వెంకటేష్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీసు రికార్డు కలిగిన రామనాయుడు కుమారుడు. ఈయన డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. వెంకటేష్ అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయములో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుర్లు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు 57 సినిమాలలో నటించిన ఈయన 4 నంది అవార్డులు గెలుచుకున్నాడు.
వెంకీ చాలా మంది హీరొయిన్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసారు. ఫరా,తబు,దివ్యభారతి,గౌతమి,ప్ర్రేమ, ఆర్తీ అగర్వాల్,ప్రీతి జింతా,కత్రినా కైఫ్,అంజలా జవేరి మొదలగు వారిని వెంకీ తెలుగులొ పరిచయం చేసారు. సౌందర్యతొ వెంకీది హిత్ ఫేర్.సౌందర్య తొ ఆయన ఏడు సినిమాలు చేసారు. మీనా తొ నాలుగు సినిమాలు సారు. ఆనాలుగు విజయం సాధించాయి. అవి చంటి,సుందరకాండ,అబ్బాయిగారు,సూర్యవంశం. ఆర్తీ అగర్వాల్ తొ మూడు సినిమాలు చేసారు.అవి నువ్వు నాకు నచ్చావు,వసంతం,సంక్రాంతి.ఆమూడు కూడా విజయం సాధించాయి. వెంకీ రాఘవేంద్రరావు దర్సకత్వంలొ ఎక్కువ సినిమాలు చేసారు. ప్రేమ,ధర్మచక్రం,గనేష్,కలిసుందాం రా సినిమాలు వెంకీకీ నంది అవార్దులను అందించాయి.