసులు విభాగంలో <references /> అనే దానిని తగిలిస్తే సరిపోతుంది.


ఉధాహరణ

ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు.
ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు
<ref name=ఆంగ్లం1> [http://en.wikipedia.org/wiki/Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference వికీపీడియాను మూలంగా ఉపయేగించవచ్చా?] </ref>
<ref name=ఆంగ్లం2> [http://en.wikipedia.org/wiki/Wikipedia:Why_Wikipedia_is_not_so_great వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?] </ref>.

ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు [1] [2].

 <references /> 
  1. వికీపీడియాను మూలంగా ఉపయేగించవచ్చా?
  2. వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?

[మార్చు] విధానం రెండు

ఈ క్రింది మూసలను కూడా మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ విధముగా ఉపయోగించాలి.

{{చూడు|పేరు}} - ఈ మూసను వ్యాసము మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుండి. మీరు చేర్చబోయే ఏదయినా అంశమునకు ఆధారాలు, రుజువులు అవసరమయిన చోట్ల ఈ మూసను తగిలించండి. పేరు అనేది మీరు ఇచ్చే ఆధారాలకు లేదా మూలాలకు గుర్తుగా, వ్యాసములో ఉన్న మరే ఇతర పేర్లతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇవ్వవలిసిన నామము. దీంతో మీరు చేర్చిన విషయం నుండి మూలాన్ని చేరుకోవడానికి ఒక లింకు ఏర్పడుతుంది.

{{మూలం|పేరు}} - ఈ మూసను మూలాలు లేదా రిఫరెంసులు విభాగాలలో, మూలాల చిరునామాకు ముందు తగిలించవలసి ఉంటుంది. దానివలన ఒక ఈ మూలము నుండి ఏ విషయానయితే సేకరించారో ఆ వివరణకు ఒక లింకు ఏర్పడుతుంది.


ఉధాహరణ

ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు.
ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు  {{చూడు|en3}} {{చూడు|en4}}. 

ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు [1] [2].

# {{మూలం|en3}} [http://en.wikipedia.org/wiki/Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference వికీపీడియాను మూలంగా ఉపయేగించవచ్చా?]
# {{మూలం|en4}} [http://en.wikipedia.org/wiki/Wikipedia:Why_Wikipedia_is_not_so_great వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?]
  1. ^ వికీపీడియాను మూలంగా ఉపయేగించవచ్చా?
  2. ^ వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?

[మార్చు] ఎటువంటి మూలాలను చేర్చాలి

[మార్చు] ఇంటర్‌నెట్‌లో వెబ్‌పీజీలకు లింకున మూలాల పేజీలను తొలగించినప్పుడు ఏంచేయాలి?

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com