ముత్యాలముగ్గు
వికీపీడియా నుండి
ముత్యాలముగ్గు (1975) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | శ్రీధర్ , సంగీత, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్,మాడా, బేబీ రాద, మాస్టర్ మురళి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ రామ చిత్ర |
భాష | తెలుగు |
పాటలు: సి.నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర
నిర్మాత: ఎమ్.వీ.ఎల్ - మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహరావు
ఇది తెలుగు ప్రక్షకులు చిరకాలం గుర్తుంచుకోవలసిన ఆణిముత్యం. బాపు దర్శకత్వం, ముళ్ళపూడి వెంకట రమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు బాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావుగోపాలరావు నటనలో ఒక కలికితురాయి.
ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా (అల్లు రామలింగయ్య) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమె భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయస్వామి అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.
[మార్చు] హిట్టయిన పాటలు
- ఏదో ఏదో అన్నది. ఈ మసక వెలుతురు. గూటిపడవలోవిన్నది. కొత్త పెళ్ళి కూతురు
- నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నులలో నీరు తుడిచి కమ్మని కథ చెప్పింది.
- ఎంతటి రసికుడవో తెలిసెరా.... ఎంతసేపు నీ తుంటరి చూపు
- ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా, మత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయా
[మార్చు] హిట్టయిన "డవలాగులు"
ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఒకటి కాదు. దాదాపు అన్నీను. వాటిని తూర్పు గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.
- అల్లొల్లొల్లొ - జోగినాధం గారా
- సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
- అబ్బో ముసలాడు రసికుడేరా!
- సెరిత్ర సెరిపేసత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
- ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా
- ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త
అయితే ఒక్కసారి వచ్చిన మాడా "డవలాగులు" ఊరూరా మోగిపోయాయి
- మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత? వో లొమొత్తం మీత ఏమయినా కన్సెషను ఉంటుందా?