పింగళి సూరన
వికీపీడియా నుండి
శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో ఒకడైన పింగళి సూరన రాఘవపాణ్డవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేషా కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారతేతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
అష్టదిగ్గజములు |
---|
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |