“పౌండు కేకు” కి ఆ పేరు ఎందుకు వచ్చింది?
వికీపీడియా నుండి
20. “పౌండు కేకు” కి ఆ పేరు ఎందుకు వచ్చింది?
నేను అమెరికా వచ్చిన కొత్తలో మొట్టమొదట “పౌండు కేకు” అన్న మాటని విన్నాను. మూమూలు కేకులులా మెత్తగా, చెమ్మగా ఉండకుండా ఈ పౌండు కేకు కొంచెం గట్టిగా, చెమ్మదనం లేకుండా – మన దిబ్బ రొట్టి మాదిరి - ఉంటుంది. ఈ కేకు చెయ్యటానికి ఒక పౌను పిండి, ఒక పౌను పంచదార, ఒక పౌను వెన్న, ఒక పౌను గుడ్లు కావాలి. అందుకని దీనికి పౌండు కేకు అన్న పేరు వచ్చింది.
మనదేశంలో ఆవకాయ పెట్టటానికి కూడా ఈ రకం మంత్రమే ఉంది. ఒక తవ్వెడు ఆవ పిండి, ఒక తవ్వెడు ఉప్పు, ఒక తవ్వెడు కారం కలిపి అందులో తవ్వెడు నువ్వుల నూనె పోసి తయారు చేస్తే శ్రేష్ఠమైన ఆవకాయ వస్తుందని విన్నాను. కనుక దీనిని తవ్వావకాయ అంటే ఎలా ఉంటుందంటారు?